Crime: 13 ఏళ్ల బాలిక.. ఇలా చేస్తుందని ఎవరైనా ఊహించగలరా..? ఇంటి వెనుక గుర్తు పట్టలేని స్థితిలో 9 ఏళ్ల చెల్లి మృతదేహం..!
ABN, First Publish Date - 2023-05-26T21:31:17+05:30
చాలా మంది.. ఎవరికీ తెలియదులే అనుకుంటూ తప్పులు మీద తప్పులు చేస్తుంటారు. తీరా చివరకు ఆ తప్పులు బయటపడే పరిస్థితి వచ్చేసరికి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఎక్కడ తమ పరువు పోతుందనే ఉద్దేశంతో ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలో...
చాలా మంది.. ఎవరికీ తెలియదులే అనుకుంటూ తప్పులు మీద తప్పులు చేస్తుంటారు. తీరా చివరకు ఆ తప్పులు బయటపడే పరిస్థితి వచ్చేసరికి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఎక్కడ తమ పరువు పోతుందనే ఉద్దేశంతో ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలో ఆఖరికి కుటుంబ సభ్యులను చంపడానికి కూడా వెనుకాడరు. ఇటీవల బీహార్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో 13 ఏళ్ల బాలిక చేసిన పని.. చివరకు చాలా దూరం వెల్లింది. ఆమె ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్ (Bihar) పాట్నా వైశాలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికకు (girl) ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో (young man) కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా (love) మారింది. అప్పటి నుంచి ఇంట్లో వారికి తెలీకుండా ప్రియుడిని కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు బాలిక తల్లిదండ్రులు బయటి ప్రాంతానికి వెళ్లారు. దీంతో బాలిక ప్రియుడిని ఏకంగా ఇంటికే పిలిపించుకుంది. ఇద్దరూ ఇంట్లో ఏకాంతంగా ఉండగా.. బాలిక చెల్లెలు వారిని చూసింది. దీంతో ఒక్కసారిగా వారు భయందోళనకు గురయ్యారు. ‘‘ఈ విషయం అమ్మానాన్నలకు చెపొద్దు’’.. అని వేడుకుంది. ఇందుకు చెల్లెలు కూడా అంగీకరించింది. అయితే తర్వాత బాలిక తన ప్రియుడితో కలిసి ఈ విషయంపై చాలా సేపు మాట్లాడింది. ఒకవేళ చెబితే తమ పరువు పోతుందని భావించి, ఎలాగైనా చెల్లెలిని హత్య చేయాలని నిర్ణయించుకుంది.
ఇంట్లోకి తీసుకెళ్లి ప్రియుడితో కలిసి చెల్లెలిని హత్య చేసింది. తర్వాత మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. అయితే దుర్వాసన వస్తుండడంతో తర్వాత మృతదేహాన్ని గుర్తు పట్టని విధంగా చేసి, ఇంటి వెనుక గొయ్యి తీసి పాతి పెట్టారు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు చిన్న కూతురు కనిపించకపోవడంతో పెద్ద కూతురిని అడిగారు. తనకేమీ తెలీదని చెప్పడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఫోన్ కాల్స్ ఆధారంగా అక్కను అదుపులోకి తీసుకుని విచారించగా చివరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Updated Date - 2023-05-26T21:31:17+05:30 IST