YS Sharmila : కేసీఆర్‌కు ‘షూ’ గిఫ్ట్‌గా పంపిన వైఎస్ షర్మిల.. ఎందుకో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-02-02T18:02:15+05:30
వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) పార్టీ స్థాపించిన నాటి నుంచి నిత్యం వార్తల్లో..
హైదరాబాద్ : వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) పార్టీ స్థాపించిన నాటి నుంచి నిత్యం వార్తల్లో (News) నిలుస్తూనే ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీని (BRS) అస్తమాను టార్గెట్ (Target) చేయడం.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్‌పై (Minister KTR) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఒకానొక సందర్భంలో అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని మీడియాకే ఎదురు ప్రశ్న సంధించారు షర్మిల. ఇక కేసీఆర్‌ను అయితే ఎన్నిసార్లు విమర్శించారో లెక్కేలేదు. తాజాగా.. సీఎం కేసీఆర్‌కు ఊహించని గిఫ్ట్ (Gift) పంపారు షర్మిల. ఈ గిఫ్ట్ తీసుకుని ఛాలెంజ్ (Challange) స్వీకరించాలన్నారు. ఇంతకీ షర్మిల పంపిన గిఫ్టేంటి..? ఛాలెంజ్ కథేంటి..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.
ఇదీ అసలు కథ..
సీఎం కేసీఆర్‌కు బూట్లు గిఫ్ట్‌గా పంపారు షర్మిల. అదేంటి బూట్లు (Shoes) పంపారని అనుకుంటున్నారా.. దీని వెనుక పెద్ద కథే చెప్పారు షర్మిల. కేసీఆర్ తన పాలన అద్భుతమని అంటున్నారని.. అదే నిజమైతే తనతో పాదయాత్రకు (Padayatra) వచ్చి రుజువు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సమస్యలే లేవని నిరూపిస్తే.. ముక్కు నేలకు రాసి రాజకీయాలు (Politcs) మానేస్తానని చెప్పారు. ఒకవేళ ఇది నిజం కాకపోతే, కేసీఆర్ రాజీనామా (Resignation) చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ (Sorry) చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం దళితుడిని సీఎంను చేయాలని కూడా షర్మిల సవాల్ విసిరారు. కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి సీఎం అయ్యారని, కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని ఆరోపించారామె. కేసీఆర్‌కు దమ్ముంటే, ఆయన పాలనపై నమ్మకం ఉంటే.. ఒక్కరోజు పాదయాత్రకు రావాలని సవాల్ చేశారు. ఇందుకు షూ బాక్స్‌ను ప్రగతిభవన్‌కు (Prgathi Bhavan) పంపిస్తున్నాని మీడియా ముఖంగా వెల్లడించారామె. ఒకవేళ కాలు సైజ్‌కు సెట్ అవ్వకపోతే మార్పిడి చేయడానికి బిల్లు కూడా పంపిస్తున్నాంటూ షర్మిల చెప్పుకొచ్చారు.
రండి.. జనాల్లో తిరగండి..!
పిట్టల దొర లాగా కేసీఆర్ ప్రైవేట్ విమానాల్లో టోపీ పెట్టుకొని తిరగడం కాదని, గులాబీ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ప్రజల గురించి ఆలోచించాలన్నారు షర్మిల. వైఎస్సార్ హయాంలో ప్రజా దర్బార్ (Prajadarbar) ఎంతో వైభవంగా జరిగేదని, సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని (Chief Minister) కలిసేవారని, ఇప్పుడు ఉద్యమకారులకు కూడా కేసీఆర్‌ను కలవడం లేదన్నారు షర్మిల. ‘పాదయాత్ర ఒక యజ్ఞంలాంటిది. అది.. అందరికీ సాధ్యం కాదు. ప్రతి నియోజకవర్గంలో అక్కడి సమస్యలు మాట్లాడకపోతే.. నేను ఈ యజ్ఞానికి, తెలంగాణ ప్రజలకు, వైఎస్సార్టీపీ ద్రోహం చేసినట్లు అవుతాను. ఇంతకు ముందు ఎలాగైతే పాదయాత్ర సాగిందో అలాగే సాగుతుంది. అడుగడుగునా కేసీఆర్ వైఫల్యాలను, స్థానిక ఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టడం జరుగుతుంది. నేను ఎవ్వరినీ వ్యక్తిగతంగా విమర్శించను. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతేనే ప్రశ్నిస్తాను’ అని షర్మిల చెప్పుకొచ్చారు.
ఇదే ట్రెండింగ్‌లో..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) షర్మిల కామెంట్స్, షూ చూపిస్తున్న ఫొటోలు, వీడియోలు (Photos, Videos) తెగ వైరల్ (Viral) అవుతున్నాయి. వైఎస్ షర్మిల (#YSSharmila) పేరిట ట్యాగ్ కూడా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు.. ఇటు ప్రాంతీయ, అటు జాతీయ మీడియాల్లోనూ షర్మిల హాట్ టాపిక్ అయ్యారు. ఎక్కడ చూసినా షర్మిల గురించే చర్చ నడుస్తోంది.
వైఎస్ షర్మిల ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా అధికారపార్టీపై ఏదో ఒకలా హడావుడి చేస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్లుగా బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ కూడా వస్తూనే ఉంది. తాజాగా షూ వ్యవహారంపై గులాబీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు.. షర్మిలకు రిటర్న్ గిఫ్ట్ (Return Gift) ప్లాన్ చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే మరి.
Updated Date - 2023-02-02T19:07:53+05:30 IST