ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking Video: ఈ స్కూల్లో అమ్మాయిలకు ఏమైంది..? ఒకేసారి 95 మందికి పక్షవాతం.. నడవలేని స్థితిలో..!

ABN, First Publish Date - 2023-10-07T16:27:56+05:30

ఓ వైపు టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు అంతే స్థాయిలో కాలుష్యం కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రతీదీ కాలుష్యమయం అవడంతో మనిషిని అనేక రకాల జబ్బులు చుట్టుముడుతున్నాయి. కొన్నిసార్లు వింత వింత వ్యాధులతో...

ఓ వైపు టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు అంతే స్థాయిలో కాలుష్యం కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రతీదీ కాలుష్యమయం అవడంతో మనిషిని అనేక రకాల జబ్బులు చుట్టుముడుతున్నాయి. కొన్నిసార్లు వింత వింత వ్యాధులతో ఇబ్బందులు పడే వారిని కూడా చూస్తూ ఉంటాం. తాజాగా, కెన్యాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సుమారు 95మంది బాలికలు.. ఉన్నట్టుండి పక్షవాతానికి గురై నడవలేక ఇబ్బందిపడ్డారు. ఈ సమస్యకు గల కారణాలు కూడా కనుక్కోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే..

కెన్యాలోని (Kenya) కాకామెంగా కౌంటీలోని సెయింట్ థెరిసా అరేగి బాలికల ఉన్నత పాఠశాలలో (Girls High School) ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో మొత్తం 95మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఇదిలావుండగా, ఇటీవల వీరు పాఠశాలలో చదువుకుంటుండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా బాగున్న బాలికలంతా ఉన్నట్టుండి (Girls are unable to walk) సడవలేక ఇబ్బంది పడ్డారు. కాళ్లు తిమ్మిర్లుగా ఉండడంతో పాటూ స్పర్శ కోల్పోవడంతో నిల్చున్న వారంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మరికొందరు కుంటుకుంటూ నడుస్తూ పాఠశాల గదిలోకి వెళ్లారు.

Viral Video: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? పక్కోళ్ల ప్రాణాలకు కూడా రిస్కే.. ఒకే బైకుపై ఏడుగురు ఎలా వెళ్తున్నారో చూస్తే..!

ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కంగారుపడి పరుగుపరుగున పాఠశాల వద్దకు చేరుకున్నారు. బాలికలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికల కాళ్లు పక్షవాతానికి (Paralysis) గురైనట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధికి గల కారణాలు తెలుసుకునేందుకు బాలికల నుంచి రక్తం, మూత్రం నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. అయినా ఈ వ్యాధికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదని తెలుస్తోంది. ఈ ఘటనతో పాఠశాలలన్నింటినీ మూసేశారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Viral video) తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Crime news: చిన్న కూతురుతో కలిసి ఇంట్లో ఉన్న తండ్రి.. కాసేపటికి పెద్ద కూతురు లోపలికి వెళ్లి చూడగా..

Updated Date - 2023-10-07T16:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising