ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Roja : మీడియా ముందు మంత్రి రోజా తీవ్ర ఆవేదన.. ఏంటిది మేడం.. జగన్‌కు చెప్పుకోండి..!

ABN, First Publish Date - 2023-03-08T00:17:19+05:30

అవును.. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా (Minister Roja) మీడియా ముందు ఆవేదనకు లోనయ్యారు. గ్లోబల్ ఇన్వస్టర్స్ సదస్సు (Global Investors Summit) ముగిశాక మొదటిసారి మీడియా ముందుకొచ్చిన రోజా పెట్టుబడులు పెట్టిన కంపెనీల గురించి మాట్లాడారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అవును.. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా (Minister Roja) మీడియా ముందు ఆవేదనకు లోనయ్యారు. గ్లోబల్ ఇన్వస్టర్స్ సదస్సు (Global Investors Summit) ముగిశాక మొదటిసారి మీడియా ముందుకొచ్చిన రోజా పెట్టుబడులు పెట్టిన కంపెనీల గురించి మాట్లాడారు. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. సడన్‌గా టోన్ మారిపోయింది. ‘మేం చెప్పినవన్నీ మీడియా వారు రాస్తే మాకు ఈ కష్టాలెందుకు ఉంటాయి..?’ అంటూ ఆవేదన చెందారు. అసలు ఇంతలా బాధపడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? మీడియా గురించి రోజా ఎందుకిలా మాట్లాడారు..? ఇదే మీడియా గురించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ఏమన్నారో..? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇదేంటి రోజా..?

సినీ, రాజకీయ ప్రముఖులు ఏం మాట్లాడినా ఈ మధ్య మీడియా హైలేట్ చేస్తోంది కానీ తాను ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా ఎవరూ పట్టించుకోవట్లేదని మంత్రి రోజా ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు.. తాము చెప్పినవి చెప్పినట్లుగా మీడియాలో రాస్తే ఈ కష్టాలు ఉండవంటూ పెద్ద లెక్చరే ఇవ్వడానికి ప్రయత్నించారు. బాధ చెప్పుకున్నారు సరే.. ఆవేదన చెందారు ఇదంతా ఓకే కానీ.. అసలు కొన్ని మీడియా సంస్థలను ముఖ్యంగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ని (ABN-Andhrajyothy) దూరం పెట్టిందెవరు..? అదిగో ఫలానా చానెల్ అన్నా.. పేపర్ అన్నా.. ఎంట్రీ ఉండదు. ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం జరిగినా, ఎవరు మీడియా మీట్ పెట్టినా ఆహ్వానాలే ఉండవ్. ఒకవేళ మీడియా సమావేశానికి వెళ్దామని ప్రయత్నించినా అస్సలే ఛాన్స్ ఉండదు. కనీసం వైసీపీ పార్టీ ఆఫీసులోకి కూడా ఎంట్రీ ఉండదు. ఏకంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డే బహిరంగ సభా వేదికగా ఎన్నోసార్లు దుష్టచతుష్టయం అని నానా విధాలుగా మాట్లాడిన సందర్భాలున్నాయ్. కొన్ని మీడియా సంస్థలు కనిపిస్తే చాలు జగన్ ఎప్పుడూ హుంకరిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా కవర్ చేయట్లేదు అని ఆవేదన చెందితే ఏం ఫలితం..? చెప్పుకోవాల్సింది ఎక్కడ..? అనే విషయాలు రోజా ఆలోచించుకుంటే మంచిదేమో.

ఈ మాటలు ఎవరికి చెప్పాలి..?

ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి.. ప్రజా సమస్యల పరిష్కారానికై నిరంతరం పనిచేసేదే మీడియా (Media). అలాంటిది ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే ఆ వార్తలను ప్రచురించకుండా ఎందుకుంటుంది..? కచ్చితంగా వందకు వంద శాతం కవర్ చేస్తుంది. వాస్తవానికి ఏపీలో మీడియాకు పరిస్థితులు సరిగ్గాలేవన్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక చాలా మీడియా సంస్థలను దూరం పెట్టారన్నది జగమెరిగిన సత్యమే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అంతేకాదు.. మీడియా ప్రతినిధులపైనే కేసులు పెట్టి మరీ ఇబ్బంది పెట్టిందెవరో కూడా చెప్పక్కర్లేదు. మీడియాపైన అక్కసు వెళ్లగక్కేది, కక్ష తీర్చుకునేది ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీనే.. ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ఆవేదన చెందేది జగన్ కేబినెట్‌లోని మంత్రులే. చూశారా.. ఏమైనా లాజిక్ ఉందా..? అప్పుడు మీడియాను బ్యాన్ చేసి.. ఇప్పుడు ఇలా కవర్ చేయాలని బతిమలాడటం, ఆవేదన చెందడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా..?. ఇవే మాటలు సీఎం వైఎస్ జగన్ దగ్గర చెప్పుకుంటే ఏమైనా ఫలితం ఉంటుంది కానీ.. మీడియా ముందు చెబితే ప్రయోజనం జీరో అనే విషయం రోజా తెలుసుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉంది.

సో.. ఇకపై మీడియా ముందుకొచ్చి ఇలా ఆవేదన చెండం కంటే.. మీడియాను బ్యాన్ చేసిన, మీడియా అంటే ఒంటికాలిపై లేస్తున్న సీఎం జగన్‌కు ఈ విషయాలన్నీ రోజా చెప్పుకుంటే చాలా మంచిదేమో..!

******************************

ఇవి కూడా చదవండి..

******************************


BRS : 22 ఏళ్లుగా కేసీఆర్ ఫోన్ కాల్ కోసం ఎదురుచూపులు.. ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్‌కు ఊహించని షాక్..!


******************************

Vangaveeti Radha : గంటకుపైగా నారా లోకేష్‌‌తో వంగవీటి రాధా సుదీర్ఘ చర్చ.. చెప్పాల్సింది క్లియర్‌ కట్‌గా చెప్పేసిన యువనేత.. వాట్ నెక్స్ట్..!


******************************

Manoj Mounika: పొలిటికల్ ఎంట్రీపై ఒక్క మాటతో తేల్చేసిన మంచు మనోజ్.. మౌనికకు లైన్ క్లియర్ అయినట్లేనా..!

******************************

AP Capitals : సిగ్గో.. సిగ్గు.. ఏపీ పరువు తీస్తున్న వైఎస్ జగన్.. కేవలం మూడేళ్లలో రాజధాని కడతామంటున్న BRS.. ఎంత కామెడీ అయిపోయిందో..!

******************************

Manchu Manoj Mounika Marriage : మంచు మనోజ్-మౌనిక లవ్ మ్యారేజీకి ఆ ఒక్కటే కారణమా.. అందుకే హీరో ఫిదా అయిపోయాడా..?


******************************

Medico Preethi : డీజీపీ నుంచి వరంగల్ సీపీకి ఫోన్.. కొత్త మలుపులు తిరుగుతున్న డాక్టర్ ప్రీతి కేసు.. ఏం జరుగుతుందో ఏమో..!?

******************************

Medico Preethi : డాక్టర్ ప్రీతి ఘటనలో 11 అనుమానాలు.. అపస్మారక స్థితిలో ఉండగా ..!?

******************************

Doctor Preethi Case : మెడికో ప్రీతి కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ తేల్చిన అసలు నిజం ఇదీ..

******************************

Medico Preethi : ప్రీతి కేసులో నోరు విప్పిన సైఫ్.. సంచలన విషయాలు వెలుగులోకి.. కీలకంగా మారిన బ్యాగ్!


******************************

APGIS2023 : సిగ్గో.. సిగ్గు.. వైజాగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఇదేం దారుణం.. తీవ్ర అసహనానికి గురై బయటికొచ్చేసిన డెలిగేట్స్..!

******************************

Big Breaking : విశాఖ గ్లోబల్ సమ్మిట్‌లో గొడవ.. రచ్చ రచ్చగా మారిన ఏయూ గ్రౌండ్స్.. ముందే చెప్పిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి!

******************************

Updated Date - 2023-03-08T00:33:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising