ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinash Vs CBI : కర్నూలులో హైటెన్షన్.. ఎస్పీతో సీబీఐ చర్చలు.. అవినాష్‌‌‌ ఏ క్షణమైనా అరెస్ట్.. రచ్చ రచ్చ చేస్తున్న వైసీపీ శ్రేణులు!

ABN, First Publish Date - 2023-05-22T09:29:00+05:30

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సోమవారం ఉదయం నుంచి కర్నూలు వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సోమవారం ఉదయం నుంచి కర్నూలు వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని (Kadapa MP Avinash Reddy ) ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా కర్నూలు విశ్వభారతి హాస్పిటల్‌లో (ViswaBharati Hospital) చికిత్స పొందుతున్న తల్లి శ్రీలక్ష్మి దగ్గరే అవినాష్ ఉన్నారు. అయితే 19న విచారణకు హాజరుకాకపోవడం, 22న ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు రావాల్సిందేనని సీబీఐ నోటీసులు (CBI Notice) ఇవ్వడం.. ఇప్పట్లో రాలేనని సీబీఐకు అవినాష్ లేఖ రాయడం ఇలా నాలుగు రోజులుగా పెద్ద హైడ్రామానే జరుగుతోంది. అయితే.. ఆదివారం నాడు మరో పదిరోజులు సమయం కావాలని అవినాష్ గడువు కోరడంతో పదే పదే ఎందుకిలా చేస్తున్నారని.. అయితే ఆస్పత్రిలోనే విచారణ లేకుంటే అరెస్ట్ చేయడానికి సీబీఐ ప్లాన్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో విశ్వభారతి ఆస్పత్రి దగ్గరికి సీబీఐ అధికారులే చేరుకోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఓవైపు.. ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించగా.. పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు, అవినాష్ అనుచరులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని వైసీపీలో టెన్షన్ మొదలైంది.

అసలేం జరుగుతోంది..!?

కర్నూలులో పరిస్థితిపై సీబీఐ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి స్థానిక పోలీసు అధికారులతో సీబీఐ బృందం మాట్లాడుతోంది. కర్నూలులో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ సీబీఐ ఆఫీస్‌కు కర్నూలుకు వెళ్లిన అధికారులు సమాచారం అందిస్తున్నారు. మరికొందరు.. కర్నూలు ఎస్పీ కార్యాలయానికి కొందరు సీబీఐ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం ఎస్పీ ఆఫీస్‌, ఆస్పత్రి దగ్గర మరికొంత మంది సీబీఐ అధికారులు ఉన్నారు. కర్నూలు ఎస్పీకి లిఖితపూర్వకంగా సీబీఐ ఎస్పీ సమాచారం ఇచ్చారు. లొంగిపోవాలని ఎంపీ అవినాష్‌కు చెప్పాలంటూ సీబీఐ అధికారులు ఎస్పీని కోరినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా జిల్లా ఎస్పీతో సీబీఐ అధికారులు చర్చిస్తున్నారు. అవినాష్‌రెడ్డిని అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందని సీబీఐ చెబుతోంది. అయితే.. సీబీఐ అధికారుల విజ్ఞప్తిపై ఎస్పీ ఎలా రియాక్ట్ అవుతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వైసీపీ శ్రేణులను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. అయితే ఈసారి అవినాష్‌ను సీబీఐ అరెస్ట్ చేస్తుందా లేకుంటే నోటీసులు ఇస్తుందా అనేదానిపై మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు బృందాలు కర్నూలులో ఉండగా.. కడప, హైదరాబాద్ నుంచి మరికొన్ని బృందాలు అక్కడికి చేరుకుంటున్నాయి.

ఉద్రిక్తత..

ఇదిలా ఉంటే.. విశ్వభారతి ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆస్పత్రి గేటు దగ్గర వైసీపీ శ్రేణులు బైఠాయించాయి. మరోవైపు.. ఆస్పత్రి ఆవరణలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పులివెందుల నుంచి కర్నూలుకు పెద్ద ఎత్తున అవినాష్ అనుచరులు, వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. నాలుగురోజులుగా బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వెళ్లి పులివెందుల వైసీపీ శ్రేణులు షిప్ట్ డ్యూటీలు నిర్వహిస్తున్నాయి. ఎలాగైనా సరే అవినాష్‌ను అరెస్ట్‌ను అడ్డుకోవాలని అవినాష్ అభిమానులు, వైసీపీ శ్రేణులు ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే.. పలుమార్లు బరితెగించి మీడియాపై వరుసగా పులివెందుల వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. ‘మాది పులివెందుల, కడప ఎక్కడైనా దాడులు చేస్తాం’ అని కర్నూలు మీడియాపై వైసీపీ శ్రేణులు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. మొత్తానికి చూస్తే.. అటు పోలీసులు.. ఇటు వైసీపీ శ్రేణులతో విశ్వభారతి ఆస్పత్రి పరిసర ప్రాంతాలు రచ్చరచ్చగానే మారింది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash CBI Enquiry : విచారణకు రాలేనన్న ఎంపీ అవినాష్.. హుటాహుటిన కర్నూల్‌కు సీబీఐ బృందం.. ఏం జరుగుతుందో అని వైసీపీలో నరాలు తెగే ఉత్కంఠ..!

******************************

Avinash Vs CBI : ‘తగ్గేదేలే’.. రావాల్సిందే అంటున్న సీబీఐ.. విచారణ నుంచి తప్పించుకోవడానికి ఎంపీ అవినాష్ ప్లాన్ ఇదేనా..!

******************************

YSRCP : ఎంపీ వల్లభనేని బాలశౌరికి సొంత పార్టీ నుంచే ఇంత అవమానమా.. ఈ ఇన్విటేషన్ చూశాక ముఖ చిత్రమేంటో..!


******************************

Updated Date - 2023-05-22T09:37:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising