ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN Arrest: చంద్రబాబు పేరు వింటే వణుకు.. అందుకేనా ఆయనకు ఈ శునకానందం?

ABN, First Publish Date - 2023-09-27T16:25:41+05:30

జైలులో చంద్రబాబు హ్యాపీగా ఉన్నారని.. ప్రశాంతంగా ఉన్నారని.. అసలు ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు పేరు వింటే ఓవైసీకి పాతరోజులు గుర్తుకొస్తున్నాయంటూ టీడీపీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జైలులో చంద్రబాబు హ్యాపీగా ఉన్నారని.. ప్రశాంతంగా ఉన్నారని.. అసలు ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పాలన మంచిగానే ఉందని.. చంద్రబాబును మాత్రం నమ్మలేమని అన్నారు. దీంతో టీడీపీ అభిమానులు ఓవైసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పేరు వింటే ఓవైసీకి పాతరోజులు గుర్తుకొస్తున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.

చంద్రబాబు హయాంలో ఓవైసీకి ఏం జరిగింది?

ఒక్కప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ చేయాలన్నా.. ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా.. అక్కడ ఎంఐఎం పార్టీ శాంతి భద్రతల సమస్య సృష్టించేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో మొట్టమొదటి సారి బుల్డోజర్‌తో ఓల్డ్ సిటీలో అక్రమ కట్టడాలు కూల్చడం... రోడ్ల విస్తరణ జరగడం ప్రజలు చూశారు. అంతేకాకుండా విచ్చలవిడిగా సామాన్యులపై దౌర్జన్యం చేసే ఎంఐఎం గుండాలపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారు. అప్పటి సిటీ పోలీస్ కమీషనర్ పేర్వారం రాములు ఎంఐఎం పార్టీ చేసే అరాచకాలపై దండయాత్ర చేశారు. అప్పటి చార్మినార్ ఎమ్మెల్యేగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ హిందువులపై దాడి చేయాలని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. దీంతో వెంటనే రంగంలో దిగిన పోలీసులు అసదుద్దీన్ ఓవైసీని చితకబాదారు. జీవితంలో ఓవైసీ తొలిసారి పోలీసలు దెబ్బలు రుచిచూశారు. ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉండటం చూసి ఓవైసీ శునకానందం పొందుతున్నారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.


మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని టీడీపీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం ఓట్లను వాడుకుని అధికారం అనుభవించడం, ముస్లిం ఓట్లను చీల్చి . . బీజేపీకి దొడ్డిదారిలో సహాయపడటం, అవినీతిపరులకు మద్దతు ఇవ్వడం తప్ప ఆయన ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఎక్కడో గుజరాత్‌లో పోటీ చేయడం కాదని.. హైదరాబాద్ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో, ఏపీలో పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. ఓవైసీ విషయంలో ముస్లింలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని హితవు పలుకుతున్నారు.

అటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ స్పందించారు. మీ యజమాని (బీజేపీ) వద్ద నుండి హుకుం జారీ అయితేనే నోరు విప్పుతావా అసదుద్దీన్ ఓవైసీ అంటూ ప్రశ్నించారు. ఇన్ని రోజులు గుర్తుకురాని ఆంధ్ర రాష్ట్ర ముస్లింలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చారని నిలదీశారు. అబ్దుల్ సలాం హాజిరా లాంటి అత్యాచార సంఘటనలు జరిగినప్పుడు స్పందించని ఓవైసీ ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయిందని.. అయినా ఇప్పటి వరకు ఎప్పుడు స్పందించలేదు కానీ ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గర పడిన వేళ ఏపీలో ముస్లింలను బుట్టలో వేసుకునే విఫల ప్రయత్నం మానుకోవాలని సూచించారు. ఎవరిపై నమ్మకం ఉంచాలి.. ఎవరిపై నమ్మకం ఉంచకూడదు అనే అంశాలను రాష్ట్ర ముస్లింలు చూసుకుంటారని.. బీజేపీకి బీ టీమ్ అయిన మీరు జగన్ చెప్పిన విధంగా స్పందించటం వల్ల మీరిద్దరు బీజేపీ బీ టీమ్ ఆన్న సంగతి స్పష్టమవుతుందని విమర్శించారు. హైదరాబాద్ మహా నగరంగా తీర్చిదిద్దడంలో ఇద్దరు నవాబుల హస్తం ఉందని.. ఒకరు నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అయితే ఇంకొకరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-27T16:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising