ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: తండ్రితో కలిసి స్కూటీపై వెళ్తున్న యువతి.. కాగితంపై ఫోన్ నెంబర్ రాసి మరీ ఓ కుర్రాడికి ఇస్తే ఇలా చేశాడేంటి..?

ABN, First Publish Date - 2023-04-11T14:44:02+05:30

ఇలాంటి సంఘటనలు రేర్‌గా జరుగుతుంటాయి. అదేంటో గానీ.. ఆ కుర్రాడికి మాత్రం భలే ఛాన్స్ దక్కింది. అమ్మాయే స్వయంగా హాయ్ చెప్పింది. గాల్లో కిస్ కూడా ఇచ్చిందీ. ఎవరైనా ఏం చేస్తారు.. ఎగిరి గంతులు వేస్తారు. కానీ ఆ అబ్బాయి ఏం చేశాడో తెలిస్తే..

Viral Video
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

యూత్‌లో ఉన్నప్పుడు.. గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండును.. లేదంటే భాయ్‌ఫ్రెండ్ ఉంటే బాగుండును అనుకుంటారు. అందుకోసం చేయని ప్రయత్నాలే ఉండవు. ఆ వయసులో రకరకాలైన ఊహల్లో విహరిస్తుంటారు. కొంత మంది ఎంత ప్రయత్నించినా సఫలం కారు.. ఇంకొందరు ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా అదృష్టం ఇంటి తలుపు తడుతుంది. ఇలాంటి సంఘటనలు రేర్‌గా జరుగుతుంటాయి. అదేంటో గానీ.. ఆ కుర్రాడికి మాత్రం భలే ఛాన్స్ దక్కింది. అమ్మాయే స్వయంగా హాయ్ చెప్పింది. గాల్లో కిస్ కూడా ఇచ్చిందీ. ఎవరైనా ఏం చేస్తారు.. ఎగిరి గంతులు వేస్తారు. కానీ ఆ అబ్బాయి ఏం చేశాడో తెలిస్తే.. మీరు తిడతారో.. లేదంటే మెచ్చుకుంటారో మీ ఇష్టం.

లవర్ కోసం యువతీయువకులు చేసే ప్రయత్నాలూ జీవితంలో ఎన్నో చూసుంటాం. అంతేకాదు అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవ్వడం చూశాం. తాజాగా ఓ భిన్నమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూశాక.. అబ్బాయిలు మాత్రం తిట్టుకోవడం ఖాయం. కొందరు నెటిజన్లు అయితే తలలు బాదుకుంటున్నారు. వీడేంట్రా.. బాబూ అమ్మాయే స్వయంగా ఫోన్ నెంబర్ ఇస్తే ఇలా చేశాడేంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఓ అమ్మాయి (daughter).. తండ్రి (father)తో కలిసి స్కూటీపై వెళ్తోంది (road). అదే దారిలో ఓ అబ్బాయి.. బైక్‌పై వెళ్తున్నాడు. ఆ కుర్రాడిని చూడగానే అమ్మాయి మనసులో ఏం పుట్టిందో ఏమో తెలియదు గానీ అబ్బాయిను చూడగానే హాయ్ చెప్పాలనిపించినట్టుంది. అంతే ఏమీ ఆలోచించకుండా ముందు హాయ్ చెప్పి.. ఆ తర్వాత గాల్లో ముద్దు ఇచ్చింది. పక్కనే డాడీ ఉన్నాడన్న సంగతి కూడా మరిచిపోయి.. అబ్బాయికి ఒక పేపర్ మీద ఫోన్ నెంబర్ రాసిచ్చి ఫోన్ చేయమని సిగ్నల్ ఇచ్చింది. ఆ కుర్రాడికి ఏమైందో ఏమో తెలియదు గానీ.. బైకును తీసుకెళ్లి స్కూటీకి ఎదురుగా ఆపాడు. వెంటనే అమ్మాయి తండ్రి.. స్కూటీ ఆపి ఎందుకు ఆపావు అంటూ ప్రశ్నించాడు. మీ అమ్మాయి.. హాయ్ చెప్పి ఫోన్ నెంబర్ రాసిచ్చింది అంటూ తండ్రికి కంప్లెంట్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి.. అమ్మాయిను చెంపలు వాయించాడు(father hitting). ఈ హఠాత్తు పరిణామంతో ఆమె షాక్‌కు గురైంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఏమో తెలియదుగానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకూ లక్షకు పైగా లైకులు ఇవ్వగా.. 24 లక్షల మంది వీక్షించారు.

ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ‘అయ్యిందా... బాగా అయ్యిందా?’ అంటూ హేళన చేస్తే.. మరికొందరు అమాయకురాలు అనవసరంగా బుక్కైంది అంటూ సానుభూతి తెలియజేశారు. ఇలా ఎవరికి వారు తోచినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. వీడియోలో ఏముందో మీరు కూడా ఒకసారి చూసేయండి.

ఇది కూడా చదవండి: Viral News: సినిమా సీన్ కాదు.. రియల్ లైఫ్‌ హీరో.. మొసలి నోట్లో చిక్కుకున్నా.. చేతిలో ఏ ఆయుధమూ లేకున్నా.. ఎలా బయటపడ్డాడంటే..

ఇది కూడా చదవండి: Viral News: కోళ్లను చంపితే 6 నెలల జైలు శిక్ష ఏంటని అవాక్కవుతున్నారా..? వింత టెక్నిక్‌తో ఓ వ్యక్తి 1100 కోళ్లను ఎందుకు చంపేశాడో తెలిస్తే..

ఇది కూడా చదవండి: Crime News: భర్త చనిపోతే రూ.20 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని పక్కా స్కెచ్.. అంతా భార్య పనేనని 3 రోజుల్లోనే పోలీసులు ఎలా తేల్చారంటే..

ఇది కూడా చదవండి: Viral Video: చేతులెత్తి మొక్కుతున్నాం.. వదిలేయండన్నా వినని గ్రామస్తులు.. అక్కాతమ్ముళ్లను చెట్టుకు కట్టేసి మరీ చిత్రహింసలు పెట్టడం వెనుక..

Updated Date - 2023-04-11T14:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising