ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YSRCP Vs TDP : చక్రం తిప్పిన యార్లగడ్డ.. వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ.. కలలో కూడా ఊహించి ఉండరేమో..!?

ABN, First Publish Date - 2023-08-19T21:46:00+05:30

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఆ తర్వాత వైసీపీకి పంచన చేరారు. అప్పట్నుంచి వైసీపీ మద్దతుదారుగా ఉంటూ వస్తున్నారు. క్యాడర్ మాత్రం ఆయనతో లేదనే విషయం తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలతో రుజువైంది..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) ముందు అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని రీతిలో టీడీపీ (Telugudesam) షాక్ ఇచ్చింది.! ఏపీలో పలుచోట్ల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచారు. ఎక్కడైతే వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులకు ఎదురులేదు.. అనుకున్న స్థానాల్లో బొక్కాబోర్లాపడింది. అధికారం ఉంది కదా ఎన్ని కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు పన్నినా సైకిల్ పార్టీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. దీంతో వైసీపీకి టీడీపీ ఝలక్ ఇచ్చినట్లు అయ్యింది. ఇవన్నీ ఒక ఎత్తయితే టీడీపీ తరఫున గెలిచి వైసీపీలో చేరిన, మద్దతిచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతుదారులే గెలిచారంటే ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


పసుపు జెండానే ఎగిరింది!

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఆ తర్వాత వైసీపీకి పంచన చేరారు. అప్పట్నుంచి వైసీపీ మద్దతుదారుగా ఉంటూ వస్తున్నారు. క్యాడర్ మాత్రం ఆయనతో లేదనే విషయం తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలతో రుజువైంది. గన్నవరం నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీ అయిన ‘నున్న’లో వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ తగిలింది. 9వ వార్డు ఉప ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో పోటీ చేసిన మాజీ ఎంపీటీసీ బొమ్మిన శ్రీనివాసరావుపై.. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన వల్లూరు వెంకటశివ 25 ఓట్లతో గెలుపొందారు. వైసీపీకి అడ్డాగా ఉన్న నున్న ప్రాంతంలో టీడీపీ పాగా వేయడంతో టీడీపీ శ్రేణులు, యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatrao) వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నాయి. నున్న వార్డును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైపీపీ.. తాము బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అంతేకాదు.. పలువురు వైసీపీ కీలక నేతలు నున్నలోనే మకాం వేశారు కూడా. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కేవలం 825 ఓట్లు ఉన్న చిన్న వార్డు కోసం వైసీపీ లక్షలు ఖర్చు చేసింది. అయినప్పటికీ ఊహించని రీతిలో టీడీపీ మద్దతుదారుడే గెలవడంతో.. ఈ గెలుపు తమకెంతో కిక్కు ఇచ్చిందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.

చక్రం తిప్పిన యార్లగడ్డ..!

వంశీ వైసీపీ పంచన చేరినప్పట్నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న యార్లగడ్డ ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. సరిగ్గా ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికలు జరగడంతో దీన్ని అటు యార్లగడ్డ.. ఇటు వంశీ ఇద్దరూ ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. అయితే.. వంశీని ఈ ఎన్నికలతోనే దెబ్బ కొట్టాలని వ్యూహాలు రచించిన యార్లగడ్డ పక్కా ప్లాన్ వేశారు. ఆ ప్లాన్‌ను ‘నున్న’ అమలు చేయగా వర్కవుట్ అయ్యిందని వెంకట్రావు వర్గీయులు చెబుతున్నారు. అంటే టీడీపీలో చేరక ముందే యార్లగడ్డ ఇలా ఉపఎన్నికలో చక్రం తిప్పారన్న మాట. బహుశా ఇక్కడ తమ పార్టీ మద్దతుదారుడు ఓడిపోతాడని వంశీ కలలో కూడా ఊహించి ఉండరని.. యార్లగడ్డ దెబ్బ అంటే ఇలా ఉంటుందని సోషల్ మీడియా వేదికగా వెంకట్రావు వర్గీయులు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు టీడీపీ కార్యకర్తలు.. యార్లగడ్డ దెబ్బ.. వంశీ అబ్బా..! అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో (TDP Chief Chandrababu) యార్లగడ్డ భేటీ కాబోతున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ భేటీ జరుగుతోంది. ఈనెల 22న అధికారికంగా వెంకట్రావు పసుపు కండువా కప్పుకోబోతున్నారు.

మొత్తానికి చూస్తే.. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఉప ఎన్నికలు వైసీపీకి అధిష్టానానికి ఊపిరి ఆడకుండా చేశాయి. ఒక్క గన్నవరం నియోజకవర్గంలోనే కాదు వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో, ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో జరిగిన పలు పంచాయతీల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ముఖ్యంగా.. గుంటూరు జిల్లాలోని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు స్వగ్రామం అయిన బుర్రిపాలెంలో భారీ మెజార్టీతో టీడీపీ బలపరిచిన వ్యక్తి సర్పంచ్‌‌గా గెలుపొందారు. గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో అధిక సంఖ్యలో టీడీపీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు విజయం సాధించారు. ఒకరకంగా చెప్పాలంటే సెమీ ఫైనల్‌లో ఇది వైసీపీకి ఊహించని ఝలక్ అని చెప్పొచ్చు. ఈ ఫలితాలపై ఇంతవరకూ వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.


ఇవి కూడా చదవండి


Gannavaram : చంద్రబాబుతో యార్లగడ్డ అపాయిట్మెంట్ ఖరారు.. టీడీపీలో చేరిక ఎప్పుడంటే..?


TS Assembly Polls : కాంగ్రెస్‌లో ఉంటారో.. కారెక్కుతారో క్లియర్‌కట్‌గా చెప్పేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి


BRS Candidates List : బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు డేట్, టైమ్, వేదిక ఫిక్స్.. సిట్టింగుల్లో నరాలు తెగే ఉత్కంఠ..!



TS Assembly Elections 2023 : కేసీఆర్ ప్రకటించబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే.. 10 ఉమ్మడి జిల్లాలకు ఫిక్స్..!?


TS Assembly Elections 2023 : సీఎం కేసీఆర్‌తో భేటీ ముగిసిన నిమిషాల్లోనే ఎమ్మెల్యే ఫోన్ స్విచాఫ్.. ఏం జరిగిందా అని ఆరాతీస్తే..!


Independence Day : బాబోయ్ ఏంటిది.. వైసీపీ రిలీజ్ చేసిన ఈ ఫొటో చూశాక.. ఇక మీ ఇష్టం..!



Updated Date - 2023-08-19T21:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising