ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Case : చంద్రబాబు అరెస్ట్‌పై రజనీకాంత్ స్పందన.. లోకేష్‌కు ఫోన్ చేసి..

ABN, First Publish Date - 2023-09-13T16:05:11+05:30

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును (TDP Chief Chandrababu) జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించిందని దేశమంతా చర్చించుకుంటున్నారు. రాజకీయ, సినీ.. పలు రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించి తీవ్రంగా ఖండించారు..

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును (TDP Chief Chandrababu) జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించిందని దేశమంతా చర్చించుకుంటున్నారు. రాజకీయ, సినీ.. పలు రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించి తీవ్రంగా ఖండించారు. అంతేకాదు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు సైతం సోషల్ మీడియాలో, మీడియా ముఖంగా స్పందించారు. మరికొందరు నేరుగా చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ ముఖ్యనేతలతో ఫోన్‌లో మాట్లాడారు కూడా. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajanikanth) స్పందించారు.


నా మిత్రుడు తప్పు చేయడు!

బాబు అక్రమ అరెస్ట్‌పై.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు రజనీకాంత్ ఫోన్ (Rajinikanth Calls Lokesh) చేశారు. సుమారు 15 నిమిషాలపాటు మాట్లాడిన సూపర్‌స్టార్.. కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ‘నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు. బాబు చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్ష. నా మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనని ఏమీ చేయాలేవు. నాకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు ఏ తప్పు చేయరు. బాబు చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయి’ అని లోకేష్‌‌ ఫోన్‌లో తలైవా ధీమా వ్యక్తం చేశారు. కాగా.. నారా, నందమూరి కుటుంబ సభ్యులతో రజనీకాంత్‌కు సాన్నిహిత్యం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ మధ్య ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు విజయవాడలో జరగ్గా.. హాజరై అన్నగారు ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం, చంద్రబాబు విజనరీ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈయన చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ కావడం.. రజనీ వర్సెస్ వైసీపీగా (Rajani Vs YSRCP) పరిస్థితులు మారడం ఇవన్నీ తెలుగు ప్రజలందరికీ తెలిసిందే.

టాలీవుడ్‌ను తిట్టేస్తున్నారు!

దాదాపు అన్ని రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు.. ఇప్పుడు సూపర్ స్టార్ కూడా స్పందించారు కానీ.. టాలీవుడ్‌కు (Tollywood) చెందిన పెద్దలు మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. దీంతో టాలీవుడ్‌పై టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. సోషల్ మీడియావేదికగా (Social Media) టాలీవుడ్ పెద్దల తీరును ఖండిస్తున్నాయి. వాస్తవానికి.. తెలుగు సినీ పరిశ్రమ ఈరోజు గొప్ప స్థాయిలో ఉందంటే దానికి కారణం ఎన్టీఆర్, ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ. థియేటర్లు మూతపడుతున్న కాలంలో ఆనాడు స్లాబ్ సిస్టమ్‌తో పాటు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలు చిత్ర పరిశ్రమకు భరోసా కల్పించాయి. అదే ఇప్పుడు ఏపీలోని జగన్ ప్రభుత్వం గురించి చెప్పుకుంటే గత నాలుగేళ్లలో చిత్ర పరిశ్రమను ఎన్ని తిప్పలు పెట్టారో అందరూ చూశారు. చిరంజీవి వంటి పరిశ్రమ పెద్దతో దండం పెట్టించుకుని మానసిక ఆనందం పొందిన వ్యక్తి జగన్. ఇలాంటి పరిస్థితులు టీడీపీ హయాంలో అభిమానులు చూడలేదు. మహేష్, ప్రభాస్ వంటి హీరోలు కూడా స్వయంగా జగన్‌ను కలిసి తమ చిత్రాలకు టిక్కెట్ రేట్లు పెంచాలని అడుక్కోవాల్సిన దుస్థితి వైసీపీ హయాంలోనే చూశాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇంత జరుగుతున్నా పెద్ద తలకాయలెవ్వరూ నోరు మెదపకపోవడం గమనార్హం.


ఇవి కూడా చదవండి


NCBN Arrest : కీలక పరిణామం.. రేపు చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్


NCBN Case : చంద్రబాబు కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. సీఐడీకి కీలక ఆదేశాలు


YSRCP Vs TDP : వై‘చీప్’ పాలిట్రిక్స్‌ను పసిగట్టిన టీడీపీ.. వ్యూహాత్మకంగా ‘లూథ్రా’ అడుగులు.. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!


Chandrababu Case : ఏసీబీ కోర్టు తీర్పు, ములాఖత్ తర్వాత చంద్రబాబు లాయర్ల కీలక నిర్ణయం.. సర్వత్రా ఉత్కంఠ


Updated Date - 2023-09-13T16:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising