Ponguleti : అభిమానుల సాక్షిగా పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పొంగులేటి.. అంతా సరే కానీ..!
ABN, First Publish Date - 2023-02-06T16:56:49+05:30
ఖమ్మం జిల్లా (Khammam) కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Sreenivasa Reddy) ఏ పార్టీలో చేరతారు..? ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు..?
ఖమ్మం : ఖమ్మం జిల్లా (Khammam) కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Sreenivasa Reddy) ఏ పార్టీలో చేరతారు..? ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు..? పార్టీ మారితే ఏ కండువా కప్పుకుంటారు..? అనే విషయాలపై అభిమానులు, అనుచరుల్లో నెలకొన్న ఉత్కంఠకు దాదాపు తెరపడింది. పార్టీ మార్పుపై ఆత్మీయ సమావేశం వేదికగా ఫస్ట్ టైమ్ పొంగులేటి రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఆయనేమన్నారు..? పదే పదే బీఆర్ఎస్‌పై (BRS) ఒంటికాలిపై లేస్తూ విమర్శలు చేస్తుండటంపై ప్రత్యేక కథనం.
Ponguleti : పార్టీ మారడానికి పొంగులేటి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా.. అటు ఇటు తిరిగి ఫైనల్‌గా..?
అభిమానుల సమక్షంలో..
పొంగులేటి పార్టీ మార్పుపై అదిగో.. ఇదిగో అని లెక్కలేనన్ని కథనాలు వచ్చాయే కానీ.. ఒక్కసారి కూడా వీటిపై రియాక్ట్ (Reaction) అయ్యి ఆయన క్లారిటీ ఇచ్చుకోలేదు. దీంతో ఓ వైపు బీఆర్ఎస్ నుంచి ఈయనపై విమర్శలు గుప్పిస్తుండటం.. మరోవైపు పొంగులేటి (EX Ponguleti) కూడా ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ ఎటాక్ (Counter Attack) చేస్తూ వచ్చారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో (Khammam Politics) అసలేం జరుగుతోంది..? పొంగులేటి ఎటువైపు అడుగులేస్తారు..? అని అనుచరులు, కార్యకర్తలు, అభిమానుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే.. ఇక ఆలస్యం చేయకూడదని భావించి ఆత్మీయ సమావేశంలో.. అభిమానుల (Fans) సమక్షంలో మనసులోని మాటను బయటపెట్టేశారు పొంగులేటి. అవును.. నమ్ముకున్న కార్యకర్తల సాక్షిగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించేశారు. ఆయన అలా మాట్లాడుతుండగా అభిమానులు, కార్యకర్తలు ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తించారు. చాలా రోజులుగా స్థబ్దుగా ఉన్న పొంగులేటి ఒక్కసారిగా యాక్టివ్ అవ్వడం.. పార్టీమార్పుపై స్పందించడంతో అభిమానుల్లో ఎనలేని సంతోషం వచ్చేసింది.
అంతా సరే కానీ..
పార్టీ మారుతానని మాత్రమే చెప్పారు కానీ.. ఏ పార్టీలో చేరుతారు..? ఎప్పుడు కండువా కప్పుకుంటారు..? అనేదానిపై మాత్రం పొంగులేటి అస్సలు క్లారిటీ ఇవ్వలేదు. అన్నీ చెప్పారు కానీ పార్టీ ఏది అనేది..? అసలు విషయం చెప్పకపోవడంతో ఇంకా సస్పెన్షన్ (Suspension) కొనసాగుతూనే ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయన ముఖ్య అనుచరులకు మాత్రం ఏ పార్టీలో జాయిన్ అవుతారనే దానిపై ఫుల్ క్లారిటీనే ఉందట. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే వైఎస్ ఫ్యామిలీకి (YS Family) జై కొట్టిన పొంగులేటి.. ఇప్పుడు కూడా అదే కుటుంబంతో కలిసి నడవాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే ఈ మధ్య వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila), వైఎస్ విజయమ్మతో (YS Vijayamma) వరుస సమావేశాలు అయ్యారట. ఎల్లుండి (ఫిబ్రవరి-8న) షర్మిల, విజయమ్మ సమక్షంలో కండువా కప్పుకోనున్నారట. ఇందు కోసం ఖమ్మం ఎంపీ (Khammam Mp Seat) స్థానంతో పాటు.. నాలుగైదు అసెంబ్లీ స్థానాలు కూడా షర్మిలతో చర్చించేశారని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి.
మొత్తానికి చూస్తే.. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన పొంగులేటి ఎపిసోడ్‌కు ఎల్లుండితో ఎండ్ కార్డ్ పడనుందన్న మాట. అందరూ అనుకుంటున్నట్లుగానే షర్మిల పార్టీలో చేరతారా లేకుంటే ఆఖరి నిమిషంలో అనూహ్యంగా మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాంటే ఎల్లుండి వరకూ వేచి చూడాల్సిందే మరి.
Updated Date - 2023-02-06T19:25:23+05:30 IST