ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanna Joined TDP: పసుపు కండువా కప్పుకున్న గంటల వ్యవధిలోనే టీడీపీ- జనసేన పొత్తుపై కన్నా కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే వారంతా..

ABN, First Publish Date - 2023-02-23T21:47:31+05:30

ఏబీఎన్ (ABN) డిబేట్లో టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కీలక (Kanna Lakshminarayana) వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏబీఎన్ (ABN) డిబేట్లో టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కీలక (Kanna Lakshminarayana) వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఏకంగా కావాలన్నారు. ప్రస్తుతం ఉన్న రాక్షస పాలనను వదిలించడానికి ఓటు చీలకుండా అందరూ కలిసి రావాలని పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారని కన్నా అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ, జనసేన (TDP, Jana Sena) కలిసి పనిచేయాలనేది ప్రజల ఆకాంక్ష అని కన్నా చెప్పారు. ఇదీ రాజకీయ నాయకుల ఆకాంక్ష కాదని కన్నా స్పష్టం చేశారు. రాక్షస పాలనను రాష్ట్రం నుంచి వదిలించుకోవాలంటే జనసేన, టీడీపీ పార్టీలు కలిస్తేనే సాధ్యం అనే మాట ప్రజలు చెబుతున్నారని, టీడీపీ, జనసేన పొత్తును ప్రజలు కోరుకుంటున్నారని కన్నా చెప్పారు. పొత్తుపై ప్రజాభిప్రాయం మేరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని కన్నా తెలిపారు. తనను ఏజెంట్ అంటూ ప్రచారం చేశారని కన్నా మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా తిరుపతి వచ్చిన తర్వాత ప్రజాఉద్యమంలో బీజేపీ ఎందుకు పాల్గొనడం లేదని అమిత్ షా మందలించారని తెలిపారు. అప్పటి నుంచి అమరావతి గురించి మాట్లాడితే వాళ్లను బీజేపీ ఏం అనడం లేదని, అంతర్గతంగా కోపంగా ఉన్నారని ఆయన అన్నారు.

బీజేపీలోని అసంతృప్తులపై..

ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని, వైసీపీ అరాచక శక్తులను ఎదుర్కొవాలంటే టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, వైసీపీ రాక్షన పాలనను పారదోలడానికి ఓట్లు చీలకుండా చూడాలని కన్నా స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీలో పలువురు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని, బాహాటంగానే వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. మొత్తానికి చూస్తే కన్నా తర్వాత చాలా మంది అసంతృప్తులు బీజేపీకి గుడ్‌బై చెబుతారని తెలుస్తోంది.

అమరావతి భవిష్యత్పైనే ఏపీ భవిష్యత్ ఆధారపడి ఉందని, 3 రాజధానులు అన్నప్పుడే ఏపీ భవిష్యత్ నాశనమవుతుందని చెప్పానని, అమరావతి రాజధాని ఉండాలనే ఉద్దేశంతోనే తాను టీడీపీలో చేరానని కన్నా స్పష్టం చేశారు. భీమవరంలో పొటికల్ నిర్మానం చేసినప్పుడు భావసారూప్యం కలిగిన రాజకీయ పార్టీలు, ప్రజలతోనే పొత్తు ఉంటుందని బీజేపీ నేతలు చెప్పారని, జనసేనతో పొత్తు అని చెప్పలేదని కన్నా అన్నారు. బయట మీడియాకు మాత్రం జనసేనతో పొత్తు అని చెబుతున్నారని మండిపడ్డారు.

మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) గురువారం మధ్యాహ్నం టీడీపీ (TDP)లో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కండువా కప్పి కన్నాను పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులు కన్నాకు అపూర్వ స్వాగతం పలికారు. అలాగే గుంటూరు మాజీ మేయర్, కన్నా కుమారుడు నాగరాజు (Nagaraju), తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌ (Venkatesh Yadav), మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా సోదరుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఎమ్‌ నిజాముద్దీన్‌ (SM Nizamuddin) తదితరులు టీడీపీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్నా అనుచరులు, పలువురు సీనియర్ నాయకులు వేలాది మంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అంతకుముందు కన్నా లక్ష్మినారాయణ గుంటూరులోని తన నివాసం నుంచి 3 వేల మంది కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తరలి వచ్చారు. కాగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న కన్నా... ఇప్పటికే తన అనుయాయులతో సమావేశమై వారిని తనతో పాటు పార్టీలో చేర్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

నిత్యం జనం మధ్య ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే కన్నాకు ఏ పార్టీలో ఉన్నా జనాదరణ మెండుగా ఉంటుందని.. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కాపు సామాజికవర్గంలో ఎంతో పట్టుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయన చేరికను వారంతా స్వాగతించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు కన్నా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు.

Updated Date - 2023-02-23T21:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising