KCR: కేసీఆర్ తలుపు తడుతున్న అదృష్టం..
ABN, First Publish Date - 2023-03-05T19:37:20+05:30
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కేసీఆర్ మూడవ పర్యాయయం కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం బలంగా ఉంది.
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రయోజనాలకు భిన్నంగా మజ్లిస్ వ్యవహరంచకపోవచ్చు. ప్రస్తుతానికి ప్రతికూలంగా ఉన్నాయి. ఈ ప్రతికూలతను అధికమించి అధికారంలోకి రావాలంటే బీజేపీ ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అదే సమయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడలను రూపొందించుకోవాలి. ఈ కారణంగా ప్రస్తుతానికి కేసీఆర్ అదృష్టవంతుడుగానే కనిపిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఆయనకు కలలు నెరవేరుతాయోలేదో కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి తెలంగాణలో మాత్రం ఆయన మేలు జరిగే అవకాశమే ఉంది. అలా జరగకుండా ఉండాలంటే.. కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీని ప్రత్యామ్నాయంగా ప్రజలే ఎంచుకోవాలి. తెలంగాణ ప్రజలలో ఈ విజ్ఞత లేకపోలేదు. కేసీఆర్ అదృష్టం అదృష్టవంతుడుగా నిలబడతాడో.. దురదృష్టవంతుడుగా మిలిగిపోతాడో చూద్దాం..
అదృష్టవంతుడిని చెరిపేవారు.. దురదృష్టవంతుడిని బాగుచేసేవాడు ఉండరని అంటారు. రాజకీయాల్లో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. తెలంగాణ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అదృష్టవంతుల జాబితాలో వేయాల్సి వస్తుందేమో.. రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలే ఇందుకు కారణం.. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాల్సిందే. తనకు వేరే పనేమీ లేదు. ఇకపై తెలంగాణపైనే దృష్టిపెడతాను' అని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇటీవల రాష్ట్ర పార్టీకి చెందిన కీలక నేతల వద్ద వ్యాఖ్యనించారు. ఆయన ఈ మాట చాలా రోజుల నుంచి అంటున్నారు. తెలంగాణలో ఎన్నికలకు మరో 9 నెలల వ్యవధి మాత్రమే ఉంది. క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఏదో తెలియని అయోమయం ఇప్పటికీ నెలకొనిఉంది. భారతీయజనతా పార్టీ పుంజుకున్నట్టు కొన్ని రోజులు, కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్టు మరికొన్ని రోజులు వార్తలు వస్తుంటాయి. ఈ రెండు పార్టీలలో కేసీఆర్‌ను ఢీకొట్టే పార్టీ ఏదో తెలియని అయోమయం ప్రజలలో ఇప్పటికీ నెలకొంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. కాంగ్రెస్‌ను కొట్టిపారేయలేని పరిస్థితి. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నందున బీజేపీ దూకుడు ప్రదర్శిస్తూ ఉంటుంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కేసీఆర్ మూడవ పర్యాయయం కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం బలంగా ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక దశలో బలపడుతున్నట్టు కనిపించింది. అంతలోనే సీనియర్స్ పేరిట ఆ పార్టీని.. అయితే ఆ పార్టీ ఒక స్థాయికి మించి పెరగడంలేదు అన్న అభిప్రాయం ప్రస్తుతం వినపడుతోంది. ఇందుకు కారణాలను గుర్తించడానికి నిరాకరిస్తోన్న బీజేపీ పెద్దలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మోడల్‌నే తెలంగాణలో కూడా అమలు చేస్తున్నారు. ఉత్తరాది రాజకీయాలు వేరు. దక్షిణాది రాజకీయాలు వేరు అన్న విషయం భారతీయ జనతా పార్టీ పెద్దలు గుర్తించడం లేదు.
Updated Date - 2023-03-05T20:02:16+05:30 IST