ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSRCP MLC Candidates : లక్ అంటే ఈయనదే.. వైసీపీలో చేరిన రెండ్రోజులకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన YS Jagan.. ఓహో అసలు ప్లాన్ ఇదా..!

ABN, First Publish Date - 2023-02-20T17:51:59+05:30

అవును.. టీడీపీకి (TDP) టాటా చెప్పి వైసీపీ తీర్థం (YSRCP) పుచ్చుకున్న రెండ్రోజులకే మాజీ ఎమ్మెల్యేను సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎమ్మెల్సీ అభ్యర్థిగా (MLC Candidate) ప్రకటించారు. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. టీడీపీకి (TDP) టాటా చెప్పి వైసీపీ తీర్థం (YSRCP) పుచ్చుకున్న రెండ్రోజులకే మాజీ ఎమ్మెల్యేను సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎమ్మెల్సీ అభ్యర్థిగా (MLC Candidate) ప్రకటించారు. టీడీపీలో ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేశారని మరీ తిట్టిపోసిన ఆయన్ను వైసీపీ అధిష్టానం ఆదరించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిందని ఆ పార్టీ శ్రేణులు గర్వంగా చెప్పుకుంటున్నాయి. కానీ ఆయనకంటే ముందు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారు, వైసీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో ఉన్నవారికి మాత్రం జగన్ మొండి చెయ్యి చూపించారని ఆరోపణలు లేకపోలేదు. ఇంతకీ వైసీపీలో చేరిన రెండ్రోజులకే లక్కీగా ఛాన్స్ కొట్టేసిన ఆ వ్యక్తి ఎవరు..? ఆయన్ను జగన్ అంతగా నమ్మి పదవి ఎందుకు ఇవ్వాలనుకున్నారు..? పదవులు వస్తాయని వేయి కళ్లతో వేచి చూసి అసంతృప్తికి లోనైన ఆ నేతలెవరు..? ఈ అభ్యర్థుల ప్రకటనపై వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయ్.. అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఎవరా వ్యక్తి..!

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను (YCP MLC Candidates List) సోమవారం నాడు అధిష్టానం విడుదల చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితాపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Reddy) కసరత్తు చేశాక చివరికి అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajja Ramakrishna reddy) మొత్తం 18 మంది అభ్యర్థుల పేర్లను మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ అభ్యర్థుల్లో బీసీ వర్గానికి చెందిన 11 మంది, ఓసీ 4, ఎస్సీ 2, ఎస్టీ వర్గానికి చెందిన ఒకరు ఉన్నారు. ఇందులో స్థానిక సంస్థల కోటాలో 9 మంది, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యే కోటాలో జయమంగళ వెంకటరమణ (బీసీ వడ్డీ, కైకలూరు) పేరు ఉండటం వైసీపీ శ్రేణులు ఆశ్చర్యానికి లోనయ్యాయి.

వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయ్..!

కైకలూరు (Kaikalur) మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ (Jayamangala Venkata Ramana) రెండ్రోజుల క్రితం టీడీపీని వీడి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఒకరిద్దరు టీడీపీ నేతలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ.. పార్టీలో చేరిన రెండ్రోజులకు అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో వైసీపీ శ్రేణులు షాకవుతున్నాయి. ఇదేంట్రా బాబోయ్.. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వాళ్లను వదిలేసి నిన్న గాక మొన్న వచ్చిన వెంకటరమణను అభ్యర్థిగా ప్రకటించడమేంటని సొంత పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే.. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చిన తర్వాతే పార్టీలో చేరి ఉంటారేమో అని మరికొందరు కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకంత నమ్మకం..!

వెంకటరమణ.. 2019 ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. కేవలం 9,357 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు (Dulam Nageswara Rao) గెలిచారు. రానున్న 2024 ఎన్నికల్లో అయినా సరే కచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని ప్రజల్లో బాగానే తిరిగారు వెంకటరమణ. టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలా ఆదుకునేవారు. అయితే అప్పట్లో టీడీపీ తరఫున ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని పార్టీపై కోపం పెంచుకున్నారని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేతలకు ఈ విషయం తెలియడం, రాయబారం పంపడంతో ఆయన్ను అధిష్టానం పార్టీలో చేర్చుకుంది. వెంకటరమణ టీడీపీలో కీలక వ్యక్తే.. ఆయన అదే పార్టీలో ఉండి ఉంటే కచ్చితంగా రానున్న ఎన్నికల్లో టికెట్ ఆయనదే. అలాంటి వ్యక్తి వైసీపీలో చేరారంటే కచ్చితంగా టికెట్ ఆశిస్తారు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అందుకే ఆయన వచ్చీరాగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేస్తే ఇక ఎమ్మెల్యే టికెట్ దాకా రారని.. రానున్న ఎన్నికల్లో కైకలూరు వైసీపీదే అని పక్కా ప్లాన్‌తోనే అధిష్టానం ఇలా చేసిందని తెలుస్తోంది.

వాస్తవానికి.. రాయలసీమలో (Rayalaseema) ముఖ్యంగా కర్నూలు జిల్లాకు (Kurnool) చెందిన ఒకరిద్దరు ముఖ్య నేతలు ఎప్పట్నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈసారైనా ఏదో ఒక చిన్న పదవి వస్తుందేమో అని ఆశపడ్డారు కానీ.. వారి ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. ఇక నెల్లూరు (Nellore), గోదావరి జిల్లాల నుంచి అయితే చాలా మందే ఆశావహులు ఉన్నారు కానీ.. వారి పరిస్థితి కూడా అదే. జగన్‌ను నమ్ముకున్న, ఆయన్ను ప్రసన్నం చేసుకున్న వారికి పదవులు వచ్చాయ్ కానీ.. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వారిని మాత్రం అధిష్టానం గుర్తించలేదనే ఆరోపణలూ లేకపోలేదు. మరి ఇంత అసంతృప్తిగా ఉన్న పార్టీ నేతలకు జగన్ ఎలా సర్ది చెబుతారో ఏంటో వేచి చూడాల్సిందే.


**********************************

ఇవి కూడా చదవండి..


**********************************

MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే..


**********************************

#RIPTarakaRatna : నందమూరి తారకరత్న పాత జ్ఞాపకాలు.. ఈ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు..!


**********************************

BRS : బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న విషాదాలు.. సాయన్న మరణవార్త మరువకముందే మరో సీనియర్ నేత కన్నుమూత..


**********************************

MLA Sayanna: గుండెపోటుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి


**********************************

#RIPTarakaRatna : రాజకీయాలను పక్కనపెట్టి నందమూరి తారకరత్న ఇంటికి వైఎస్ షర్మిల..

**********************************

TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!


**********************************

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!


**********************************

TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!

Updated Date - 2023-02-20T18:24:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising