BRS Vs Congress : తెలంగాణలో మారిపోతున్న పాలిటిక్స్.. కాంగ్రెస్‌లో చేరికపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. మరో అసంతృప్త నేత కూడా..
ABN, First Publish Date - 2023-06-10T19:23:28+05:30
అవును.. తెలంగాణలో రాజకీయాలు (TS Politics) శరవేగంగా మారిపోతున్నాయ్. బీజేపీని (BJP) పూర్తిగా పక్కనెట్టి కాంగ్రెస్‌ను (Congress) టార్గెట్ చేస్తున్న సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఊహించని రీతిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి...
అవును.. తెలంగాణలో రాజకీయాలు (TS Politics) శరవేగంగా మారిపోతున్నాయ్. బీజేపీని (BJP) పూర్తిగా పక్కనెట్టి కాంగ్రెస్‌ను (Congress) టార్గెట్ చేస్తున్న సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఊహించని రీతిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికార బీఆర్ఎస్‌ను (BRS) కాదని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిట్టింగ్‌లు రెడీ అవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయబడిన కీలక నేతలు సైతం హస్తం పార్టీలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఒకరు ‘కారు’ దిగి.. ‘చేయి’ పార్టీలోకి చేరడానికి సిద్ధమైపోయారు. అంతేకాదు.. కాంగ్రెస్ సీనియర్ నేతతో ఆయన ఇంటికెళ్లి మరీ చర్చలు జరిపారు. అనంతరం మీడియా మీట్ పెట్టి బీఆర్ఎస్‌లో ఉండే పరిస్థితులను పూసగుచ్చినట్లుగా వెల్లడించారు. ఇంతకీ ఎవరాయన..? బీఆర్ఎస్‌పై ఇంత అసంతృప్తితో ఎందుకున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇదీ అసలు కథ..!
మహబూబ్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి (Mallu Ravi).. బీఆర్ఎస్ నుంచి నేతలను పార్టీలోకి లాగే పనిలో బిజిబిజీగా ఉన్నారు. శనివారం నాడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర రెడ్డి (Kuchukulla Damodar Reddy).. మల్లు రవి ఇంటికెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సుమారు గంటన్నరపాటు చర్చించారు. పలు విషయాలపై సమాలోచనలు చేసిన నేతలు.. చివరికి కాంగ్రెస్‌లోకి చేరాలని నిర్ణయించుకున్నారు. సమావేశం అనంతరం మల్లు, కూచుకుళ్ల మీడియా మీట్ నిర్వహించారు. సోమవారం జరగనున్న పొంగులేటి ప్రెస్‌మీట్‌పై జూపల్లి కృష్ణారావుతో చర్చించినట్లుగా మల్లు మీడియాకు వెల్లడించారు. 12, 13, 14 తారీఖుల్లో ఏదో ఒకరోజు ప్రెస్‌మీట్ పెట్టాలని నేతలు ఆలోచిస్తున్నారన్నారు. జూపల్లి కూడా తనను కలిసి.. రాజకీయ పునరేకీకరణ కోసం అందరం కలవాలి సమావేశంలో చర్చించామన్నారు. ముఖ్యంగా.. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చర్చించి... అందరం ఒక తాటిపైకి రావాలని అనుకున్నామన్నారు మల్లు. దామోదర్ రెడ్డి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని.. మల్లు రవి చెప్పుకొచ్చారు. త్వరలోనే నాగం జనార్ధన్ రెడ్డితో తనతో పాటు దామోదర్ రెడ్డి కూడా టచ్‌లోకి వెళ్తామన్నారు. పీసీసీ చీఫ్, సీఎల్పీ నాయకుడితో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందని మల్లు రవి మీడియాకు వెల్లడించారు.
కన్ఫామ్ చేసేశారుగా..!
మల్లు రవి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా అసలు పార్టీలో ఏం జరుగుతోందనే విషయాలను చెప్పుకొచ్చారు. ‘క్యాడర్ నాపై ఒత్తిడి తెస్తోంది. నాగం జనార్ధన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం చెబుతాను. నాగంతో చాలా సంవత్సరాల బంధం నాది. బీఆర్ఎస్ పార్టీతో కాదు లోకల్ ఇబ్బందులే నాకు ఎక్కువగా ఉన్నాయి. నేను సాప్ట్ గోయింగ్ పర్సన్.. కాంట్రవర్సీలకు నేను చాలా దూరం. నాగంతో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాను. నేను 20 ఏళ్లు కాంగ్రెస్‌లో పనిచేశాను. ఇబ్బందులు వచ్చి కాంగ్రెస్ పార్టీని వీడాను. మళ్ళీ కాంగ్రెస్‌లోకి వస్తే ఎలా ఉంటుందని మల్లు రవిని అడిగాను. కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని, రమ్మని మల్లురవి నాకు చెప్పారు. బీఆర్ఎస్ నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు చూస్తాను. నాకు అందరి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసే స్వేచ్ఛ ఉంది. బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీల పరిస్థితి దారుణంగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు అధికారాలే లేవు. ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి’ అని చిట్‌చాట్‌లో దామోదర్ రెడ్డి తెలిపారు. కాగా.. నాగర్ కర్నూల్ నుంచి తన కుమారుడి రాజేశ్‌రెడ్డిని బరిలోకి దించే యోచనలో దామోదర రెడ్డి ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరో అసంతృప్త నేత కూడా..!
ఇదిలా ఉంటే.. మల్లురవి నివాసంలో బీఆర్ఎస్ వనపర్తి లీడర్ మేఘా రెడ్డి కూడా భేటీ అయ్యారు. వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి ఎంపీపీగా ఉన్న మేఘా రెడ్డి.. కొంతకాలంగా బీఆర్ఎస్‌పై అసంతృప్తిగా రగిలిపోతున్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరేందుకు మల్లురవితో చర్చలు జరుపుతున్నారు.
మొత్తానికి చూస్తే.. తెలంగాణ రాజకీయాలు గంట గంటకూ మారిపోతున్నాయ్. ముఖ్యంగా మహబూబ్‌నగర్ వేదికగా పెను సంచలనాలే జరుగుతున్నాయి. అటు ఎమ్మెల్సీ.. ఇటు మాజీ మంత్రి కాంగ్రెస్‌లో చేరాలని ఫిక్స్ అయినట్లుగా వారి మాటలను బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక మరో ఎంపీపీ కూడా భేటీ కావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. మున్ముందు ఇంకా ఎంత మంది నేతలు బీఆర్ఎస్ బై బై చెబుతారో.. ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
TS BJP : హస్తినలో బిజిబిజీగా ఈటల రాజేందర్.. హైకమాండ్ ఇచ్చే కీలక పదవి ఇదే..?
******************************
Apsara Murder Case : శంషాబాద్ అప్సర హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. పిన్ టూ పిన్ వివరాలు ఇవే..!
******************************
Apsara Murder Case : అప్సర హత్యకు ముందు, ఆ తర్వాత అసలేం జరిగిందో.. పోలీసులకు పూసగుచ్చినట్లుగా చెప్పిన సాయి..
******************************
Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
******************************
YS Viveka Murder Case : భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్‌లో కీలక అంశాలు ప్రస్తావించిన సీబీఐ.. ఇదేగానీ జరిగితే..
******************************
Updated Date - 2023-06-10T19:26:46+05:30 IST