ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirumala: తిరుమల నడక మార్గంలో వన్యప్రాణుల సంచారం.. తెర వెనుక కథ ఇదేనా?

ABN, First Publish Date - 2023-08-21T13:51:05+05:30

నిత్యం రద్దీగా ఉండే అలిపిరి నడకదారిలో వన్యప్రాణుల సంచారం ఎందుకు ఎక్కువగా మారిందని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు బహిర్గతం అవుతున్నాయి. సైన్స్ ప్రకారం సాధారణంగా మనుషులు ఎక్కువగా తిరిగే మార్గంలో వన్యప్రాణులు తిరగవు అని.. వాటి ఆశ్రయానికి, తినే ఆహారానికి ఎవరైనా భంగం కలిగిస్తే తప్ప అవి మనుషులు తిరిగే మార్గంలోకి రావని విశ్లేషకులు వివరిస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయం అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి. అందుకే కలియుగ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు 365 రోజులు ప్రజలు బారులు తీరుతుంటారు. కానీ ప్రస్తుతం తిరుమలకు వెళ్లే అలిపిరి నడకదారిలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా మారింది. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 15 రోజుల వ్యవధిలో నాలుగు చిరుత పులులు, మూడు ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిలో మూడు చిరుతలను పట్టుకున్నట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. అయితే ఉన్నట్లుండి తిరుమలలో వన్యప్రాణుల సంచారం వెనుక ఏదో జరుగుతోందని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు.

నిత్యం రద్దీగా ఉండే అలిపిరి నడకదారిలో వన్యప్రాణుల సంచారం ఎందుకు ఎక్కువగా మారిందని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు బహిర్గతం అవుతున్నాయి. సైన్స్ ప్రకారం సాధారణంగా మనుషులు ఎక్కువగా తిరిగే మార్గంలో వన్యప్రాణులు తిరగవు అని.. వాటి ఆశ్రయానికి, తినే ఆహారానికి ఎవరైనా భంగం కలిగిస్తే తప్ప అవి మనుషులు తిరిగే మార్గంలోకి రావని విశ్లేషకులు వివరిస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. భక్తులు జింకలకు ఆహారం పెట్టడం వల్లే చిరుతలు వస్తున్నాయని భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని టీటీడీ అంటోంది. కానీ నడకదారిలో కనిపించే జింకలకు భక్తులు ఆహారం పెట్టడం కొత్తగా పుట్టిందేమీ కాదు. అనాదిగా అది కొనసాగుతూనే ఉంది. మరి అప్పుడు సంచారం చేయని వన్యప్రాణులు ఇప్పుడు ఎందుకు భక్తులు నడిచే మార్గంలోకి వస్తున్నాయో టీటీడీ ఆలోచన చేయాలని పలువురు హితవు పలుకుతున్నారు.

ఇది కూడా చదవండి: AP Politics: ప్రజల నెత్తిన వైసీపీ బోగస్ సర్వేలు.. అంత భయం ఎందుకో?

మరోవైపు శేషాచలం అడవులు ఎర్రచందనానికి ప్రసిద్ధి. దీంతో ప్రస్తుతం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని.. అందుకే వన్యప్రాణులు తమ స్థావరాలను మార్చుకుంటున్నాయని మరో వాదన తెరమీదకు వచ్చింది. నిజంగా వన్యప్రాణుల ఆవాసాలకు భంగం కలిగిందో లేదో టీటీడీ లోతుగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. అటు ఇటీవల పట్టుబడ్డ చిరుత ఈనెల 14న నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల చిన్నారి లక్షితను చంపి తిన్నట్లు అధికారులు చెప్పారు. నిజంగా చిరుత డీఎన్‌ఏలో మనిషిని తిన్నట్లు తేలిందా అన్న విషయం కూడా స్పష్టం కావాలి. ఎందుకంటే మనిషిని తినే చిరుతపులి సంచరిస్తుంటే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. వన్యప్రాణులు ఒక్కసారి మానవ రక్తాన్ని రుచి చూస్తే దాని కోసమే ఆరాటపడతాయి. ఇలాంటి అంశాలపై టీటీడీ దృష్టి పెట్టకుండా భక్తులకు కర్రలు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. కర్రలు ఎందుకు ఇస్తున్నాం అనే అంశానికి వివరణను పక్కనపెట్టి అసలు వన్యప్రాణుల సంచారానికి గల కారణాలపై టీటీడీ దృష్టి పెడితే బాగుంటుందని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - 2023-08-21T13:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising