CBN Case : చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ మరో కుట్ర..!
ABN, First Publish Date - 2023-09-28T16:57:48+05:30
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును (Chandrababu) మరింత ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ (Jagan Govt) ప్రయత్నాలు చేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case)...
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును (Chandrababu) మరింత ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ (Jagan Govt) ప్రయత్నాలు చేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అక్టోబరు-03న విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ రోజున కచ్చితంగా శుభవార్త ఉంటుందని ముందుగానే పసిగట్టిన జగన్ సర్కార్ మరో కుట్రకు తెరలేపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మేమూ వాదిస్తాం..!
చంద్రబాబు కేసులో ఏపీ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కోర్టులో జగన్ సర్కార్ కేవియట్ పిటిషన్ (Caveat Petition) దాఖలు చేసింది. బాబుపై నమోదయిన కేసులో తమ వాదన కూడా వినాలని కోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కేసులో ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని కేవియట్ పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. అక్టోబర్-03న (October-3) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై (Quash Petition) సుప్రీంలో విచారణ జరగనున్నది. ఆ విచారణ సమయంలో ఏకపక్షంగా కాకుండా తమ వాదనలు సైతం విని ఆ తర్వాతే ఉత్తర్వులు, తీర్పులు ఇవ్వాలని కేవియట్ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొన్నది.
లేనిపోని ఆరోపణలు..!
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారని.. నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్ చేసుకున్నారని జగన్ సర్కార్ లేనిపోని ఆరోపణలు చేస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయని.. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీ శాఖ ప్రభుత్వం చెబుతోంది. అందుకే.. ఈ కేసులో కేవియేట్ పిటిషన్‌ను విచారిస్తే తమ వాదన కోర్టు ముందుంచుతామని ఏపీ ప్రభుత్వం.. న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. దీన్ని బట్టి చూస్తే.. చంద్రబాబును ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడానికి జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
కేవియట్ పిటిషన్ అంటే..!?
కేవియట్ పిటిషన్ అంటే సెక్షన్-148 (ఏ) సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం.. పై కోర్టులో అంటే ఏ కోర్టులో అయితే గెలుస్తారో ఆ పైన ఉండే కోర్టులో కేవియట్ పిటిషన్ వేస్తుంటారు. కేవియట్ అంటే కేసు వేసిన వారు అవతల పార్టీ వారికి నోటీసు ఇచ్చి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కోర్టు ఆ కేసు ఏంటనేది నిశితంగా వింటుంది. తదనుగుణంగా విచారణ చేసి ఇవ్వాల్సిన మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుంది. కేవియట్ పిటిషన్ లైఫ్ 3 నెలలపాటు ఉంటుంది. ఇలా కేవియట్ పిటిషన్‌ను ఉపయోగించుకోవచ్చని న్యాయ నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు.
ఏం జరుగుతుందో..?
మొత్తానికి చూస్తే.. అక్టోబర్-03న చంద్రబాబు కేసు విషయంలో తీర్పుకు సంబంధించి‘బిగ్ డే’ అని చెప్పుకోవచ్చు. అటు చంద్రబాబు తరఫున లాయర్లు.. ఇటు ప్రభుత్వం తరఫున.. సీఐడీ తరఫున లాయర్లు అంతా సుదీర్ఘంగా వాదనలు వినిపించే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఈ వాదనలు వినడానికే ఒకరోజు అంతా సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. అంతా మంచే జరుగుతుందని న్యాయం తమవైపే ఉందని.. సుప్రీంకోర్టు శుభవార్తే చెబుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇలా కేవియట్ పిటిషన్ దాఖలు చేయడంతో తీర్పు ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
YuvaGalam : నాన్నకు ప్రేమతో.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా
Updated Date - 2023-09-28T17:03:53+05:30 IST