ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics : సీఎం జగన్ రెడ్డితో భేటీ కానున్న బాలినేని.. విజయసాయిని కాదని పదవి ఇస్తారా..!?

ABN, First Publish Date - 2023-07-27T15:11:45+05:30

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య ఉమ్మడి ప్రకాశం జిల్లాలో (Prakasam) తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని.. ఇందుకు కారణం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డేనని (YV Subbareddy) సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) దగ్గర పంచాయితీ నడిచిన సంగతి తెలిసిందే...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య ఉమ్మడి ప్రకాశం జిల్లాలో (Prakasam) తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని.. ఇందుకు కారణం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డేనని (YV Subbareddy) సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) దగ్గర పంచాయితీ నడిచిన సంగతి తెలిసిందే. మీడియా ముందుకొచ్చి కంటతడిపెట్టడం ఇదంతా రాష్ట్ర రాజకీయాల్లో (AP Politics) హాట్ టాపిక్ అయ్యింది. కనీసం ఒక పోలీసు అధికారిని కూడా మార్చడానికి తనకు పలుకుబడి లేకుండా పోయిందని తీవ్ర అసంతృప్తితో కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. పైగా బాలినేని.. సీఎం జగన్‌కు సమీప బంధువు కావడంతో అది మరింత సంచలనమైంది. అప్పట్లో ఈ రాజీనామా వ్యవహారం పెను సంచలనమే అయ్యింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరోసారి ఆ పదవిని బాలినేని ఆశిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


ఇదీ అసలు కథ..!

శుక్రవారం 4 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ రెడ్డితో బాలినేని భేటీ (Jagan Reddy-Balineni) కానున్నారు. మరికాసేపట్లో క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి చేరుకోనున్నారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బాలినేని రాజీనామా తర్వాత.. పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లికి రీజినల్ కో-ఆర్డినేటర్‌గా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని (Vijayasai Reddy) నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. బాలినేని-జగన్ భేటీలో ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగించడంపైనా చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతలను ఆశిస్తున్నట్టు గతంలోనే బాలినేని సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా విజయసాయి రెడ్డికి ఉమ్మడి ప్రకాశం ఇవ్వడంతో.. సొంత జిల్లా వరకు తనే ఇవ్వాలని జగన్‌కు చెప్పనున్నారట. సాయిరెడ్డికి ఇచ్చిన పదవిని.. అది కూడా ఒక ప్రకాశం జిల్లాను బాలినేనికి జగన్ అప్పగిస్తారా..? లేదా అనేది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. సాయంత్రం 6 గంటలకు దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

గతంలో ఇలా..!

కాగా.. గతంలో నెల్లూరు, తిరుపతి, కడపకు రీజనల్ కో-ఆర్డినేటర్‌గా బాలినేని ఉన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా.. ఆ పదవి తనకి వద్దంటూ గతంలో సీఎం వైఎస్ జగన్ వద్ద తేల్చి మాజీ మంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లో సీఎం జగన్ రెండు, మూడుసార్లు పిలిపించి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ బాలినేని వినలేదు. అలకబూని కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి.. ఒంగోలు నియోజకవర్గంపైనే దృష్టిపెడతానని చెప్పారు. తాజాగా.. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు రీజనల్ కో-ఆర్డినేటర్‌గా విజయ్ సాయి రెడ్డిని నియమించడంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. అప్పుడు వద్దంటే వద్దన్న బాలినేని.. ఇప్పుడు మళ్లీ ప్రకాశం వరకే కావాలని ఆశిస్తున్నారు. మరి జగన్ మనసులో ఏముంది..? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? అనేదానిపై వైసీపీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి


Telangana Rains : తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు



Telugu States : తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రం కీలక ప్రకటన


YSRCP : వైఎస్ జగన్‌కు మరో తలనొప్పి.. మంత్రి వర్సెస్ ఎంపీ.. ఫొటో తెచ్చిన తంట..!


YSRCP : నందిగామ సురేష్‌కు ఎంపీ టికెట్ ఇవ్వనని వైఎస్ జగన్ చెప్పేశారా.. యువనేత స్థానంలో ఎవరంటే..!?


Target Kuppam : కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ పదే పదే చెప్పడం వెనుక ఇంత కుట్ర దాగుందా.. బాగోతం బట్టబయలు..!



Updated Date - 2023-07-27T15:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising