YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమే.. ఈ ఒక్క పరిణామంతో క్లియర్ కట్‌గా తెలిసిపోయిందిగా..!?
ABN, First Publish Date - 2023-08-09T15:29:13+05:30
వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి సమయం ఆసన్నమైందా..? అతి త్వరలోనే విలీన ప్రక్రియ ముగియనుందా..? ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పెద్దలతో వైఎస్ షర్మిల (YS Sharmila) భేటీ కాబోతున్నారా..? రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే (New Delhi)పెద్దలతో కీలక చర్చలు జరపబోతున్నారా..? అంటే తాజా పరిస్థితులు, జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని తెలుస్తోంది..
వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్‌లో (Congress) విలీనం చేయడానికి సమయం ఆసన్నమైందా..? అతి త్వరలోనే విలీన ప్రక్రియ ముగియనుందా..? ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పెద్దలతో వైఎస్ షర్మిల (YS Sharmila) భేటీ కాబోతున్నారా..? రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే (New Delhi)పెద్దలతో కీలక చర్చలు జరపబోతున్నారా..? అంటే తాజా పరిస్థితులు, జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని తెలుస్తోంది. ఇంతకీ షర్మిల ఎప్పుడు ఢిల్లీ వెళ్లబోతున్నారు..? హస్తిన వేదికగా ఎవరెవరితో భేటీ కాబోతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనం..
హస్తిన టూర్ ఎప్పుడో..?
గత వారం రోజులుగా బెంగళూరులోనే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) ఉంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీని విలీనం చేసేందేకు కర్ణాటక డిప్యూటీ సీఎం, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో (DK Shiva Kumar) సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే రెండుసార్లు భేటీ అయిన షర్మిల.. ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. శివకుమార్‌తో కలిసి త్వరలోనే ఆమె ఢిల్లీకి వెళ్తారని తెలిసింది. రెండ్రోజుల పాటు హస్తినలోనే ఉంటారని.. ఈ పర్యటనలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో (KC Venugopal) భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో భేటీ అనంతరం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని (Sonia Gandhi) కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన, వరుస భేటీలు ఇవన్నీ రెండు మూడ్రోజుల్లో జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఎలాంటి షరుతులు లేకుండా పార్టీని విలీనం చేయాలని.. తప్పకుండా సమయం వచ్చినప్పుడు పార్టీ నుంచి పదవులు.. అధికారంలోకి వస్తే మంచి ప్రాధాన్యతే ఇస్తామని షర్మిలకు హామీ ఇవ్వబోతున్నారట. అయితే.. షర్మిల మాత్రం వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయడంతో పాటు.. కొన్ని అసెంబ్లీ సీట్లను తన పార్టీ అభ్యర్థుల కోసం అడుగుతున్నట్లు తెలియవచ్చింది.
కాంగ్రెస్ ప్లాన్ ఇదీ..!
షర్మిల రాకను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకింత వ్యతిరేకించినట్లుగానే మాట్లాడుతున్నారు. దీంతో షర్మిల పార్టీ విలీనం అయ్యాక.. ఏపీ బాధ్యతలు (AP Congress) షర్మిలకు కట్టబెట్టాలనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. షర్మిల మాత్రం ఏపీకి వెళ్లే ప్రసక్తే లేదని.. తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి (CM YS Jagan Reddy) వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఇష్టపడట్లేదట. తెలంగాణలో (Telangana) మాత్రమే తన సేవలు వినియోగించుకోవాలని షర్మిల కొన్ని కండిషన్స్ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ సెట్ అయిన తర్వాత పార్టీని విలీనం చేయడానికి ముందుకొస్తానని షర్మిల కరాఖండిగా చెప్పేయబోతున్నారని తెలుస్తోంది. అయితే వీటన్నింటిపైన ఏకాభిప్రాయం వస్తేనే విలీన ప్రకటన వారం రోజుల్లో ఉండే అవకాశం ఉందని సమాచారం. కాగా.. చాలారోజులుగా విలీనంపై వార్తలు వస్తున్నా షర్మిల, ఆ పార్టీ నేతలు ఖండిస్తూనే వస్తు్న్నారు గానీ.. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలపై మాత్రం ఎక్కడా రియాక్షన్ లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పుకోవచ్చు.
ఈ ట్వీట్లే సాక్ష్యమా..?
మరోవైపు.. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్‌కు సంబంధించి ఏ సందర్భం వచ్చినా సరే ట్విట్టర్ వేదికగా వెంటనే షర్మిల రియాక్టయిపోతున్నారు. ఇందుకు రాహుల్ గాంధీ పుట్టిన రోజు, ఇటీవల రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునురుద్ధరించడంపై షర్మిల చేసిన ట్వీట్లు మరింత బలాన్ని ఇస్తున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తానికి చూస్తే.. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ వేదికగా సమావేశాలు.. అవన్నీ సక్సెస్ అయితే మరో వారం రాజుల్లో విలీనం ఉంటుందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే ఒకట్రెండు రోజులు ఆగాల్సిందే మరి.
ఇవి కూడా చదవండి
TS Assembly Election 2023 : ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన కాంగ్రెస్.. ఇక అస్త్రాలు ప్రయోగించడమే ఆలస్యం.. ఈ దెబ్బతో..!
Gaddar And KCR : షాకింగ్.. గద్దర్‌ను కేసీఆర్ ఇంతలా అవమానించారా.. 3 గంటలపాటు ఎండలోనే..!
TS Congress : ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం.. ఇక రాబోయే రోజుల్లో..!
TS Politics : బీఆర్ఎస్‌కు ఊహించని షాక్.. కాంగ్రెస్‌లోకి బిగ్ షాట్.. పార్టీలో చేరకముందే సర్వే చేయగా..?
YSRCP Targets Chiru : రీల్ ‘BRO’తో మొదలై ‘రియల్ బ్రో’ చిరు దగ్గర బ్లాస్ట్.. రేపొద్దున ఇదేగానీ జరిగితే వైసీపీ పరిస్థితి ఊహకందేనా..!?
Updated Date - 2023-08-09T15:33:52+05:30 IST