ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Seethakka: ఈ ఒక్క సందర్భం చాలు సీతక్కకు ఎందుకంత క్రేజ్ ఉంటుందో చెప్పడానికి..

ABN, First Publish Date - 2023-07-14T14:03:13+05:30

ములుగు మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన ధనసరి సమ్మయ్య-సమ్మక్క గురువారం పోడు పట్టాను స్వీకరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో తండ్రి సమ్మయ్యకు ఎకరం 17గంటల భూమి పట్టాపాస్‌ పుస్తకాన్ని అందుకున్నారు. దీంతో ఆ దంపతులు ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. సర్పంచ్ అయితేనే కోట్లలో సంపాదన, ఎడాపెడా భూఆక్రమణలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆమె తల్లిదండ్రులు అందరిలానే భూ పట్టా పొందడం శెభాష్ అనిపించుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతక్క... తెలుగు సమాజానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అసలు పేరు ధనసరి అనసూయ అంటే అందరికీ గుర్తొస్తారో లేదో గానీ సీతక్క అని చెబితే మాత్రం ఠక్కున గుర్తుకొచ్చేస్తారు. ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ఫాలోయింగ్ ఆమె ప్రత్యేకత. నక్సలైట్ జీవితం నుంచి జనజీవన స్రవంతిలోకి, ఆ తర్వాత చదువు, అనంతరం రాజకీయ అరంగేట్రం.. ఇవన్నీ సీతక్కను ప్రత్యేక వ్యక్తిగా నిలుపుతున్నాయి. ఇక రాజకీయ జీవితంలోనూ ఆమె తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నారన్న పేరుంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని కొండ, కోనల్లోని గిరిపుత్రులతో సైతం ప్రత్యక్షంగా మమేకమవుతుంటారామె. సాదకబాధకాలు తెలుసుకొని చేయగలిగిన సాయం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా కరోనా ఆపత్కాలంలో ఆమె చేపట్టిన సహాయ కార్యక్రమాలు అందరిచేత ప్రశంసలు అందుకున్నాయి. అందుకే సీతక్క పార్టీలకు అతీతంగా విశిష్ఠ ఆదరణ కలిగివుంటారు. ఇదంతా ఇప్పుడెందుకు గుర్తుచేసుకోవాల్సిన వచ్చింది?. అసలు సందర్భం ఏంటి?. అని అనుకుంటున్నారా.. అయితే ఈ ప్రత్యేక కథనం చదవాల్సిందే.

తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్‌లలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం ఒకటి. రాష్ట్రమంతటా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఒక చోట అందరి మాదిరిగానే ఓ గిరిజన దంపతులు పోడు పట్టాను అధికారుల చేతుల మీదుగా అందుకున్నారు. ఆనందంతో మురిసిపోయారు. వారెవరో కాదు ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తిగా ఉన్నప్పటికీ సీతక్క తల్లిదండ్రులు మాత్రం రాష్ట్రంలోని గిరిజనులందరి మాదిరిగానే అధికారుల చేతుల మీదుగా పట్టాల పంపిణీ కోసం ఎదురుచూశారు. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన ధనసరి సమ్మయ్య-సమ్మక్క గురువారం పోడు పట్టాను స్వీకరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో తండ్రి సమ్మయ్యకు ఎకరం 17గుంటల భూమి పట్టాపాస్‌ పుస్తకాన్ని అందుకున్నారు. దీంతో ఆ దంపతులు ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. సర్పంచ్ అయితేనే కోట్లలో సంపాదన, ఎడాపెడా భూఆక్రమణలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆమె తల్లిదండ్రులు అందరిలానే భూ పట్టా పొందడం శెభాష్ అనిపించుకుంటోంది. ముఖ్యంగా సీతక్క సిన్సియారిటీని ఈ ఘటన చెప్పకనే చాటి చెబుతోందన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ తరహా అభినందనలు వెల్లువెత్తున్నాయి.

‘‘అవసరమైతే సీతక్క సీఎం’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటివలే అభివర్ణించారు. దీనినిబట్టి సీతక్క ఇమేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ ఒదిగి ఉంటారని తన తల్లిదండ్రులు భూపట్టాలు అందుకున్న తీరు ఒక ఉదాహరణ అని ప్రశంసలు వస్తున్నాయి. ‘‘తెల్లారి లేస్తే అవగాహన లేకుండా సీతక్క మామీదే విరుచుకుపడుతుంటారు.. కానీ ఆమె తల్లిదండ్రులకు పట్టాలు ఇచ్చింది మేమే’’ అని అధికార బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న దానికంటే.. ఎమ్మెల్యే అయినా సీతక్క సాధారణ వ్యక్తిగానే ఉంటారని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే సీతక్క చాలా స్పెషల్ అనిపించుకుంటున్నారు.

Updated Date - 2023-07-14T16:53:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising