ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OHRK : రాహుల్ సభలో ప్రత్యేక ఆకర్షణగా పొంగులేటి.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎపిసోడ్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ

ABN, First Publish Date - 2023-07-02T22:27:06+05:30

కాంగ్రెస్‌కు (Congress) కంచుకోటగా పేరున్న ఖమ్మం జిల్లా (Khammam) నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగించింది. అధికార బీఆర్‌ఎస్‌ను (BRS) ఓడించడమే లక్ష్యంగా ఇవాళ ఖమ్మంలో ‘తెలంగాణ జనగర్జన’ (Telangana JanaGarjana) సభకు నిర్వహించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌కు (Congress) కంచుకోటగా పేరున్న ఖమ్మం జిల్లా (Khammam) నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగించింది. అధికార బీఆర్‌ఎస్‌ను (BRS) ఓడించడమే లక్ష్యంగా ఇవాళ ఖమ్మంలో ‘తెలంగాణ జనగర్జన’ (Telangana JanaGarjana) సభకు నిర్వహించింది. పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీతో (Rahul Gandhi) పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు సభకు హాజరై బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత జనవరి 18న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ జరిగిన ప్రదేశానికి సమీపంలోనే కాంగ్రెస్‌ పార్టీ జనగర్జన సభను ఏర్పాటు చేసి.. అధికార పార్టీ సభకు రెట్టింపు స్థాయిలో కాంగ్రెస్ పట్టుదలగా జన సమీకరణ చేసి సభను విజయవంతం చేసింది.

హైలైట్‌గా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే..

అయితే.. ఈ సభ మొత్తమ్మీద ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ రాధాకృష్ణ ప్రతివారం నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ హైలైట్‌గా నిలిచింది. ఏప్రిల్‌లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏప్రిల్ నెలలో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ రెడ్డి గురించి చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు, తన పొలిటికల్ ఎంట్రీ ఎలా సాగింది.. రాజకీయ గురువు ఎవరు..? ఇలా అన్ని విషయాలను పొంగులేటి ఈ ప్రోగ్రామ్‌లో చెప్పారు. ఇందులోని బుల్లెట్ పాయింట్స్ అన్నీ జనగర్జన సభలో ప్రదర్శించింది పొంగులేటి టీమ్. ఇవి ప్రదర్శిస్తున్నంత సేపు సభకు విచ్చేసిన కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. ‘జై పొంగులేటి.. జైజై శీనన్న’ అంటూ నినాదాలు చేశారు.

ఇదే చర్చ,,

ఈ ఎపిసోడ్‌లోని హైలైట్ పాయింట్స్‌ను ఖమ్మం జనగర్జన సభలో పొంగులేటి టీమ్ ప్రదర్శించింది. సభా స్థలం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు కనబడేలా 50 అడుగుల ఎత్తున భారీ డిజిటల్‌ స్ర్కీన్‌‌పై ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎపిసోడ్‌ను ప్రదర్శించారు. ఈ సభ మొత్తానికి ఇదే హైలైట్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన తర్వాత పొంగులేటి పూర్తి ఇంటర్వ్యూలో ఇంకా ఏమేం మాట్లాడారు..? అని యూట్యూబ్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యూట్యూబ్‌లోకి వెళ్లి Open Heart With RK ప్రోగ్రామ్‌ను చూడటానికి నెటిజన్లు, పొంగులేటి వీరాభిమానులు, అనుచరులు క్యూ కట్టారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో.. ఇటు సోషల్ మీడియాలో పొంగులేటి, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ గురించే చర్చ నడుస్తోంది. మీరు కూడా పొంగులేటి.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేను చూడాలంటే ఈ కింది లింక్‌ను క్లిక్ చూడొచ్చు.

OHRK Ponguleti: పర్సంటేజీ నేనూ ఇచ్చా..

Updated Date - 2023-07-02T22:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising