Cheap Politics: మంత్రి రోజాకో న్యాయం.. మిగతా వాళ్లకో న్యాయమా? ఇదేం విడ్డూరం?
ABN, First Publish Date - 2023-10-03T20:51:52+05:30
మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఏవో వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు తెగ హడావిడి చేస్తున్నారు. అరెస్ట్ చేయడమే కాకుండా మహిళను ఉద్దేశించి అన్ని బూతులు మాట్లాడతారా అంటూ నీతులు వల్లిస్తున్నారు. మరి వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్లే సమాధానం చెప్పాలి.
నిజానికి ఏ రాజకీయ పార్టీ నేతలు అయినా ఎదుటి వాళ్ల వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం చాలా తప్పు. కానీ ఎదుటి వ్యక్తి చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలాంటి వ్యక్తి అయినా పేట్రేగిపోతారన్న దానికి వైసీపీ నేతల కామెంట్స్ నిదర్శనం. అందులో మంత్రి రోజా ఏం తక్కువ కాదు. ఆమె నోటికి హద్దు ఉండదని అందరికీ తెలిసిన విషయమే. ఆమె ఎలాంటి కామెంట్లు అయినా చేయవచ్చు.. మిగతా వాళ్లు మాత్రం ఆమెను పల్లెత్తు మాట అనకూడదన్న సిద్ధాంతం జగన్ ప్రభుత్వంలో చెలామణి అవుతోంది. ఒక్క రోజా విషయంలోనే కాదు.. వైసీపీ నేతలందరి విషయంలోనూ ఇదే కంటిన్యూ అవుతోంది. మీడియా అయినా సోషల్ మీడియా అయినా హద్దు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం వైసీపీ నేతల నైజంగా కనిపిస్తోంది.
తాజాగా రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఏవో వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు తెగ హడావిడి చేస్తున్నారు. అరెస్ట్ చేయడమే కాకుండా మహిళను ఉద్దేశించి అన్ని బూతులు మాట్లాడతారా అంటూ నీతులు వల్లిస్తున్నారు. మరి వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్లే సమాధానం చెప్పాలి. వైసీపీ హయాంలో ముఖ్యంగా మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్‌తో పాటు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతల ఆడియోలు దగ్గర పెట్టుకుని వైసీపీని సపోర్ట్ చేసే వాళ్లు నీతులు చెప్పాలని సోషల్ మీడియాలో నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు భార్య భువనేశ్వరిని ఉద్దేశించి ఏం వ్యాఖ్యలు చేశారో రోజా మరిచిపోయారా అంటూ నిలదీస్తున్నారు. రోజాకో న్యాయం.. మిగతా వాళ్లకు మరో న్యాయమా అంటూ మండిపడుతున్నారు. టీడీపీ మహిళా నేతలు స్వాతిరెడ్డి, వంగలపూడి అనితలను ఉద్దేశించి వైసీపీ నేతలు కామెంట్స్ చేయలేదా అని సూటి ప్రశ్న వేస్తున్నారు.
గతంలో మంత్రి రోజా ఓ టీవీ డిబేట్‌లో బండ్ల గణేష్‌ను పట్టుకుని పవన్ కళ్యాణ్‌కు పక్కలు వేస్తున్నావా అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నీ భార్యను ఎంతమంది దగ్గర పడుకోబెట్టావని బూతులు మాట్లాడారు. ఆ తర్వాత ఓ ప్రెస్‌మీట్‌లో పవన్‌ను ఉద్దేశించి నోట్లో ఏం పెట్టుకున్నావ్.. హెరిటేజ్ ఐస్‌క్రీమ్ పెట్టుకున్నావా అంటూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇవి బూతులా.. శ్రీరంగనీతులా అనే విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు. మరి రోజా మాత్రం బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యక్తిగత కామెంట్లను బూచిగా చూపిస్తున్నారు. నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది. మన నోటి నిండా విషం పెట్టుకుని పక్కనోడి నోటి గురించి ప్రశ్నించడం చాలా తప్పు. మంత్రి రోజా కూడా ఈ కోవకే చెందుతారు. తాను ఏదో మంచి వ్యక్తి అన్నట్లు బిల్డప్ ఇస్తూ ముసలికన్నీరు కార్చినంత మాత్రాన ఆమె మాట్లాడిన వ్యాఖ్యలను ప్రజలు మరిచిపోరనే విషయం గుర్తుపెట్టుకోవాలి. టీడీపీలో ఉన్నప్పుడు మంచిదాన్ని.. వైసీపీలోకి రాగానే తాను చెడ్డదాన్ని అయిపోయానా అంటూ ట్విట్టర్‌లో రోజా ప్రశ్నలు వేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు దేవుడిలా కనిపించి.. ఆమె వైసీపీలోకి వెళ్లగానే రాక్షసుడు అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదో లేదో రోజా తన మనసాక్షినే అడగాలి.
Updated Date - 2023-10-03T20:58:03+05:30 IST