ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Old Man: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 60 ఏళ్ల వృద్ధుడు.. రూ.32 లక్షలు ఎలా పోయాయన్నది చెప్పగానే..!

ABN, First Publish Date - 2023-11-23T16:32:00+05:30

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. దారుణంగా మోసపోయే ప్రమాదం ఉంది. నేరస్థులు ఎప్పకప్పుడు కొత్త కొత్త మార్గాల ద్వారా అమాయకులను బురిడీ కొట్టించడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఇలాంటి నేరాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. దారుణంగా మోసపోయే ప్రమాదం ఉంది. నేరస్థులు ఎప్పకప్పుడు కొత్త కొత్త మార్గాల ద్వారా అమాయకులను బురిడీ కొట్టించడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఇలాంటి నేరాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ వృద్ధుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 60 ఏళ్ల వృద్ధుడు.. తాను రూ.32 లక్షలు మోసపోయిన విధానాన్ని వివరించాడు. అతడు చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక దబ్రీ ప్రాంతానికి చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధుడికి ఊహించని అనుభవం ఎదురైంది. కొన్ని రోజుల క్రితం ఇతడికి గుర్తుతెలియని యువతి నుంచి ఫోన్ వచ్చింది. తర్వాత అదే అమ్మాయి (young woman video call) వీడియో కాల్ కూడా చేసింది. అయితే వీడియో కాల్‌లో దుస్తులు విప్పుతూ అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించింది. వృద్ధుడిని కూడా దుస్తులు విప్పమని కోరింది. ఇలా చేసిన కొద్దిసేపటికి ఫోన్ కట్ చేసింది. అయితే మరికొద్ది సేపటికి వేరే నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తనని తాను క్రైమ్ బ్రాంచ్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ‘‘మీ అసభ్యకర వీడియో దొరికింది.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవుతుండగా.. మీ పరువును దృష్టిలో ఉంచుకుని మేము దాన్ని ఆపేశాం’’.. అని చెబుతూ చివరకు డబ్బులు డిమాండ్ చేశారు.

Rusk Making Video: రస్కులు తినే అలవాటుందా..? ఎలా చేస్తున్నారో చూస్తే కొనడానికి కూడా భయపడతారేమో..!

దీంతో విధిలేని పరిస్థితుల్లో వారు చెప్పిన ఖాతాలో దఫ దఫాలుగా సుమారు రూ.32లక్షలను జమ చేశాడు. అయినా నిందితులు మళ్లీ మళ్లీ బెదిరిస్తుండడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుమేరకు నవంబర్ 20న పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు హరిదాస్ నగర్‌లో ఓ పోలీసుకూ షాకింగ్ అనుభవం ఎదురైంది. ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‪‌గా పని చేస్తున్న దిలావర్ అనే వ్యక్తికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి పోలీసులక స్నేహితుడిని అని చెప్పుకొంటూ ‘‘నేను నీ చిన్ననాటి స్నేహితుడు రాకేష్‌ని.. ప్రస్తుతం నా కొడుకు ఆరోగ్యం చాలా విషమంగా ఉంది’’.. అని చెబుతూ రూ.90వేలు అర్జంట్‌గా కావాలని అడిగాడు. అతడి మాటలు నమ్మిన పోలీసు.. నగదును వెంటనే పంపించాడు. తర్వాత మోసపోయానని తెలుసుకున్న అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Funny Video: ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్ముతున్న ప్రియుడు.. అటుగా వెళ్తూ చూసి అవాక్కైన ప్రేయసి.. చివరకు..!

Updated Date - 2023-11-23T16:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising