ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections: కర్ణాటకలో మరోసారి హంగ్‌ తప్పదా...?

ABN, First Publish Date - 2023-04-30T21:08:29+05:30

కర్ణాటక శాసనసభ ఎన్నికలు (Karnataka Assembly Elections) కేవలం రాష్ట్రానికే పరిమితం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికలు (Karnataka Assembly Elections) కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా మరో ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు దిశా నిర్దేశం కానున్నాయి. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్‌, బీజేపీలకు అనుకూలంగా ఉన్న ఏకైక రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు రెండు పార్టీలు భారీగా కసరత్తు చేస్తున్నాయి. మరో తొమ్మిది రోజుల్లో పోలింగ్‌ జరగనుండగా.. ఓవైపు సర్వేలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

కర్ణాటకలో మరోసారి హంగ్‌ ఏర్పడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అధికార బీజేపీ (BJP), ప్రతిపక్ష కాంగ్రెస్‌ (Congress) పార్టీలకు ఒక్కో సర్వే ఒక్కోరకంగా అధికారం మీదే అంటూ వెల్లడిస్తున్నాయి. మరికొన్ని సర్వేలు జేడీఎస్‌ (JDS) పార్టీకి 25 సీట్లకుపైగా వస్తాయని చెబుతున్నాయి. ఒకవేళ జేడీఎస్‌కు 25 సీట్లు వస్తే 2018 నాటి పరిస్థితే పునరావృతం అవుతుంది. రాష్ట్రంలో 224 నియోజకవర్గాలు ఉండగా.. 2018లో బీజేపీకి వంద సీట్లు వచ్చినా అధికారం చేపట్టలేకపోయింది. చివరి క్షణంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

ప్రస్తుతం కాంగ్రెస్‌కు 100కుపైగా సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని సర్వేలు బీజేపీకి 90-100 దాకా వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఇవే ఫలితాలు వస్తే 25కుపైగా సీట్లతో జేడీఎస్‌ మరోసారి కింగ్‌మేకర్‌ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. 2018 సంకీర్ణ ప్రభుత్వంలో అవమానాలు ఎదుర్కొన్నామని జేడీఎస్‌ నేత కుమారస్వామి ఎన్నో సందర్భాల్లో వాపోయారు. కాంగ్రెస్‌ వారే తమ గడప తొక్కి బేషరతుగా మద్దతు ఇస్తామంటూ ఏడాదిన్నరలోనే ప్రభుత్వాన్ని కూల్చారని మండిపడ్డారు.

ఈ పరిణామాన్ని బట్టి కుమారస్వామి.. బీజేపీ వైపు వెళ్తారనే సంకేతాలు ఇచ్చినట్టుంది. మూడు రోజుల క్రితం హాసన్‌ బీజేపీ ఎమ్మెల్యే ప్రీతంగౌడ మాట్లాడుతూ జేడీఎస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్టే అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జేడీఎస్‌ నేత దేవెగౌడ చర్చలు జరిపారని, బీజేపీతో పొత్తు ఏర్పడుతుందని తెలిపారు. తాజాగా శనివారం జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఓ ఇంటర్వ్యూలో జాతీయ పార్టీ దూతలు తన చెంతకు వచ్చారని పేర్కొన్నారు. వారిని కుమారస్వామి వద్దకు పంపించినట్లు తెలిపారు. తనకు వయసు పైబడిందనీ, అటువంటి ఒత్తిడితో కూడిన బాధ్యతలను చేపట్టడం కష్టమన్నారు. అదంతా కుమారస్వామి చూసుకుంటారని చెప్పారు. మైత్రి ప్రయత్నాలు సాగుతున్నాయంటూనే జేడీఎస్‌ సొంతంగా అధికారంలోకి వస్తుందన్నారు.

Updated Date - 2023-04-30T21:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising