Delhi Liquor Scam : ఢిల్లీ బయల్దేరేముందు కేసీఆర్-కవిత 15 నిమిషాల ఫోన్‌కాల్‌లో ఏమేం మాట్లాడుకున్నారు..!?
ABN, First Publish Date - 2023-03-08T17:24:18+05:30
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి నోటీసులు రావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మార్చి-9న ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొనగా..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ఈడీ నుంచి నోటీసులు రావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మార్చి-9న ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొనగా.. 15 తారీఖు వస్తానని కవిత రెక్వెస్ట్ చేశారు. అయితే ఈడీ నుంచి ఎలాంటి రిప్లయ్ లేకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కవిత ఢిల్లీకి బయల్దేరారు. మొదట సీఎం కేసీఆర్‌తో భేటీ కావాలని కవిత భావించినప్పటికీ వీలు కాలేదు. దీంతో కేసీఆర్-కవిత (KCR-Kavitha Phone Call) ఇద్దరూ ఫోన్‌లోనే 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. అయితే 15 నిమిషాల పాటు ఏం మాట్లాడుకున్నారు..? కేసీఆర్ ఏం చెప్పారు..? కవిత ఏం మాట్లాడారు..? అనేది తెలుసుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.
ధైర్యం చెప్పి ముందుకు నడిపిన కేసీఆర్..!
‘ఈడీ నోటీసులపై ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఢిల్లీకి వెళ్లు. నువ్వు చేపట్టిన నీ కార్యక్రమం కొనసాగించు. అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతం అయ్యేలా చూడండి. న్యాయపరంగా బీజేపీ ఆకృత్యాలపై పోరాడుదాం. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా నీకు అండగా ఉంటుంది’ అని కవితకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. కేసీఆర్ చెప్పిన ఈ ఒక్కమాటతో కవితలో ఎనలేని ధైర్యం వచ్చిందట. దీంతో పాటు న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాలు గురించి కూడా చర్చించుకున్నారని తెలుస్తోంది. ఇలా 15 నిమిషాలపాటు కవితకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు కేసీఆర్. ఈ ఫోన్ కాల్ తర్వాతనే కవిత శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరి వెళ్లారు. ఆమె ఢిల్లీ వెళ్తున్నారని తెలుసుకున్న అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘మేడమ్ ధైర్యంగా వెళ్లండి’ అని చెప్పి ఎయిర్‌పోర్టుదాకా సాగనంపారు.
కాగా.. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఎల్లుండి (మార్చి-10న) జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షను కవితనే దగ్గరుండి చూస్తున్నారు. ఇందుకే కవిత రేపు, ఎల్లుండి విచారణకు రాలేనని.. 15న తారీఖున హాజరవుతానని ఈడీకి లేఖ రాసింది.
******************************
ఇది కూడా చదవండి..
******************************
Delhi Liquor Scam : సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎప్పుడేం జరిగింది.. పిన్ టూ పిన్ వివరాలివిగో..!
******************************
Delhi Liquor Scam : ఈడీ నుంచి రాని రిప్లై.. కేసీఆర్ ఫోన్ కాల్ తర్వాత ఢిల్లీకి పయనమైన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్‌లో నరాలు తెగే ఉత్కంఠ!
******************************
Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందని తేలితే.. బీఆర్ఎస్ శ్రేణులు షాకయ్యే విషయాలు చెప్పిన న్యాయ నిపుణులు..!
*****************************
Updated Date - 2023-03-09T18:47:14+05:30 IST