ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kotamreddy : నెల్లూరు రూరల్‌లో ఒక్కసారిగా మారిపోయిన రాజకీయ పరిణామాలు.. కోటంరెడ్డి‌పై పోలీసులకు ఫిర్యాదు.. టెన్షన్.. టెన్షన్

ABN, First Publish Date - 2023-02-03T17:56:21+05:30

వైసీపీ అధినాయకత్వంపై (YSRCP High command) ధిక్కారస్వరం వినిపించాక నెల్లూరు రూరల్‌లో (Nellore Rural) రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు : వైసీపీ అధినాయకత్వంపై (YSRCP High command) ధిక్కారస్వరం వినిపించాక నెల్లూరు రూరల్‌లో (Nellore Rural) రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీ (YSR Congress) తరఫున పోటీచేయనని తేల్చిచెప్పేసిన కోటంరెడ్డి తన కేడర్‌ను రక్షించుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మొదట కార్పొరేటర్ల (Corporators) నుంచి పని మొదలుపెట్టారు ఎమ్మెల్యే. 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్‌రెడ్డి (Vijayabhaskar Reddy) తన కార్యాలయంలో కోటంరెడ్డి ఫ్లెక్సీలు, ఫొటోలు (Flexes and Photos) తొలగించి.. నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. తన వర్గం నుంచి బయటికెళ్లొద్దని సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

అయితే.. ఆ చర్చలు ఫలించకపోగా సీన్ రివర్స్ అయ్యింది. తన ఇంట్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి దౌర్జన్యం చేశారంటూ కార్పొరేటర్ ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు తన ఇంటికొచ్చి భయపెట్టారని కార్పొరేటర్ చెబుతున్నారు. ఇదే విషయమై స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో (Police Station) ఫిర్యాదు చేశారు కార్పొరేటర్. దీంతో పీఎస్ వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. మరోవైపు.. నెల్లూరు జిల్లా పడారుపల్లిలో కార్పొరేటర్ ఇంటి ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఏం జరుగుతుందో..!

మొత్తానికి చూస్తే.. నెల్లూరు రూరల్ వైసీపీలో మళ్లీ రగడ మొదలైంది. ఈ వ్యవహారాన్ని నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి (Adala Prabhakar reddy) సీరియస్‌గా తీసుకుంటారని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయం గురించి తెలుసుకున్న ఆదాల అసలేం జరిగింది..? అని కార్పొరేటర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు..? పోలీసులు ఫిర్యాదు స్వీకరిస్తే ఏం జరుగుతుంది..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. రూరల్‌లో అసలేం జరుగుతోందో తెలియక అటు కోటంరెడ్డి అభిమానులు (Kotamreddy Fans).. ఇటు వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

ఇబ్బందులు మొదలు..!

ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ (phone tapping) జరిగిందని ఆధారాలతో బయటపెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వేధింపులు, కక్ష సాధింపులు మొదలయ్యాయి. కోటంరెడ్డికి ఏ పని చేయొద్దంటూ జిల్లా అధికారులకు పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. సీనియర్ నేతలకే వేధింపులు మొదలవ్వడంతో జిల్లా ప్రజా ప్రతినిధులు ఆందోళనలో ఉన్నారు. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయేమోనని భయపడుతున్నారు. సొంతపార్టీ పెద్దల తీరుపై లోలోన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్యాపింగ్ నిరూపణ జరిగితే వైసీపీ ప్రభుత్వానికి చిక్కులు తప్పవనే చర్చ జరుగుతోంది. గతంలో ట్యాపింగ్ వ్యవహారాలు ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీ వర్గాల్లో ట్యాపింగ్ అంశమే ప్రధాన చర్చగా మారింది.

Updated Date - 2023-02-03T18:44:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising