ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinash CBI Enquiry : విచారణకు రాలేనన్న ఎంపీ అవినాష్.. హుటాహుటిన కర్నూల్‌కు సీబీఐ బృందం.. ఏం జరుగుతుందో అని వైసీపీలో నరాలు తెగే ఉత్కంఠ..!

ABN, First Publish Date - 2023-05-21T19:28:04+05:30

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సహ నిందితుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి‌ పదే పదే సీబీఐ విచారణకు డుమ్మా కొడుతున్నారు..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సహ నిందితుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి‌ పదే పదే సీబీఐ విచారణకు డుమ్మా కొడుతున్నారు..! విచారణకు రావాల్సిందేనని సీబీఐ నోటీసులు ఇవ్వడం.. రాలేనని ఏదో ఒక కారణం చెబుతూ ప్రతిసారీ డుమ్మా కొట్టడం పరిపాటిగా మారిపోయింది. అసలు విచారణకు వస్తే ఏమవుతుందో ఏమో అని అవినాష్‌కు టెన్షన్ మొదలైపోయింది. ఇందుకు కారణం.. సీబీఐకి సుప్రీంకోర్టు ఫుల్ పవర్స్ ఇవ్వడమే. ఏ క్షణమైనా ఎంపీని సీబీఐ అరెస్ట్ చేసుకోవచ్చని దాదాపు సీబీఐ హెడ్ క్వార్టర్స్ నుంచి కీలక ఆదేశాలు రావడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే రెండుసార్లు విచారణకు వస్తున్నట్లు చెప్పిన అవినాష్ ఆఖరి నిమిషంలో రాకపోవడంతో ఈ వ్యవహారాన్ని సీబీఐ సీరియస్‌గా తీసుకుంది. సోమవారం నాడు (మే-22న) విచారణకు ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని అవినాష్‌కు 160 CRPS కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది.

ఇప్పట్లో రాలేను.. ఎందుకంటే..!

ఇప్పటికే పలుమార్లు విచారణకు డుమ్మా కొట్టిన అవినాష్.. సోమవారం విచారణకు కూడా రాలేనని సీబీఐకి లేఖ రాశారు. తనకు 10 రోజులు సమయం కావాలని సీబీఐను ఎంపీ కోరారు. తన తల్లి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని ఇంకాస్త సమయం కావాలని లేఖలో అవినాష్ పేర్కొన్నారు. తన తల్లికి గుండె ఆపరేషన్ ఉందని వైద్యులు చెప్పినట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ తర్వాత.. తన తల్లి కుదుట పడటానికి వారం, పది రోజులు సమయం పట్టవచ్చని అందుకే విచారణకు మరో తేదీ ఇవ్వాలని లేఖలో అవినాష్ రాసుకొచ్చారు.

రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాల్సి ఉండగా అవినాష్ ఇలా లేఖ రాయడంతో సీబీఐ అధికారులు తీవ్ర ఆగ్రహానికి లోనైనట్లుగా తెలుస్తోంది. ఎంపీ లేఖకు ఇంతవరకూ సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అవినాష్ లేఖ రాసి సుమారు గంటన్నరపైనే అయినప్పటికీ ఇంతవరకూ స్పందన రాకపోవడంతో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి.

కర్నూల్‌కు సీబీఐ!

మరోవైపు.. హైదరాబాద్ నుంచి హుటాహుటిన సీబీఐ బృందం కర్నూల్‌కు బయల్దేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం కర్నూల్‌లోని విశ్వభారతి ఆస్పత్రిలో అవినాష్ తల్లి లక్ష్మమ్మ చికిత్స తీసుకుంటున్నారు. తన తల్లి దగ్గరే ఎంపీ ఉండి అన్నీ చూసుకుంటున్నారు. అందుకే ఆయనున్న ఆస్పత్రికే సీబీఐ బృందం వెళ్తున్నట్లు తెలుస్తోంది. సీబీఐ హెడ్ క్వార్టర్స్ నుంచి క్లియర్‌కట్‌గా ఆదేశాలు రావడంతోనే అధికారుల బృందం కర్నూలుకు వెళ్లినట్లు సమాచారం.

టెన్షన్.. టెన్షన్..!

19 తారీఖు విచారణకు రాకుండా హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ బయల్దేరి వెళ్లినప్పుడు సీబీఐ అధికారులు రెండు కార్లలో వెంబడించిన విషయం విదితమే. ఆరోజే ఆయన్ను అరెస్ట్ చేస్తారని అందరూ అనుకున్నప్పటికీ అసలేం జరుగుతోందో తెలుసుకోవడానికే అధికారులు వెళ్లారు. మానవత్వ కోణంలో ఆలోచించిన సీబీఐ విచారణకు రాలేనని చెప్పినా సరేనని సైలెంట్ అయ్యింది. ఇవాళ అవినాష్ లేఖ రాసినా.. ఇంతవరకూ సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం.. పైగా సీబీఐ బృందం కర్నూల్‌కు బయల్దేరినట్లు వస్తున్న వార్తలతో అటు ఎంపీ అభిమానులు, అనుచరుల్లో.. ఇటు వైసీపీ అధిష్ఠానంలో నరాలు తెగేలా టెన్షన్ మొదలైందట. కచ్చితంగా ఈసారి అవినాష్‌ను అరెస్ట్ జరిగి తీరుతుందని తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున కోట్లల్లో బెట్టింగ్‌లు జరుగుతున్నాయ్. మరోవైపు.. వైసీపీ కీలక నేతలు.. న్యాయ నిపుణులతో భేటీ అయ్యి దీనిపై ఎలా ముందుకెళ్లాలి..? అరెస్ట్ కాకుండా ఏం చేయాలి..? అని అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి చూస్తే.. అవినాష్ లేఖకు సీబీఐ నుంచి స్పందన రాకపోగా అధికారులే కర్నూల్‌కు వెళ్తుండటంతో కచ్చితంగా ఇవాళ అర్ధరాత్రి లోపు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. మరోవైపు.. అవినాష్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున కర్నూలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. మొన్ననే సీబీఐ అధికారులపై అవినాష్ అనుచరులు దాడికి ప్లాన్ చేశారనే వార్తలు గుప్పుమన్నాయ్.. ఇవాళ ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయో ఏంటో.. చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash Vs CBI : ఉదయం నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. అవినాష్‌పై సీబీఐ సీరియస్.. హెడ్‌క్వార్టర్స్‌ నుంచి క్లియర్ కట్‌‌గా ఆదేశాలు.. ఏ క్షణమైనా..!?

******************************
Avinash In Viveka Case : ఎంపీ అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ ఇచ్చిన డాక్టర్లు

******************************

AP Politics : వైసీపీ నేతలను మించిపోయిన రాపాక.. వైఎస్‌ జగన్‌‌ను ఈ రేంజ్‌లో ప్రసన్నం చేసుకోవడం వెనుక..!

******************************

Updated Date - 2023-05-21T19:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising