ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN Arrest : మంత్రి కేటీఆర్‌కు నారా లోకేష్ ఫోన్.. అనుమతివ్వాలని రిక్వెస్ట్

ABN, First Publish Date - 2023-09-26T16:49:21+05:30

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతిచోటా..

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతిచోటా ధర్నాలు, ర్యాలీలకు పిలుపునిచ్చి చంద్రబాబుకు సంపూర్ణ మద్దతిస్తున్నారు. మరీ ముఖ్యంగా బాబు బాటలు వేసిన ఐటీతో ఉద్యోగాలు సంపాదించుకున్న ఐటీ ఉద్యోగులు (IT Employees) ఇప్పుడు మద్దతుగా రోడ్ల మీదికొచ్చి బైక్, కారు ర్యాలీలతో మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. అయితే.. హైదరాబాద్ వేదికగా ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఈ ర్యాలీలను తెలంగాణ పోలీసులు ఎక్కడికక్కడ భగ్నం చేస్తున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో పోలీసులు వర్సెస్ ఐటీ ఏద్యోగులుగా పరిస్థితులు మారాయి. అయితే.. భాగ్యనగరంలో జరుగుతున్న ఈ పరిణామాలపై తాజాగా మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించారు.


కేటీఆర్‌కు లోకేష్ ఫోన్..

నాకు నారా లోకేష్ ఫోన్ చేసి (Nara Lokesh Phone) ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు..? అని అడిగారు. శాంతి భద్రతలు ఏం కావాలని నేను అడిగాను. తెలంగాణ ఉద్యమ టైమ్‌లో కూడా ఐటీ కారిడార్‌లో ఆందోళనలు జరగలేదు. అప్పటి ప్రభుత్వాలు ఎలాంటి ర్యాలీలను అనుమతించలేదు. నాకు నారా లోకేష్, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ (Lokesh, YS Jagan, Pawan Kalyan) అందరూ దొస్తులే. నాకు ఆంధ్రలో ఎలాంటి తగాదాలు లేవు. ఇక్కడ లేని పంచాయితీ ఎందుకు పెడుతున్నారు..?. ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు..?. అసలు ఏపీతో మాకేంటి సంబంధం.. దాన్ని మాకు ఎందుకు చుడుతున్నారు. మాకు ఒక పార్టీగా ఆ అంశంపై ఎలాంటి అసక్తి లేదు. మా పార్టీ వాళ్లు ఏదైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతం. దానికి మా పార్టీకి సంబంధం లేదు..అది పార్టీ స్టాండ్ కాదుఅని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

మాకేంటి సంబంధం..?

చంద్రబాబు అరెస్ట్ కు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం. చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్‌లో కదా.. ధర్నాలు చేయాల్సింది కూడా ఏపీలోనే కదా..?. హైదరాబాద్‌లో ఎందుకు రాజకీయ ర్యాలీలు తీస్తున్నారు. పక్కింట్లో పంచాయతీని ఇక్కడ తీర్చుకుంటారా..?. శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా..?. వాళ్ల ఘర్షణకు హైదరాబాద్ వేదిక కావాలా..?. రాజమండ్రి, అమరావతి కర్నూలులో చేయకుండా ఇక్కడ రాద్దాంతం ఎందుకు..?. ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా. ఆ రెండు పార్టీలకు ఇక్కడ ఉనికి లేదు.. ఇక ఇక్కడ ఎందుకు పంచాయితీ..?. చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయనకు న్యాయస్థానంలో ఏం న్యాయం జరుగుతుందో అది జరుగుతోంది. కోర్టుల్లో ఉండగా బయటకు వచ్చి కామెంట్ చేయకూడదుఅని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-09-26T16:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising