ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Woman Kisses Snake: ఈ యువతి ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిపోయింది.. పామును ముద్దు పెట్టుకున్న మరుక్షణంలోనే..!

ABN, First Publish Date - 2023-06-02T15:05:48+05:30

అనుకున్నదొక్కటి... అయినది ఇంకొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. ఈ పాట ఎప్పుడైనా విన్నారా? టాలీవుడ్‌లో మంచి పాపులర్ అయిన సాంగ్. కొన్ని సార్లు మనం ఒకటి తలిస్తే..

Woman Kisses Snake
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుకున్నదొక్కటి... అయినది ఇంకొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. ఈ పాట ఎప్పుడైనా విన్నారా? టాలీవుడ్‌లో మంచి పాపులర్ అయిన సాంగ్. కొన్ని సార్లు మనం ఒకటి తలిస్తే.. ఇంకొకటి జరుగుతుంటుంది. అచ్చం అలాగే జరిగింది ఈ సీన్. అసలేమైంది? మధ్యలో ఈ పాట ఎందుకు వచ్చిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

చాలా మట్టుకు భూజంతువులు మనుషులను చూసి భయపడుతుంటాయి. ఏవో కొన్ని జంతువులు తప్ప.. ఎక్కువ శాతం ఈ సృష్టిలో ఉన్నవి మనుషులకు లోబడతాయి. వాటిని చూస్తే మనుషులకు ఎలా భయమో.. అలాగే మనుషులను చూస్తే వాటికి కూడా అలానే భయం ఉంటుంది. అయితే వాటి జోలికి వెళ్లనంత సేపు మనలను ఏమీ చేయవు.. కానీ కావాలని వాటిని ఇబ్బంది పెడితే మాత్రం వదిలిపెట్టవు. అచ్చం అలాంటి సంఘటనే జరిగింది.

పాములు అంటేనే చాలా మందికి భయం.. వాటిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. పైగా పాములు విషపూరితమైనవి. కాటు వేస్తే ప్రాణాలే పోతాయి. వీటి గురించి తెలుసు కూడా చాలా మంది ప్రాణభయం లేకుండా విష సర్పాలతో ఆటలాడుతుంటారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది (viral video).

పార్కుకు (Zoo Park) వెళ్లిన ఓ యువతి అక్కడ సిబ్బంది చేతిలో ఉన్న స్నేక్‌ను చూసి సంతోష పడింది. ఇంకేముంది. పామును గట్టిగా పట్టుకున్నారు.. ఏం చేయదు అనుకుందో.. ఏమో తెలియదు గానీ ఏకంగా దాన్ని ముద్దాడేందుకు (woman kisses snake) ప్రయత్నించింది. అంతే ఆ పాము ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యువతి ముక్కు.. నోటిని గట్టిగా పట్టేసుకుంది. దీంతో యువతి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. దాన్నుంచీ బయటపడేందుకు ఆ యువతి శతవిధాలా ప్రయత్నించినా వదిలిపెట్టలేదు.

భయాందోళనకు గురైన యువతి రక్షించాలంటూ కేకలు వేసింది. పక్కనే ఉన్న స్నేహితురాలు కూడా కాపాడాలంటూ గట్టి గట్టిగా అరిచింది. మిగతా సిబ్బంది కూడా అప్రమత్తమై పాము నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ యువతి కూడా వదిలించుకోవడానికి గట్టి ప్రయత్నమే చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాములను ఎవరైనా బెదిరించినట్లు భావిస్తే.. అవి ఆలస్యం చేయకుండా ఎటాక్ చేస్తాయి. ఇలా చేయడం ప్రమాదకరమని నెటిజన్లు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-02T15:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising