కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TTD: వైవీకి మళ్లీ టీటీడీ పదవి లేనట్లేనా? చైర్మన్‌ రేసులో ముందుంది ఎవరంటే..

ABN, First Publish Date - 2023-08-04T22:00:06+05:30

వైసీపీలో కీలక నేతగా ఉన్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని తిరిగి ఆ పదవి వరిస్తుందా లేదా? ఇది ప్రకాశం జిల్లాలో రాజకీయవర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో చర్చనీయాశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగిన వైవీ పదవీకాలం ఈ నెల 12తో ముగియనుంది. దీంతో రాష్ట్ర స్థాయిలో పలువురు వైసీపీ నాయకులు సీఎం జగన్‌ను కలిసి టీటీడీ చైర్మన్‌ పదవికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

TTD: వైవీకి మళ్లీ టీటీడీ పదవి లేనట్లేనా? చైర్మన్‌ రేసులో ముందుంది ఎవరంటే..

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

వైసీపీలో కీలక నేతగా ఉన్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని తిరిగి ఆ పదవి వరిస్తుందా లేదా? ఇది ప్రకాశం జిల్లాలో రాజకీయవర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో చర్చనీయాశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగిన వైవీ పదవీకాలం ఈ నెల 12తో ముగియనుంది. దీంతో రాష్ట్ర స్థాయిలో పలువురు వైసీపీ నాయకులు సీఎం జగన్‌ను కలిసి టీటీడీ చైర్మన్‌ పదవికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అలా కోరుతున్న వారిలో జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కూడా ఉన్నారు. వైసీపీలో కీలక నేతల సమాచారం మేరకు.. వైవీని తిరిగి ఆ పదవిలో కొనసాగించక పోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఆ పదవిలో ఉండటంతోపాటు సాధారణ ఎన్నికలు దగ్గర పడటంతో ఆయనకు పార్టీ బాధ్యతలు పెంచారు.

ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ బాధ్యతలను ప్రస్తుతం వైవీ చూస్తున్నారు. అంతేకాక తన కుమారుడిని రాజకీయంగా ప్రోత్సహించాలని సీఎంని కోరారు. తదనుగుణంగా వచ్చే ఎన్నికల్లో కుమారుడికి పోటీ చేసే ఆవకాశం ఇవ్వాలని అడగటంతో పాటు గతం నుంచి ఆయన ఆశిస్తున్న రాజ్యసభ పదవి విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే కుమారుడు విక్రమ్‌రెడ్డి భవిష్యత్తును తాను చూసుకుంటానని జగన్‌ చెప్పినట్లు కూడా ఆయన కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. అదే సమయంలో టీటీడీ చైర్మన్‌ పదవిలో కొనసాగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు. తదనుగుణంగానే చైర్మన్‌ పదవిని బీసీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కొంతకాలంగా జరుగుతుంది. అయితే తిరుపతి ఎమ్మెల్యే భూమనతో పాటు ప్రత్యక్ష్య రాజకీయాల్లో లేకపోయిన సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న కొందరు పారిశ్రామికవేత్తలు కూడా ఆ పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. వైవీని చైర్మన్‌ పదవి నుంచి తొలగిస్తే పాలకమండలి సభ్యురాలిగా ఆయన సతీమణికి ఇవ్వవచ్చని తెలిసింది.


శిద్దా ప్రయత్నాలు

కాగా జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, మాజీమంత్రి శిద్దా రాఘవరావు కూడా టీటీడీ చైర్మన్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల సీఎంను కలిసిన సందర్భంలో శిద్దా చైర్మన్ పదవి ఆశిస్తున్నారని, అవకాశం ఉంటే చూడాలని బాలినేని చెప్పినట్లు తెలిసింది. సీఎం ఏమి ఆలోచించాడనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ దాని కోసం విపరీతమైన పోటీ ఉందని వాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాగా చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా శిద్దా కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ సలహదారుడు సజ్జల తదితరులను కూడా శిద్దా కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో 12వ తేదీతో పూర్తికానున్న పాలకమండలి స్థానంలో కొత్త పాలక మండలిని ముందుగానే ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు.

Updated Date - 2023-08-04T22:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising