YSRTP : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన.. డెడ్‌లైన్..
ABN, First Publish Date - 2023-09-25T17:11:40+05:30
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై (YSRTP) గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) వరుసగా బెంగళూరు, ఢిల్లీ వేదికగా సమావేశాలు కావడం, మంతనాలు జరపడం..
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై (YSRTP) గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) వరుసగా బెంగళూరు, ఢిల్లీ వేదికగా సమావేశాలు కావడం, మంతనాలు జరపడం.. అదిగో, ఇదిగో విలీనం అంటూ హడావుడి జరగడం తప్పితే ఇంతవరకూ ఈ ప్రక్రియలో కదలిక లేదు. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తుండటం.. మరోవైపు పార్టీలోని నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్న తరుణంలో షర్మిల కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్-30 లోపు (Sepetember-30) విలీనంపై కాంగ్రెస్ తేల్చాలని ఒకింత అల్టిమేటం జారీచేశారు. తమ డిమాండ్లపై కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని షర్మిల తేల్చిచెప్పేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అంటే.. 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్టీపీ పోటి చేసేందుకు సిద్ధంగా ఉందని.. అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ చేపడుతామని షర్మిల తెలిపారు.
మీకు నేనున్నా..!
సోమవారం నాడు లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో షర్మిల అధ్యక్షతన వైఎస్సార్టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 33 జిల్లాల నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగింది. అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్ననట్లు ఈ సందర్భంగా కార్యకర్తలకు షర్మిల అభయమిచ్చారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కార్యకర్తలు, నేతలకు అధినేత్రి మాటిచ్చారు. అంతేకాదు.. పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని షర్మిల చెప్పుకొచ్చారు. ఆ మధ్య.. పార్టీ విలీనంపై మాట్లాడిన షర్మిల ‘నేనేం చేసినా తెలంగాణ ప్రజల కోసమే.. తెలంగాణ ప్రజల కోసమే నా తాపత్రయం.. అన్ని విషయాలు త్వరలోనే చెబుతా’ అని షర్మిల చెప్పుకొచ్చారు.
ఇంకెన్నాళ్లో..!
కాగా.. సోనియాగాంధీతో భేటీ తర్వాత విలీనం ఖరారవుతుందని.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని చాలారోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు.. జగనన్న వదిలిన బాణాన్ని జగన్‌పైనే ప్రయోగించబోతున్నారని రాజకీయ విశ్లేషణలు కూడా వచ్చాయి. తొలుత తెలంగాణలో ఆమె సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావించినా.. ఆంధ్రప్రదేశ్‌లో అయితేనే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని, ఆమె ద్వారా జగన్‌ను కట్టడి చేయొచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ కూడా బలహీనంగా ఉన్నందున కాంగ్రెస్ పుంజుకోవడానికి షర్మిల చేరిక లాభిస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా అన్న జగన్ జైలులో ఉండగా.. ఆయన వదిలిన బాణంగా రాష్ట్రమంతటా తిరిగి వైసీపీని బలోపేతం చేసిన షర్మిల.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పాలుపంచుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాక తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. ఆస్తిలో వాటా ఇచ్చేందుకూ జగన్ నిరాకరించడంతో.. ప్రత్యామ్నాయం వైపు మళ్లారు. ఇలా ఒకటి కాదు రెండు, మూడు సార్లు షర్మిల.. ఢిల్లీ పర్యటన వెళ్లొచ్చినా ఇంతవరకూ విలీనం వ్యవహారంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అందుకే ఇవాళ పార్టీ మీటింగ్ నిర్వహించడం.. విలీనం, అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా పై విధంగా షర్మిల నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నెల 30 తారీఖులోపు ఏం జరుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
CBN Skill Case : సీఐడీ విచారణలో చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..!?
NCBN Remand : చంద్రబాబుకు మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఈసారి ఎన్నిరోజులంటే..?
CBN CID Enquiry : రెండో రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ.. ఇవాళ ఎన్ని ప్రశ్నలు అడిగారంటే..?
NCBN Arrest : ఢిల్లీలో చినబాబు.. ఏపీలో బాలయ్య బాబు ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. వణికిపోతున్న వైసీపీ!
NCBN CID Enquiry : చంద్రబాబు సీఐడీ విచారణతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పరిస్థితి ఎలా ఉందో చూడండి
Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?
Updated Date - 2023-09-25T17:32:19+05:30 IST