ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

T-Congress: బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కీలక నేత.. పదవి తీసుకొని పనిచేయమని కోరిన సీఎం కేసీఆర్..

ABN, First Publish Date - 2023-07-24T20:43:16+05:30

చేరికలతో మంచి ఊపుమీదున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకు (Congress party) షాక్ తగిలింది. యాదాద్రి - భువనగిరి జిల్లాలో ఆ పార్టీకి షాకిస్తూ.. యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ గూటిలో చేరారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో మంత్రి జగదీష్ రెడ్డిని కలిశారు. అనంతరం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

యాదాద్రి : చేరికలతో మంచి ఊపుమీదున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకు (Congress party) షాక్ తగిలింది. యాదాద్రి - భువనగిరి జిల్లాలో ఆ పార్టీకి షాకిస్తూ.. యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ గూటిలో చేరారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో మంత్రి జగదీష్ రెడ్డిని కలిశారు. అనంతరం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై కుంభం అనిల్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.

అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిక సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనిల్ కుమార్ రెడ్డి, శేఖర్ రెడ్డి చెరో పదవి తీసుకుని పని చేయండని సూచించారు. అనిల్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్‌కు హామీ ఇచ్చారు. తాను ఒక్క మాట చెప్పానంటే ప్రాణం పోయినా వెనక్కి పోనని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. కాగా భువనగిరి కాంగ్రెస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మధ్య వర్గపోరు సాగిన విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా కోమటిరెడ్డి గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని, నియోజకవర్గంలో తన ఓటమికి రహస్య మంతనాలు చేస్తున్నారని అనిల్ పలుమార్లు ఆరోపించారు.

Updated Date - 2023-07-24T20:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising