ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TeluguDesam : ఎన్డీఏ మీటింగ్‌కు టీడీపీ.. తర్వాత జరగబోయేది ఇదేనా..?

ABN, First Publish Date - 2023-07-06T18:18:00+05:30

జూలై-18న ఎన్డీయే (NDA) కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి టీడీపీ (TDP) హాజరవుతోంది. ఇప్పుడీ వార్త జాతీయ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రముఖ చానెళ్లలో ప్రధాన వార్తగా నిలిచింది. గతంలో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య అంతగా సత్సంబంధాలు నడవలేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూలై-18న ఎన్డీయే (NDA) కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి టీడీపీ (TDP) హాజరవుతోంది. ఇప్పుడీ వార్త జాతీయ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రముఖ చానెళ్లలో ప్రధాన వార్తగా నిలిచింది. గతంలో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య అంతగా సత్సంబంధాలు నడవలేదు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని వార్తలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎన్డీయే సమావేశం జరుగుతుండటం.. ఈ సమావేశానికి టీడీపీ హాజరుకానుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. అయితే ఈ సమావేశం తర్వాత ఎన్డీఏలో చేరికపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్న, మొన్నటి వరకూ బీజేపీతో వైసీపీ అంటకాగుతోందని ఏ నోట చూసినా.. వార్తల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరిగింది. అయితే ఇప్పుడు సడన్‌గా ఎన్డీఏ సమావేశానికి టీడీపీ వెళ్తుండటంతో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది.

వ్యూహాత్మకంగా అడుగులు!

కాగా.. ఎన్డీఏ సమావేశానికి టీడీపీతో పాటు ఎల్‌జేపీ, అకాలీదళ్ తదితర పార్టీలు కూడా హాజరుకాబోతున్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఎన్డీఏ ఉన్న భాగస్వామ్యపక్షాలతో పాటు కొత్తగా కూటమిలోకి తీసుకునే వారికి కూడా సమావేశానికి హాజరుకావాలని బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ఈ క్రమంలోనే టీడీపీ,శిరోమణి అకాళీదళ్, లోక్ జనశక్తి (పాశ్వాన్) పార్టీలు సహా మరికొన్ని పార్టీలకు ఆహ్వానం అందినట్లు జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు హోరెత్తుతున్నాయి. 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఈ కీలక సమావేశం జరగబోతోంది. లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే.. కేంద్ర, రాష్ర్టాల పార్టీలో మార్పులు, చేర్పులు చేశాక ఎన్డీఏ విస్తరణకు కసరత్తు పూర్తి చేసిన తర్వాతే ఇలా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ముఖ్యులు కార్యాచరణకు పూనుకున్నారు. ఇప్పటికే పలు రాష్ర్టాల పార్టీల అధ్యక్షులను మార్చిన బీజేపీ పెద్దలు.. రెండు మూడ్రోజుల్లో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేయబోతున్నారు. ఈ కీలక సమావేశానికి లోపే మార్పులు, చేర్పులు జరగాలని.. వీలైతే కొత్తగా ఎన్డీఏలో చేరే ఒకట్రెండు పార్టీలకు కూడా కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి చూస్తే.. కూటమిని ఏర్పాటు చేసేందుకు విపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించిన వేళ ఎన్డీఏ ఇలా పార్టీలను ఆహ్వానించి మరీ సమావేశం ఏర్పాటు చేయడం పెద్ద చర్చకే దారితీసింది. అయితే ఈ సమావేశానికి ఇంకా ఎన్ని పార్టీలు హాజరువుతాయి..? ఇంకా ఎవరెవరితో బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది..? ఫైనల్‌గా ఏం జరుగుతుందనే విషయాలు తెలియాలంటే 18వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


Ponguleti Meets YS Jagan : తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిన తెలంగాణ రాజకీయాలు.. సీఎం జగన్‌తో పొంగులేటి భేటీ.. షర్మిల గురించే చర్చ..!


Kishan Reddy : ‘బండి’ని తప్పించి మరీ కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక ఇంత కథుందా.. అది కూడా రెండోసారి..!?



Updated Date - 2023-07-06T18:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising