ఈ రోజు మందు ఫ్రీ.. అనే బోర్డును చూసి క్లబ్‌లోకి వెళ్లాడో వ్యక్తి.. చివరకు అతడి శవమే బయటకు వచ్చింది.. అసలేం జరిగిందంటే..!
ABN, First Publish Date - 2023-04-19T17:01:51+05:30
అతడో మందు ప్రియుడు. ఆ దారిలో ఓ క్లబ్ కనిపించింది. దాని ఎదురుగానే ఓ కూడా బోర్డు కనిపించింది. ఆ బోర్డుపైన ఈరోజు మందు ఫ్రీ అని రాసుంది. అంతే ప్రాణం లేసొచ్చిందీ. తృప్తిగా ఆస్వాదిద్దామని లోపలికి వెళ్లాడు. కానీ
అతడో మందు ప్రియుడు. ఆ దారిలో ఓ క్లబ్ కనిపించింది. దాని ఎదురుగానే ఓ కూడా బోర్డు కనిపించింది. ఆ బోర్డుపైన ఈరోజు మందు ఫ్రీ అని రాసుంది. అంతే ప్రాణం లేసొచ్చిందీ. తృప్తిగా ఆస్వాదిద్దామని లోపలికి వెళ్లాడు. కానీ కొద్ది సేపటికే శవమై బయటకొచ్చాడు. అసలేమైంది? లోపల ఏం జరిగింది. ఈ విషయాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఫ్రీగా ఏదైనా కలిసొచ్చేది ఉంటే మనసులాగుతుంటుంది. మనకు అక్కర్లేకపోయినా ఎక్కడో ఏదో ఆశ. ఉచితంగా వచ్చేదాన్నీ పోగొట్టుకోవడమెందుకు అనుకుంటారు. అంతేకానీ లాభ, నష్టాలు మాత్రం ఆలోచించరు. ఊరకనే ఏ వ్యాపారి నష్టం వచ్చేలా బిజినెస్ చేయడు. కానీ ఆ సంగతి ఎరగక మనుషులు పొరబడి ఎగబడుతుంటారు.
ఓ క్లబ్ (Club) దగ్గర ఫ్రీగా లిక్కర్ బోర్డు కనిపించేసరికి లోపలికి పోయి తాగడం మొదలుపెట్టాడు. అయితే మత్తులో అక్కడ ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. కంటిన్యూగా అలా తాగడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు (died). ఆ తర్వాత అతని జేబులోంచి డబ్బును దొంగిలించి శవాన్ని బయటకు విసిరేసింది ఓ ముఠా. ఆరేళ్ల కిందట సంచలన సృష్టించిన బ్రిటిష్ టూరిస్ట్ హత్య కేసులో (British Tourist Dies) 58 మందిపై తాజాగా పోలాండ్ పోలీసులు అభియోగాలు నమోదు చేసింది. ఓ ముఠాగా ఏర్పడి ఈ తరహా నేరాలు చేస్తున్న క్రమంలో సదరు టూరిస్ట్ ప్రాణం తీశారని పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాపై 700 నేరపూరితమైన అభియోగాలను నమోదు చేశారు.
2017లో బ్రిటన్‌కు చెందిన మార్క్ సీ (36) అనే యువకుడు (Mark C ) పోలాండ్‌లో పర్యటించాడు. ఆ సమయంలో ఓ క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితుడితో కలిసి ఫుల్‌గా మద్యం సేవించాడు. అక్కడ నుంచీ వైల్డ్ నైట్ క్లబ్‌కు చేరాడు. అక్కడ ఉచిత ప్రవేశం బోర్డు చూసి ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఫ్రీగా వస్తుంది కదా? అని మందు తాగుతూ ఉండిపోయారు. అయితే మత్తు ఎక్కువ కావడంతో మార్క్ ఆపేద్దామనుకున్నాడు.. కానీ క్లబ్ నిర్వాహకులు మాత్రం ఊరుకోలేదు. 90 నిమిషాల్లో అతనితో 22 పవర్ ఫుల్ షాట్లు (drinking 22 powerful shots) తాగించారు. దీంతో మార్క్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచిపెట్టాడు. అంతే అతడు చనిపోగానే ఆ ముఠా అతని జేబులో ఉన్న డబ్బు లూఠీ చేసింది. అనంతరం అతని శవాన్ని, మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిని క్లబ్ బయటకు విసిరేశారు.
శవ పరీక్షలో మార్క్ ఒంట్లో బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ 0.4 శాతంగా ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. లిక్కర్ పాయిజన్‌తోనే అతను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీష్ సెంట్రల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆరేళ్లు దర్యాప్తు చేసింది. అధికంగా మద్యం తాగించి మత్తులో మునిగిపోయాక మందు బాబుల నుంచీ డబ్బు, ఆభరణాలు దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేకించి టూరిస్టులే టార్గెట్‌గా ఈ మోసం నడుస్తున్నట్లు పోలీసులు తేల్చారు. తాజాగా ఈ కేసులో హంతక ముఠాపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం వింత.. గాల్లోకి ఎగురుతున్న పాములు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..!
ఇది కూడా చదవండి: Viral News: పండ్ల మార్కెట్లో కూలి పనిచేస్తున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి విస్తుపోయిన పోలీసులు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..!
Updated Date - 2023-04-19T17:01:51+05:30 IST