ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP Fans: చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు లేదు.. దేవుడిని జాతరలో ఊరేగించినట్లుంది..!!

ABN, First Publish Date - 2023-09-09T18:29:17+05:30

చంద్రబాబును ఆయన కాన్వాయ్‌లోనే నంద్యాల నుంచి విజయవాడకు పోలీసులు తీసుకువెళ్తున్న వీడియోలను కొందరు టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆయన్ని దేవుడి జాతరలో ఊరేగించినట్టు ఊరేగుస్తున్నారు.. ఆయన సత్తా ఏంటో ప్రజలకు ఆయన మీద ఉన్న అభిమానం ఏంటో ప్రపంచం మొత్తం చూసేలా చేసినందుకు వైసీపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అంటూ పలువురు నెటిజన్‌లు కామెంట్లు చేస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం తెల్లవారుజామున నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఓర్వకల్లు విమానాశ్రయానికి తీసుకువెళ్లి అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లాలని తాము భావించామని.. కానీ చంద్రబాబు అంగీకారం తెలపకపోవడంతో రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకువెళ్తున్నామని సీఐడీ చీఫ్ సంజయ్ మీడియాకు వెల్లడించారు. దీంతో 10 గంటలకు పైగా రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు పోలీసులు తీసుకువెళ్లారు. అయితే చంద్రబాబుకు మద్దతుగా భారీ సంఖ్యలో రోడ్లపైకి టీడీపీ అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన నేతకు సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నించారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: ప్రత్యేక విమానంలో విజయవాడకు పవన్ కళ్యాణ్.. అనుమతి ఇవ్వని ఏపీ పోలీసులు

దీంతో చంద్రబాబును పోలీసులు తీసుకువెళ్తున్న వీడియోలను కొందరు టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆయన్ని దేవుడి జాతరలో ఊరేగించినట్టు ఊరేగుస్తున్నారు.. ఆయన సత్తా ఏంటో ప్రజలకు ఆయన మీద ఉన్న అభిమానం ఏంటో ప్రపంచం మొత్తం చూసేలా చేసినందుకు వైసీపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అంటూ పలువురు నెటిజన్‌లు కామెంట్లు చేస్తున్నారు. కాగా చంద్రబాబుకు మద్దతుగా రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసుల జులుం ప్రదర్శించారు. లాఠీఛార్జి చేయడంతో పలువురు నిరసనకారులకు గాయాలు అయ్యాయి. కాసేపట్లో చంద్రబాబును సీఐడీ పోలీసులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించనున్నారు. అనంతరం సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అటు చంద్రబాబు అరెస్ట్‌ను ఏపీలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఎం, సీపీఐ వంటి పార్టీల నేతలు చంద్రబాబు అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ కక్ష సాధింపుల కోసమే అరెస్ట్ చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా పోలీసులు ప్రొసీజర్ పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.

Updated Date - 2023-09-09T18:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising