ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: కేసీఆర్ సర్కారుపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు.. కేబీఆర్‌ పార్క్‌లో ఒక పువ్వు తెంపినా...

ABN, First Publish Date - 2023-04-13T17:46:06+05:30

కేసీఆర్ సర్కారు (KCR government)పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: కేసీఆర్ సర్కారు (KCR government)పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ధనదాహంతో 15 అంతస్తుల నిర్మాణానికి అనుమతించిందని, భూమి లోపల 3 అంతస్తులు, పైన 12 అంతస్తులకు అనుమతించారని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనవి రాజకీయ విమర్శలు కాదని.. నగర భవిష్యత్‌ కోసమే తన తపన అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబ స్వార్థానికి నగరం బలవుతోందని, నిజాం కాలం నాటి భవనాలను కూల్చేందుకు ఎందుకు అనుమతి ఇస్తున్నారని, యువరాజును ప్రసన్నం చేసుకునేందుకు అక్రమ సంపాదన, కేబీఆర్‌ పార్క్‌ (KBR Park) లో ఒక పువ్వు తెంపినా శిక్షించే చట్టాలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణకు తలమానికం కేబీఆర్‌ పార్క్ అని, కేబీఆర్ పార్క్‌లో నెమళ్లతో పాటు ఎన్నో వన్యజీవులు ఉన్నాయని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేబీఆర్‌ పార్క్‌ దగ్గర భారీ హోటల్‌ నిర్మాణానికి అనుమతించారని, భారీ కట్టడాలతో పర్యావరణం, వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. కేబీఆర్‌ పార్క్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వ సంపదగా గుర్తించిందని, 2006లో ఫైవ్ స్టార్ హోటల్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించిందని, పర్యాటకుల కోసం కాంగ్రెస్ ఈ ప్రతిపాదన చేసిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. 3 అంతస్తుల నిర్మాణం కోసమే కాంగ్రెస్ అనుమతి ఇచ్చిందని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ అంతస్తులకు అనుమతి ఇవ్వలేదని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-04-13T17:47:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising