ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Punjab Incident: ఈ వీడియో చూస్తే తట్టుకోలేరు.. పక్కనే పిల్లాడు ఏడుస్తున్నా, కనికరం లేకుండా ఆ దుండగులు..

ABN, First Publish Date - 2023-08-11T21:11:47+05:30

పంజాబ్‌లో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే.. నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పక్కనే బాధితుని కుమారుడు ఉన్నాడన్న ఇంకితజ్ఞానం లేకుండా..

పంజాబ్‌లో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే.. నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పక్కనే బాధితుని కుమారుడు ఉన్నాడన్న ఇంకితజ్ఞానం లేకుండా.. వాళ్లు కర్రలతో ఆ వ్యక్తిని చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని మాన్సాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి, తన కుమారుడ్ని స్కూల్ వద్ద దింపడానికి బైక్‌లో వచ్చాడు. ఆయనపై దాడి చేసేందుకు అప్పటికే ఆ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు మాటు వేసి ఉన్నారు. మరో ముగ్గురు బైక్‌పై ఆయన్ను వెంబడిస్తూ స్కూల్ వద్దకు చేరుకున్నారు.


బాధితుడు స్కూల్ వద్దకు చేరుకున్నాడో లేదో, బైక్‌పై వెంబడించిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు కిందకు దిగి, వెనుక నుంచి గొంతుని బిగపట్టి పట్టుకున్నాడు. మరో ఇద్దరు కర్రలు తీసుకొని, ఆయనపై దాడి చేయడం మొదలుపెట్టారు. ఇంతలో వైట్ కుర్తాలో వచ్చిన ఇంకో వ్యక్తి.. బాధితుడి కుమారుడ్ని బైక్‌పై నుంచి దింపాడు. ఆ తర్వాత అతడు కూడా ఒక కర్ర అందుకొని.. ఆ వ్యక్తిపై దాడి చేశాడు. ఈ క్రమంలో బాధితుడు కిందకు పడిపోయాడు. బాధితుడు తిరుగుబాటు చేసేందుకు గట్టిగా ప్రయత్నించాడు కానీ, ఓ వ్యక్తి ఆయన్ను బిగ్గరగా పట్టుకోవడం వల్ల సాధ్యం కాలేదు. ఒకేసారి నలుగురు వ్యక్తులు దాడి చేయడంతో.. చుట్టుపక్కల ఉన్న వాళ్లు కూడా విడిపించలేకపోయారు. చోద్యం చూస్తూ ఉండిపోయారు. వీళ్లందరూ ఇలా దాడి చేస్తుంటే.. పాపం బాధితుడి కుమారుడు ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. మా నాన్నను వదిలేయండి అంటూ అతడు రోధించాడు.

నిందితులు కసితీరా కొట్టిన తర్వాత అక్కడి నుంచి రెండు బైక్‌లపై వెళ్లిపోయారు. ఇంతలో ఒక మహిళ ముందుకొచ్చి.. బాధితుడ్ని లేపి, ఆసుపత్రికి తరలించారు. ఆ కుర్రాడు మాత్రం ఏం చేయాలో పాలుపోక, ఏడుస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, నిందితులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా.. నిందితులు, బాధితుడి మధ్య చాలాకాలం నుంచి విభేదాలు ఉన్నట్టు తేలింది. ఇంతకుముందు కూడా ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయని తెలిసింది. అయితే.. ఈసారి బాధితుడు ఒంటరిగా దొరకడంతో, నిందితులు మూకుమ్మడిగా దాడి చేసి, ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Updated Date - 2023-08-11T21:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising