ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: ఉచిత విద్యుత్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ ఏమన్నారు..? అసలేంటీ గొడవ..?

ABN, First Publish Date - 2023-07-11T14:01:38+05:30

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ గురించి తానా సభలో మాట్లాడిన మాటలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘తెలంగాణలో 95 శాతం రైతులు మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు మూడు గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంటే చాలు. టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతది’ అని రేవంత్ చేసిన కామెంట్స్‌పై బీఆర్‌ఎస్ రాజకీయం మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ గురించి తానా సభలో మాట్లాడిన మాటలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘తెలంగాణలో 95 శాతం రైతులు మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు మూడు గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంటే చాలు. టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే స్లోగన్ తీసుకొచ్చిండు. ఉచిత కరెంట్ పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతుండు. ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని చెప్పేసి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా చెబుతున్నం’’ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

అధికార బీఆర్‌ఎస్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విటర్‌లో ఎదురుదాడికి దిగింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన భారత రాష్ట్ర సమితి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు నిరసనలకు పిలుపునిచ్చింది. మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందని, ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని బీఆర్‌ఎస్ ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు.

ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ నుంచే కాకుండా సొంత పార్టీ నేతల నుంచి కూడా రేవంత్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవడం గమనార్హం. రేవంత్ ఎప్పుడూ కంట్రోల్ తప్పడని, అలా ఎందుకు అనాల్సి వచ్చిందో అడుగుతానని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలపై రేవంత్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి రేవంత్ వ్యాఖ్యలను అడ్వాంటేజ్ తీసుకొంటోందని, తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. కేటీఆర్ తనతో వస్తే తెలంగాణలో కరెంట్ పరిస్థితి ఎలా ఉందో చూపిస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కరెంట్ పాలసీ ఏ విధంగా ఉంటుందో అందరం చర్చించి, తమ మేనిఫెస్టోలో చెప్తామని కోమటిరెడ్డి తెలిపారు. పదిగంటలు కరెంట్ వస్తే అందులో పది సార్లు కరెంట్ పోతుందని ఎద్దేవా చేశారు. జగదీష్ రెడ్డి పవర్ లేని మినిష్టర్ అని, ఆయన గురించి తాను మాట్లాడనని కోమటిరెడ్డి చెప్పారు.

Updated Date - 2023-07-11T14:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising