ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Vs Maheshwar: మహేశ్వర్‌రెడ్డి పాదయాత్రపై రేవంత్‌ రియాక్షన్‌ ఏంటి?..యాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందెవరు..?

ABN, First Publish Date - 2023-03-07T12:16:50+05:30

ఓ వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. రేవంత్ పాదయాత్రతో కాంగ్రెస్‌కు ఊపు వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు జోష్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో పాదయాత్ర కలకలం రేపుతోందా?.. రేవంత్‌రెడ్డికి పోటీగా ఓ సీనియర్‌ నేత యాత్రకు శ్రీకారం చుట్టారా?.. కొన్నాళ్లుగా పీసీసీ చీఫ్‌తో విభేదిస్తున్న ఆయనకు సీనియర్లు కూడా అండగా నిలిచారా?.. పాదయాత్ర ప్రారంభించి పార్టీలోనూ ఆ జిల్లాలోనూ హాట్‌టాపిక్‌గా మారారా?.. ఇంతకీ.. టీ.కాంగ్రెస్‌లో మరో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ఆ సీనియర్‌ నేత ఎవరు?.. ఆ నేత పాదయాత్రపై రేవంత్‌ రియాక్షన్‌ ఏంటి?..అవి అనే మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

రేవంత్‌తో పొసగని సీనియర్ నేతలంతా హాజరు

ఓ వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. రేవంత్ పాదయాత్రతో కాంగ్రెస్‌కు ఊపు వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి. అదే సమయంలో.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టడం కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి హైదరాబాద్ వరకు మొదటి విడతగా ప్రజా సమస్యలపై పోరు యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. అయితే.. ఆ పాదయాత్ర ప్రారంభానికి.. రేవంత్‌తో పొసగని సీనియర్ నేతలంతా హాజరు కావడంతో చర్చగా మారింది. అంతేకాదు.. రేవంత్ పాదయాత్రకు పోటీగా నిర్వహిస్తున్నారనే ప్రచారం కూడా మొదలైంది.

పొమ్మన లేక పొగ పెడుతున్నారని కూడా ఆరోపణ

వాస్తవానికి.. మహేశ్వర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మధ్య కొన్నాళ్ళుగా విభేదాలు ఉన్నాయి. రేవంత్ తీరు నచ్చని మహేశ్వర్‌రెడ్డి.. అనేక సందర్భాల్లో బహిరంగంగానే తప్పుపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తన ఉనికి నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న కోపం మహేశ్వర్‌రెడ్డిలో ఉంది. అలాగే.. పార్టీ నుంచి పొమ్మన లేక పొగ పెడుతున్నారని కూడా ఆరోపించారు. దాంతో.. తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేతలతో టచ్‌లో ఉంటున్న మహేశ్వర్‌రెడ్డి.. జిల్లాలో పట్టు కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే.. హత్ సే హత్ జోడో పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

ఎవరు పాదయాత్ర చేసినా పార్టీ అభీష్టం మేరకే

ఇక.. రేవంత్‌రెడ్డికి పోటీ యాత్ర అని జరుగుతున్న ప్రచారంపై మహేశ్వర్‌రెడ్డి స్పందించారు. అధిష్టానం ఆదేశాల మేరకే నేతలంతా పాదయాత్రలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రేవంత్‌ది, తనది కాంగ్రెస్ యాత్రలేనని.. రెండూ హాత్ సే హాత్ జోడో యాత్రలేనని స్పష్టం చేశారు. సీనియర్లు వారి అనుకూలతను బట్టి యాత్రలకు హాజరవుతారని మహేశ్వర్‌రెడ్డి తేల్చేశారు. కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూపులు లేవని.. పార్టీలో ఐక్యంగా ముందుకు వెళ్తామని.. అందరం కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని తెలిపారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్‌తోపాటు నేతలు కూడా ఉన్నారని స్పష్టం చేశారు.

అటు.. మహేశ్వర్‌రెడ్డి పాదయాత్రపై రేవంత్‌రెడ్డి కూడా రియాక్ట్‌ అయ్యారు. పార్టీ పరంగానే పాదయాత్రలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తరపున ఎవరు పాదయాత్ర చేసినా.. అది పార్టీ అభీష్టం మేరకే ఉంటుందని చెప్పారు. తెలంగాణ సీనియర్ నేతలందరూ కచ్చితంగా యాత్ర చేయాల్సిందేనన్నారు. మహేశ్వర్‌రెడ్డి పాదయాత్ర చేసినా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినా.. అది పార్టీ ప్రయోజనాలకేనన్నారు. యాత్ర చేయనివారిపై చర్యలు ఉంటాయని రేవంత్‌రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు.

వ్యక్తిగత ఇమేజ్ కోసం యాత్ర చేస్తున్నారని ఫిర్యాదు

ఇదిలావుంటే.. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు సహజంగానే స్పందన ఎక్కువగా ఉంది. ఆయన మాస్ లీడర్ కావడంతో ఆ ప్రభావం కనిపిస్తోంది. కొంతమంది సీనియర్ నేతలు కూడా రేవంత్‌కు మద్దతు ప్రకటించారు. మరికొంతమంది మాత్రం దూరంగా ఉంటున్నారు. దానికి తగ్గట్లే.. కొద్దిరోజుల క్రితం.. రేవంత్ యాత్ర జరుగుతున్న తీరుపై మహేశ్వర్‌రెడ్డి.. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ థాక్రే ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కంటే రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేలా యాత్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

అయితే.. మీరు కూడా పాదయాత్ర చేయవచ్చని.. థాక్రే చెప్పడంతో సీనియర్లు పాదయాత్రలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా.. కాంగ్రెస్‌లో ఎవరికివారు పాదయాత్రలకు సిద్ధమవుతున్నా.. మహేశ్వర్‌రెడ్డి యాత్ర మాత్రం ఆసక్తి రేపింది. రేవంత్‌తో మహేశ్వర్‌రెడ్డికి పొసగని నేపథ్యంలోనే యాత్ర చేస్తున్నారనే టాక్‌ వినిపించింది. అయితే.. ఇరువురు నేతలు.. పార్టీ ప్రయోజనాల కోసమే పాదయాత్రలు అని స్పష్టం చేయడంతో క్లారిటీ వచ్చినట్లు అయింది.

Updated Date - 2023-03-07T12:31:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising