jackpot: ఆ కూలీ కలలో కూడా ఊహించనంత డబ్బు.. రాత్రికి రాత్రే ఏకంగా రూ.75 లక్షలకు అతడు ఎలా యజమాని అయ్యాడంటే..
ABN, First Publish Date - 2023-03-18T17:12:37+05:30
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో ఎప్పుడూ ఊహించలేం. కానీ అతడికి ఇంటికొచ్చి మరీ అదృష్టం తలుపు తట్టింది. జీవనోపాధి కోసం రాష్ట్రం కానీ రాష్ట్రం
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో ఎప్పుడూ ఊహించలేం. కానీ అతడికి ఇంటికొచ్చి మరీ అదృష్టం తలుపు తట్టింది. జీవనోపాధి కోసం రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చి మరీ ఆ అదృష్టాన్ని దక్కించుకున్నాడు. అతడో వలస కూలీ.. ఆయా ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటాడు. అందులో భాగంగానే పశ్చిమబెంగాల్ నుంచీ కేరళకు వచ్చాడు. రోడ్ల నిర్మాణ పనులు చేసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు. కలలో కూడా ఊహించనంత డబ్బు వచ్చేసింది. ఆ వలస కూలీకి ఒకేసారి అంత డబ్బు ఎక్కడ్నుంచీ వచ్చింది. రాత్రికి రాత్రే లక్షాధికారి ఎలా అయిపోయాడో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
పశ్చిమబెంగాల్ (West Bengal)కు చెందిన ఎస్.కె.బాదేశ్ (SK Badesh) ఉపాధి నిమిత్తం పొట్ట చేత పట్టుకుని కేరళ (Kerala) రాష్ట్రానికి వచ్చాడు. బాదేశ్ ఎర్నాకులంలోని చొట్టానికరలో రోడ్డు నిర్మాణ పనుల్లో కార్మికుడి (laborer)గా పనిచేస్తున్నాడు. బాదేశ్‌కు తరచూ లాటరీ టికెట్లు (lottery) కొనే అలవాటు ఉంది. ఎప్పటిలాగానే కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్త్రీశక్తి లాటరీ దగ్గర కూడా టికెట్ కొనుగోలు చేశాడు. అంతే ఆ టికెట్‌పై మంగళవారం రాత్రి రూ.75 లక్షల (75 lakhs) లాటరీ తగలింది అంటూ ఫోన్ వచ్చింది. అంతే పట్టలేనంత ఆనందానికి గురయ్యాడు. మరోవైపు భయాందోళనకు కూడా గురయ్యాడు. అంత డబ్బును ఎలా కాపాడుకోవాలో తెలియక.. పరుగు.. పరుగున దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ప్రైజ్ మనీకి రక్షణ కల్పించాలని కోరాడు. ఆ టికెటును ఎవరైనా కాజేస్తారేమోనన్న భయంతో బాదేశ్ పోలీసుల (police station)ను ఆశ్రయించాడు. మొదట ఆశ్చర్యపోయిన పోలీసులు.. రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే గతంలో కూడా బాదేశ్ అనేక లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.. కానీ ఎప్పుడు ఆ అదృష్టం వరించలేదు. ఇప్పుడు కూడా ఎలాంటి నమ్మకం పెట్టుకోలేదు. కానీ బాదేశ్‌ను మాత్రం ఈసారి అదృష్టం తలుపు తట్టింది. ఇప్పుడు వచ్చిన డబ్బును తన సొంతూరు తీసుకెళ్లి ఇంటిని నిర్మించుకుంటానని.. అలాగే అక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటానని బాదేశ్ తెలిపాడు.
ఇది కూడా చదవండి: Marriage: పెళ్లి రోజే ఈ వరుడికి చుక్కలు కనిపించాయి.. ఏ గొడవా లేకుండానే వివాహం జరిగింది కానీ..
Updated Date - 2023-03-18T17:13:22+05:30 IST