ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nalgonda కాంగ్రెస్‌లో కుమ్ములాట..ఒకవైపు Revanth Reddy వర్గం..మరోవైపు MPల వర్గం..అసలు ఏం జరుగుతోంది?..

ABN, First Publish Date - 2023-02-11T11:35:06+05:30

తెలంగాణ కాంగ్రెస్‌ దిగ్గజాలంతా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ కాంగ్రెస్‌ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతుంటాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరిందా?.. కాంగ్రెస్ సీనియర్ నేతలు వారికి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారా?.. సీనియర్ల ఆధిపత్య పోరుతో కాంగ్రెస్‌లో గ్రూపులు ఏర్పడుతున్నాయా?.. నల్గొండ కాంగ్రెస్‌లో రేవంత్‌ వర్గం, ఎంపీల వర్గాలు తయారయ్యాయా?.. లీడర్ల తీరుతో క్యాడర్‌ అయోమయానికి గురవుతోందా?.. కాంగ్రెస్‌ వర్గపోరుకు మిర్యాలగూడ వేదికైందా?.. ఇంతకీ.. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ ఏం జరుగుతోంది?.. సీనియర్ల మధ్య ఆధిపత్య పోరుకు కారణాలేంటి?...అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

రేవంత్‌రెడ్డికి తలనొప్పిగా మారిని నల్గొండ

తెలంగాణ కాంగ్రెస్‌ దిగ్గజాలంతా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ కాంగ్రెస్‌ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతుంటాయి. ఆ క్రమంలోనే.. ఆయా నేతల రాజకీయాలు ఇప్పుడు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి తలనొప్పిగా మారాయి. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా.. రేవంత్‌ సహకారంతో చివరికి జానా అనుచరుడైన శంకర్ నాయక్‌నే కొనసాగించేలా చేసుకున్నారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో జానారెడ్డికి గట్టి పట్టుంది. దాంతో.. మిర్యాలగూడ నుంచి ఆయన.. లేకుంటే.. కుమారుడు రఘువీర్‌ను అసెంబ్లీ బరిలో దింపాలనే యోచనతో స్థానికంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకే.. శంకర్‌నాయక్‌కు డీసీసీ పదవి ఇప్పించి రాజకీయ లబ్ది చేకూరేలా వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. గతంలో.. మిర్యాలగూడలో స్థానిక నేత బత్తుల లక్ష్మారెడ్డికి మద్దతుగా నిలిచారు.

రేవంత్‌ వర్గం ఓ వైపు.. ఎంపీల వర్గం మరోవైపు

మరోవైపు.. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా రేవంత్‌రెడ్డిపై వ్యతిరేకతతో ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితులే చెప్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ రాజకీయాలు.. రేవంత్‌ వర్గం ఓ వైపు.. ఎంపీల వర్గం మరోవైపుగా అన్నట్లు మారాయి. తాజాగా.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్‌లో వర్గపోరు ఒక్కసారిగా బట్టబయలైంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్‌నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి మధ్య వివాదం చినికిచినికి గాలివానలా తయారైంది. పార్టీ కార్యక్రమం నిర్వహణపై ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. రెండు వర్గాలు పార్టీ కార్యాలయంలోనే గల్లాలు పట్టుకొని కొట్టుకునే వరకు పరిస్థితులు వెళ్లాయి. అక్కడితో ఆగకుండా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్ క్యాడర్‌లో అయోమయం

వాస్తవానికి.. టీపీసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఎల్ఐసీ ప్రైవేటీకరణ నిరసన కార్యక్రమం.. కాంగ్రెస్‌లోని ఇరువర్గాల మధ్య రగడకు దారితీసింది. శంకర్‌నాయక్‌కు రేవంత్‌రెడ్డి, జానారెడ్డి ఆశీస్సులు ఉండగా.. బత్తుల లక్ష్మారెడ్డికి ఉత్తమ్, వెంకట్‌రెడ్డి మద్దతు ఉంది. అయితే.. మిర్యాలగూడలో సీనియర్ల ఆధిపత్యం కోసం ఇప్పటినుంచే గ్రూప్ రాజకీయాలు మొదలు కావడంతో కాంగ్రెస్ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. అంతేకాదు.. జిల్లాలో రేవంత్ అనుచరులకు వ్యతిరేకంగా ఎంపీల వర్గం తయారు కావడంతో నల్గొండపై ఆయనకు పట్టు లేకుండా చేసేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. దాంతో.. నల్గొండ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి.

కాంగ్రెస్‌ నేతలు ఒక్కటవుతారా?..

మొత్తంగా.. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ వేదికగా కాంగ్రెస్‌ వర్గపోరు మరోసారి బట్టబయలు అయింది. నల్గొండ కాంగ్రెస్‌ సీనియర్ నేతలు ఎవరికివారు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తుండడం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ఏదేమైనా.. అసెంబ్లీ ఎన్నికల నాటికైనా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఒక్కటవుతారా?.. లేక.. ఎవరికివారు వర్గాలుగా మారి.. కయ్యానికి కాలుదువ్వుతారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Updated Date - 2023-02-11T11:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising