ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tripura Elections: ఈ కొత్త పార్టీ బీజేపీని బెంబేలెత్తిస్తోంది

ABN, First Publish Date - 2023-02-15T19:27:18+05:30

త్రిపుర ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠతను రేపుతున్నాయి. త్రిపుర ప్రజలు ఎప్పుడూ ఒకే పార్టీ వైపు మొగ్గుచూపుతూ ఉంటారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రిపురలో త్రిముఖ పోటీ

బిజెపి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? వామపక్షాల కంచుకోటను తిరిగి దక్కించుకుంటుందా?

కొత్త పార్టీ తిప్ర మోత ఎవరి కొంప ముంచుతుంది?

16న అసెంబ్లీ ఎన్నికలు... 60 స్థానాల్లో హోరాహోరీ పోటీ

త్రిపుర ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠతను రేపుతున్నాయి. త్రిపుర ప్రజలు ఎప్పుడూ ఒకే పార్టీ వైపు మొగ్గుచూపుతూ ఉంటారు. కానీ మొదటిసారి త్రిపురలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో బిజెపి కొంత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి ఆ పార్టీకే ఎక్కువ అవకాశాలున్నాయంటున్న వారు కూడా ఉన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అనూహ్య విజయాన్ని సాధించింది. రెండు దశాబ్దాల నాటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని పడగొట్టింది. 60 మంది సభ్యులున్న త్రిపుర అసెంబ్లీలో 36 సీట్లు కైవసం చేసుకొని అధికారాన్ని దక్కించుకుంది. బిజెపి సొంతంగా సాధారణ మెజారిటీని సాధించిన ఏకైక ఈశాన్య రాష్ట్రం త్రిపుర. మరి అటువంటి త్రిపురలో గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. త్రిముఖ పోరు జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే... చూడాల్సిందే.

త్రిపురలో వామపక్షాలు అధికారంలో ఉన్నప్పడు కేవలం పార్టీ కేడర్, వారి విధేయుల సంక్షేమానికే ఎక్కువ మొగ్గు చూపిందన్న ఆరోపణలను ఎదుర్కొంది. అందుకే సిపిఐ (ఎం) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ ,ప్రజాదరణ కారణంగా త్రిపుర ఓటర్లు 2018లో మార్పుకు పట్టం కట్టారు. గిరిజన పార్టీ అయిన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)తో పొత్తుతో పొత్తు పెట్టుకుంది. దీంతో 20 ఎస్టీ నియోజకవర్గాల్లో బిజెపి 10 స్థానాలను, ఐపిఎఫ్‌టి 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అంతేకాకుండా మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే బిజెపి కూటమి గెలిచిన 44 సీట్లలో 33 సీట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి.

ఐదేళ్ల తర్వాత ఇప్పుడు అధికార బిజెపి సంకీర్ణ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రజా వ్యతిరేకతతో పాటు, ప్రతిపక్షాల ఐక్కత కారణంగా ఈసారి బిజెపి గెలుపు నల్లేరుపై నడక కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. కొత్తగా ఆవిర్భవించిన ట్రైబల్ పార్టీ తిప్ర మోత కూడా రోజు రోజుకి ప్రజల ఆదరణ పొందడం బిజెపి నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బిజెపి సంకీర్ణ ప్రభుత్వం తన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని ,రాజకీయ హింస పెరిగి పోయిందని ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. సిఎంగా బిప్లబ్ దేవ్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 10 నెలల ముందు ఆయనను సిఎం పదవినుంచి తొలగించింది. ఆయన స్థానంలో మాణిక్ సాహా ను ముఖ్యమంత్రిగా నియమించింది. గుజరాత్ లో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని మార్చి లభ్ధి పొందినట్లు త్రిపురలో కూడా తమకు లాభం చేకూరుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారు.

ప్రధాని మోదీ గుజరాత్‌ మోడల్‌ పాలనను త్రిపురలో ప్రదర్శించాలని బీజేపీ నేతలను కోరారు. రాష్ట్ర అభివృద్ధికి 'డబుల్ ఇంజన్' ప్రభుత్వం అవసరమని త్రిపుర ప్రజలకు ఆయన గుర్తు చేశారు. త్రిపురలో ఇప్పటి వరకూ ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్న సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లు ఈసారి ఒక్కటయ్యాయి. ఈ కూటమి ప్రభావాన్ని కూడా బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంది. 2018లో సీపీఐ(ఎం) 16 స్థానాలను మాత్రమే దక్కించుకోగా, కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. అయితే సీపీఐ(ఎం) 42 శాతం ఓట్లను గెల్చుకోగా, బీజేపీ 44 శాతం ఓట్లను గెలుచుకుంది. 2013లో 37 శాతం ఓట్లు గెల్చుకున్న కాంగ్రెస్ 2018లో కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే గెల్చుకుంది.

వామపక్ష ఓటర్ల కంటే, కాంగ్రెస్ ఓటర్లే వామపక్ష ఆధిపత్యాన్ని అంతం చేయడానికి 2018లో బిజెపి వైపు మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన కూటమి తరపున సిపి ఐ(ఎం) 46 స్థానాల్లో, కాంగ్రెస్ 13 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని 25 శాతానికి పెంచుకోగలిగింది. అందుకే ఈసారి సిపిఐ(ఎం)‌-కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. సిపిఎం కూడా తన పాత విధానాలను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్ధుల్లో 50 శాతానికి పైగా కొత్త ముఖాలు. మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

బిజెపి కూటమిని ఓడించాలంటే బిజెపి వ్యతిరేక ఓట్లు గుంపగత్తగా ఎవరికో ఒకరికే పడాలి. అయితే అటువంటి పరిస్థితి త్రిపురలో లేదు. సీపీఐ(ఎం) ను గద్దె దించేందుకు 2018లో బీజేపీకి మద్దతిచ్చిన పలువురు కాంగ్రెస్ ఓటర్లు రాష్ట్రంలో వామపక్షాల పునరాగమనాన్ని కోరుకోవడం లేదు. వామపక్షాల కూటమి లాగానే బిజెపి వ్యతిరేక ఓట్లకు తృణమూల్ కాంగ్రెస్ గాలం వేస్తోంది. బెంగాలీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇతర పార్టీల ఓట్లకు టిఎంసి గండి కొట్టే అవకాశం ఉంది. అందుకే టిఎంసిని బిజెపి ‘బి’ టీం అంటూ వామపక్ష-కాంగ్రెస్ కూటమి ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ ఆరోపణలను టీఎంసీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, టిఎంసి ప్రభావం చాలా పరిమితంగా ఉంటుందని, అది పోటీ చేస్తున్న 28 స్థానాల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదని పరిశీలకులు భావిస్తున్నారు. 2018లో టిఎంసికి ఒక్క స్థానం కూడా దక్కలేదు. అయితే వ్యతిరేక ఓట్ల చీలిక తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ భావిస్తుంది.

వ్యతిరేక ఓట్ల అంశాన్ని పక్కన పెడితే కొత్త గిరిజన పార్టీ తిప్ర మోత ఆవిర్భావం బీజేపీని ఆందోళనకు గురిచేస్తోంది. రాజ వంశీయుడు ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్మ నేతృత్వంలో తిప్ర మోత పార్టీ ఏర్పడింది. త్రిపుర జనాభాలో 30 శాతం ఉన్న స్థానిక గిరిజన ప్రజలకు తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్మ చెబుతున్నారు. గత ఏడాది త్రిపుర గిరిజన ప్రాంతాల అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (TTAADC) ఎన్నికల్లో మోతా నేతృత్వంలోని కూటమి 28 స్థానాల్లో 18 స్థానాలను గెలుచుకోగా, బీజేపీకి తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. అందుకే బిజెపి ఈ కొత్త పార్టీని చూపి భయపడుతోంది. అయితే మోతాతో పొత్తు పెట్టుకోవడానికి బిజెపి ప్రయత్నించింది. ప్రస్తుతం ఉన్న గ్రేటర్ టిప్రాలాండ్ ప్రాంతాన్ని, టిటిఎఎడిసి , 36 ఇతర ప్రాంతాలతో త్రిపుర ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను మోతా లేవనెత్తడంతో పొత్తు కుదరలేదు. వ్రాతపూర్వక హామీ లేకుండా తమ పార్టీ ఎవరితోనూ చేతులు కలపదని డెబ్బర్మ స్పష్టం చేయడంతో చర్చలు విఫలమయ్యాయి. గ్రామాలు. దేబ్బర్మ కూడా గిరిజన కూటమి కోసం IPFTతో చర్చలు జరిపారు, కానీ ఐపి ఎఫ్ టి మాత్రం బిజిపితో కలిసి ప్రయాణం చేయడానికి మొగ్గు చూపింది. మోతా ఎదుగుదల, IPFT వ్యవస్థాపకుడు NC దెబ్బర్మ మరణం బిజెపి కూటమికి ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. అంతేకాకుండా ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా పలువురు నాయకుల ఫిరాయింపులు IPFT ప్రభావాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అందుకే ఈసారి తన మిత్రపక్షానికి బిజెపి కేవలం ఐదు స్థానాలను మాత్రమే ఆఫర్ చేసింది. 2018 ఎన్నికల్లో ఐపి ఎఫ్ టికి 15 స్థానాలను కేటాయించింది.

గుజరాత్‌లోని 27 గిరిజన సీట్లలో 24 సీట్లను బిజెపి కైవసం చేసుకుంది. రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్మును ఎన్నుకోవడం వల్లనే గిరిజనులు బిజెపి వైపు మొగ్గు చూపారన్న వాదనను బిజెపి నేతలు పైకి తీసుకొచ్చారు. గుజరాత్‌లో లాగానే త్రిపురల కూడా గిరిజనులు బిజెపి కూటమి వైపే మొగ్గు చూపుతారన్నది ఆ పార్టీ నేతల వాదన. అయితే ఇటీవల బిజెపికి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలకు ఫిరాయించగా, సీపీఐ (ఎం)కి చెందిన ఒక ముస్లిం ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరారు. 10 ఎస్సీ స్థానాల్లో బెంగాలీలు అధికంగా ఉన్నారు. ఏడు షెడ్యూల్డ్ తెగ స్థానాల్లో కూడా బెంగాలీ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మోతా ప్రత్యేక గిరిజన రాష్ట్రాన్ని ప్రతిపాదిస్తున్నందున, బెంగాలీల ఓట్లు చాలావరకు దానికి వ్యతిరేకంగా పడే అవకాశం ఉంది.

త్రిపుర ఎన్నికల చరిత్రలో తొలిసారిగా బహుముఖ పోటీని ఎదుర్కొంటోంది. నిర్ణయాత్మకంగా ఓటు వేయడం త్రిపుర ఓటర్ల సంప్రదాయం. ఒకే పార్టీ వైపు మొగ్గు చూపడం అక్కడ ఓటర్లకు అలవాటు. బహుశా మొదటిసారి త్రిపుర లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందిని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హంగ్ ఏర్పడితే అది బిజెపికే అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే బిజెపికి మెజారిటీ లేని అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు. అందుకే హంగ్ అంటే బిజెపియే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను కూడా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరి త్రిపుర ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారో తెలుసుకోవాలంటే మార్చి 2వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆరోజే ఓట్ల లెక్కింపు జరిగేది. 16న ఓటింగ్.

Updated Date - 2023-02-15T19:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising