ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP MLC Election Results 2023 : వైఎస్ జగన్‌ను ఏకిపారేస్తున్న వైసీపీ సోషల్ మీడియా.. ఏమైందా అని ఆరాతీస్తే..!

ABN, First Publish Date - 2023-03-20T14:08:34+05:30

అవును.. మీరు వింటున్నది నిజమే సొంత పార్టీ కార్యకర్తలు, వైఎస్ జగన్ (YS Jagan) అంటే అమితంగా ప్రేమించే వీరాభిమానులు (YS Jagan Fans) ఇప్పుడు సీఎంను తిట్టిపోస్తున్నారు. అది కూడా కొందరు బూతులు తిడుతుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అవును.. మీరు వింటున్నది నిజమే సొంత పార్టీ కార్యకర్తలు, వైఎస్ జగన్ (YS Jagan) అంటే అమితంగా ప్రేమించే వీరాభిమానులు (YS Jagan Fans) ఇప్పుడు సీఎంను తిట్టిపోస్తున్నారు. అది కూడా కొందరు బూతులు తిడుతుంటే.. ఇంకొందరు మాత్రం ఎందుకీ అతి నమ్మకం అంటూ తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా (Social Media) గత మూడు, నాలుగు రోజులుగా జగన్‌ను సొంత మనుషులే ఏకిపారేస్తున్నారు. అంతేకాదండోయ్.. అధికారంలో ఉన్న జగన్‌తో పోలిస్తే నిజంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వందల రెట్లు బెటర్ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఎందుకింతలా సొంత పార్టీవాళ్లే జగన్‌ను తిడుతున్నారు..? చంద్రబాబునే ఎందుకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఇదీ అసలు కథ..!

ఆంధ్రప్రదేశ్‌లో రసవత్తరంగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడు స్థానాల్లో గెలిచి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది అధికార వైసీపీకి దిమ్మతిరిగే షాక్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫలితాలతో ఇప్పటి వరకూ ‘వై నాట్ 175’ (Why Not 175) అని ఎగిరెగిరిపడిన వైసీపీకి ఊహించని రీతిలో బ్రేక్‌లు పడ్డాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ కాస్త ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటూ వస్తోంది. ముఖ్యంగా మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ టీడీపీ ఆశించినంతగా ఫలితాలు రాలేదు. సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ పని అపోయిందని ఓ రేంజ్‌లో కార్నర్ చేస్తూ వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తూ వచ్చారు. సీన్ కట్ చేస్తే.. వైసీపీ వ్యూహాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఏకంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పార్టీకి, కార్యకర్తలకు మంచి బూస్ట్ ఇచ్చినట్లయ్యింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ.. స్థానాల్లో అధికార వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఉత్తరాంధ్ర నుంచి వేపాడ చిరంజీవి రావు, తూర్పు రాయలసీమ నుంచి కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ నుంచి భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి గెలిచారు. దీంతో వైసీపీలోని విమర్శకుల నోటికి కూడా తాళం పడినట్లయ్యింది. దీంతో టీడీపీ కేడర్‌లో ఎనలేని ఉత్సాహం వచ్చినట్లయ్యింది. సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం వీరాభిమానులు, కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ‘ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో పార్టీ పని అయిపోయింది అని వాగిన ప్రతి ఒక్కడు వచ్చి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది అని చెప్తున్నారు. గెలవలేం అనే స్టేజ్ నుంచి గెలుపు మనదే అనే స్టేజ్‌కు తీసుకున్నారు బాబు గారు’ అని టీడీపీ వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

వైసీపీ పరిస్థితి ఇదీ..

ఓ వైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు పండుగ చేసుకుంటూ ఉంటే.. వైసీపీ నేతలు మాత్రం జగన్‌పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్నిరోజులుగా జగన్ చేసిన చిన్నపాటి తప్పులే ఇవాళ ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని మండిపడుతున్నారు. కేవలం అతి విశ్వాసం వల్లే ఈ ఎన్నికల్లో వైసీపీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని కొందరు కార్యకర్తలు అంటున్నారు. మరికొందరు అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చేసిన పోల్ మేనేజ్మెంట్‌లో ఒక్కటంటే ఒక్క శాతం కూడా వైసీపీ చేయలేదని అందుకే అట్టర్ ప్లాప్ అయ్యిందని చెబుతున్నారు. ఎన్నికల సీజన్ మొదలుకుని.. ఓటింగ్‌ రోజు వరకూ పట్టభద్రుల నాడి పట్టుకోలేకపోవడంలో వైసీపీ ఇలా మూడు స్థానాలను చేజేతులారా టీడీపీకి కట్టబెట్టిందనే వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీకి చెందిన అభ్యర్థులు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ద్వితియ శ్రేణి నేతల వరకూ అందరూ చాలా ప్లానింగ్‌తో వ్యవహరించి.. పట్టభద్రులను ఓటింగ్ కేంద్రం వరకూ నడిపించడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారని వైసీపీ వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైనా ఇగోలు మాని ఇకనైనా కార్యకర్తలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలని కొందరు జగన్ అభిమానులు కోరుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఏదో పొడుస్తామని చెప్పి కనీసం యువతను కూడా సరిగ్గా పట్టించుకోలేదని అందుకీ ఈ ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు వైసీపీ నేతలు. ఇక నైనా గ్రౌండ్‌ లెవల్‌లో ఏం జరుగుతోందో జనాల్లోకి వచ్చి తెలుసుకుంటే మంచిదని సీఎం జగన్‌కు సొంత పార్టీ నేతలే తిట్టిపోస్తున్నారు.

పరిస్థితి ఇలానే ఉంటే..!

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఆయన కుటుంబానికి పెట్టనికోట, దశాబ్దాలుగా ‘వైఎస్‌’ అడ్డా.. పులివెందులలో (Pulivendula) తొలిసారిగా ‘పసుపుదళం’ పొలికేక వినిపించింది. టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లోనూ భయంభయంగానే గడిపిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు పులివెందుల పూల అంగళ్ల సెంటర్‌లో ‘జై తెలుగుదేశం’ అని నినదించారు. దీంతో వైసీపీ శ్రేణులు మరింత నైరాశ్యం పెరిగిపోయింది. ఇన్నాళ్లు మనం ‘వై నాట్ 175’ అని తెగ జబ్బలు చరుచుకున్నాం కదా.. ఇప్పుడు ‘వై నాట్ పులివెందుల’ (Why Not Pulivendula) అని సంబరాలు చేసుకుంటున్నారు.. చూశారుగా నిర్లక్ష్యం ఎంతవరకూ దారితీస్తుందో అని వైసీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపొద్దున పులివెందుల ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వైసీపీ పెద్దలు మాత్రం..!

ఇక వైసీపీ కేడర్ కామెంట్స్ అటుంచితే.. కీలక నేతలైన సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala), మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) అయితే చిత్రవిచిత్రాలుగా స్పందించారు. ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ జరుగుతాయి. ఇందులో రాజకీయ పార్టీల పాత్ర పెద్దగా ఉండదు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేము మొదటిసారి పోటీ చేసి ఈమాత్రం ఓట్లు సంపాదించినందుకు మమ్మల్ని అభినందించాలి’ అని పేర్ని నాని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఆఖరికి వైసీపీ అధికారంలో ఉండి కూడా మౌనం వహించాల్సి వస్తోందని కూడా సజ్జల అనేశారు. అంతటితో ఆగని సజ్జల.. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబే మర్డర్‌ చేస్తారని, మళ్లీ ఆయనే బట్ట కాల్చి ముఖంపై వేస్తారని సజ్జల ఆరోపించారు. ఆఖరికి.. తాము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పోరాటం చేయాల్సి వస్తోందని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తానికి చూస్తే.. తూర్పు, పడమర, ఉత్తరాన పసుపు జెండా రెపరెపలాడేసరికి వైసీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యానికి గురయ్యాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఎమ్మెల్సీ స్థానాలకే టీడీపీ ఇంత ప్రాధాన్యత ఇచ్చి తమ అభ్యర్థులను గెలిపించుకుందంటే.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టడానికి ఇంకెలాంటి అస్త్రశస్త్రాలు చంద్రబాబు ప్రయోగిస్తారో అని వైసీపీలో కలవరం మొదలైందట. ఈ ఫలితాలపై ఇంతవరకూ జగన్ నేరుగా స్పందించిన దాఖలాల్లేవ్.. మరి ఆయన్నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది..? కార్యకర్తలు, వీరాభిమానులు అసంతృప్తిని పోగొట్టడానికి జగన్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Janasena : పవన్ పదే పదే ‘కాపు’ ప్రస్తావన తేవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా.. ఇదేగానీ వర్కవుట్ అయితే..!
******************************

YSRCP : ఏపీ కేబినెట్‌ నుంచి ముగ్గురు ఔట్ కానున్నారా.. జగన్ ప్రకటనతో మంత్రుల్లో పెరిగిపోయిన టెన్షన్.. ఇంతకీ వారెవరు..!?

******************************
Kiran Reddy : ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’మా.. ఈయన్ను పార్టీ ఎలా వాడుకోబోతోంది.. అధిష్ఠానం ప్లానేంటి..!?


******************************

Updated Date - 2023-03-20T14:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising