ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pendurthi వైసీపీలో వర్గపోరు..జగన్‌ ఎంక్వైరీలో అసలు నిజం బట్టబయలు..విశాఖ వైసీపీ నేతల్లో గుబులు..

ABN, First Publish Date - 2023-02-16T08:57:28+05:30

విశాఖ జిల్లాలోని పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్‌రాజుకి సొంత పార్టీ నేతల నుంచే కష్టాలు ఎదురవుతున్నాయి. పొలిటికల్‌గా గాడ్‌ ఫాదర్లు లేకున్నా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ జిల్లాలోని ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకి.. సొంత పార్టీ నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయా?.. విపక్షం కన్నా.. అధికార పక్షంతోనే ఆ ఎమ్మెల్యేకి తలనొప్పి తయారైందా?.. సొంత పార్టీలోని కట్టప్పలు.. ఆయన సీటుకే ఎసరు పెడుతున్నారా?.. విషయం గ్రహించిన ఆయన.. వ్యతిరేక వర్గానికి ఆధిష్ఠానంతో కత్తెర వేయించారా?.. ఇంతకీ.. ఎవరా ఎమ్మెల్యే ?.. ఆయన ఎవరికి కత్తెర వేయించారు?..మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

పోనిలే అని వదిలేస్తే, అసలకే ఎసరు!

విశాఖ జిల్లాలోని పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్‌రాజుకి సొంత పార్టీ నేతల నుంచే కష్టాలు ఎదురవుతున్నాయి. పొలిటికల్‌గా గాడ్‌ ఫాదర్లు లేకున్నా.. జగన్ మ్యానియాలో ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయస్సులోనే గ్రామ సర్పంచ్‌గాగెలిచి.. ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డి హయాంలో యూత్ కాంగ్రెస్‌ నేతగా చక్రం తిప్పారు. ఆపై.. వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. చూడ్డానికి ఆయన యువకుడిలా ఉండడం, మెతక వైఖరి కావడంతో నియోజకవర్గంలో పెత్తనమంతా సీనియర్స్‌దే అయింది. వాళ్లంతా.. ఇతర పార్టీల్లో నుంచి వచ్చినవారే అయినా.. ఎన్నికల్లో మాత్రం ఆదిప్‌రాజు గెలుపుకు కృషి చేశారు. సీనియర్స్ కదా అని.. ఏం చేసినా పెద్దగా పట్టించుకోకపోవడం ఎమ్మెల్యే కొంప ముంచింది.

ఎమ్మెల్యే ఆదిప్‌రాజు పేరు చెప్పి కొందరు, కుటుంబ సభ్యుల పేరుతో మరికొందరు ఎవరికి నచ్చినట్లు వాళ్లు వ్యవహరించారు. అంతా వాళ్లదే రాజ్యం అన్నట్లు దోచుకోవడం మొదలుపెట్టారు. విషయం గమనించిన ఎమ్మెల్యే.. పోనిలే అని వదిలేస్తే, అసలకే ఎసరు రాడంతో అలెర్ట్‌ అయ్యారు. అయితే.. సీనియర్ల తీరుపై ఎమ్మెల్యే ఫోకస్‌ పెట్టడంతో ఏమాత్రం రుచించలేదు. ఇంకేముంది.. ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయని భావించిన వైసీపీ నేతలు.. ఎమ్మెల్యేకే వ్యతిరేకంగా ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడమే కాదు.. ఆయన విషయాలపై విపక్షాలకు లీకులు ఇవ్వడం కలకలం రేపింది.

ప్రతి అంశంలో కయ్యానికి కాలు దువ్వడం

మరోవైపు.. మొన్నామధ్య మాజీ కార్పొరేటర్ శరగడం చినఅప్పలనాయుడు ఆక్రమ లేఆవుట్‌కు రోడ్డు వేస్తే.. దానిపై.. అధికారులను ఎమ్మెల్యే ఆదిప్‌రాజు ప్రశ్నించారు. దాంతో.. ఆ రోజు నుండి ఆయన ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని సిద్ధం చేయడమే కాదు.. చిన్నదానికి పెద్దదానికి కయ్యానికి కాలు దువ్వడం మొదలుపెట్టారు. ఆయా విషయాలు.. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి సమక్షంలోనే బయటపడ్డాయి. అయితే.. పార్టీ కోసం ముందు నుండి కష్టపడ్డాను.. ఆధిష్ఠానం దగ్గర మంచి పలుకుబడి ఉందని చెప్పుకునే అప్పలనాయుడును పార్టీ నుండి సస్పెండ్ చేయడం చర్చకు తావిచ్చింది. అయితే.. దానికి కారణం.. ఎమ్మెల్యేను ఎదురించడమేనని ప్రచారం జరుగుతున్నా.. అసలు కథ మాత్రం వేరే ఉందని తెలుస్తోంది.

ఎంక్వైరీలో అసలు నిజం బట్టబయలు

వాస్తవానికి... ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో ఐ ప్యాక్ టీమ్‌ పనిచేస్తోంది. నిత్యం రిపోర్టులను తయారు చేస్తూ.. పార్టీపరంగా ఏం జరిగినా వెంటనే జగన్‌కు చేరవేస్తోంది. దానిలో భాగంగా.. పెందుర్తి ఎమ్మెల్యే గ్రాఫ్ బాగోలేదంటూ రిపోర్టులు అందాయి. ఈ సారి ఆదిప్‌రాజుకు టిక్కెట్‌ కష్టమేనని.. అదే మాట ఆయనకీ చెప్పేశారని ప్రచారం చేశారు. అదే సమయంలో.. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల్లోకి వెళ్లడం లేదని సీఎం జగన్‌ చాలామందిని మందలించారు. అయితే.. ఆదిప్‌రాజు సుమారు 60 రోజులకు పైగా గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తే.. కేవలం 18 రోజులే చేశారని రిపోర్ట్‌ ఉందని జగన్‌ చెప్పడంతో అవాక్కయ్యారు. దానిపైన ఎమ్మెల్యే గట్టిగా సమాధానం చెప్పడంతో.. జగన్.. తాను చూస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎంక్వైరీలో అసలు నిజం బట్టబయలు అయింది. మాజీ కార్పొరేటర్ శరగడం చిన అప్పలనాయుడు కుమారుడే ఐ ప్యాక్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నట్లు వెల్లడైంది. దాంతో.. ఎమ్మెల్యేకు సంబంధించిన ప్రతి రిపోర్ట్ తారుమారు చేసినట్లు గుర్తించారు.

పెందుర్తి వైసీపీ విభేదాలు బహిర్గతంపై కన్నెర్ర

ఇక.. మాజీ కార్పొరేటర్‌ సృష్టించిన గందరగోళం.. జగన్‌రెడ్డికి తెలుసో లేదో గానీ.. అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు మాత్రం పెందుర్తి సీటు ఆశిస్తున్న పంచకర్ల రమేశ్‌బాబుకు.. నగర అధ్యక్ష పదవి ఇచ్చారు. కానీ.. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆదిప్‌రాజు ముఖ్యమంత్రిని కలవగా.. నియోజకవర్గంలోని విషయాలన్నీ తెలుసని.. మీ పని.. మీరు చేసుకోండని చెప్పినట్లు టాక్‌ నడుస్తోంది. దానికి తగ్గట్లే.. పెందుర్తి వైసీపీ విభేదాలు బహిర్గతం అయ్యేలా చేశారని చినఅప్పలనాయుడిపై పార్టీ పెద్దలు కన్నెర్ర చేశారు. దానిలో భాగంగా.. వాస్తవాల కోసం పెట్టిన ఐ ప్యాక్ టీమ్‌ రిపోర్టులను మార్చే స్థాయికి చేరిన వారిని ఉపేక్షించకూడదని డిసైడ్‌ అయ్యారు. కనీసం ఆయనకు సమాచారం కూడా ఇవ్వకుండానే వైసీపీ నుంచి సస్పెండ్‌ చేసేశారు. దాంతో.. ఎమ్మెల్యే ఆదిప్‌రాజు.. హమ్మయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

భూ దందాలు, అక్రమ గ్రావెల్ సంగతేంటి?

మొత్తంగా.. నిప్పులేకుండా పొగ రాదనేది వాస్తవం. పెందుర్తి వైసీపీలో అసమ్మతి ఉన్న మాట నిజమేనన్నది ఆ పార్టీ వర్గాల్లోనే టాక్‌. అయితే.. అవేమీ పట్టించుకోని ఎమ్మెల్యే ఆదిప్‌రాజు మాత్రం.. తలనొప్పిగా మారిన అప్పలనాయుడును తొలగించడంతో.. అధిష్ఠానం ఆయన వైపే ఉందనే సంకేతాలను నియోజకవర్గ నేతలతోపాటు ప్రజల్లోకి పంపారు. కానీ.. పెందుర్తి నియోజకవర్గంలో మాత్రం చాలా వరకు భూ దందాలు, అక్రమ గ్రావెల్ వ్యవహారాల గురించి ఎవరిని అడిగినా చెప్తుండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో.. ఏదో ఒక్కరిని తొలగించి ప్రచారం చేయడంకాదు.. అలాంటోళ్లు చాలామంది ఉన్నారు.. మరి వారి సంగతి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏదేమైనా.. పెందుర్తి వైసీపీలోని ఆయా పరిణామాలను వైసీపీ పెద్దలు ఎలా చక్కదిద్దుతారో చూడాలి..

Updated Date - 2023-02-16T09:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising