12 ఏళ్ల క్రితం పెళ్లి.. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా సంతానం అందడం లేదని ఆ భర్త చేసిన నిర్వాకమిదీ..!
ABN, First Publish Date - 2023-02-18T18:19:53+05:30
దంపతుల మధ్య రోజూ ఏదో ఒక సమస్య మీద గొడవలు జరగడం.. కాసేపటికి సర్దుకుపోవడం.. కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా తక్కువ సందర్భాల్లో ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారుతుంటాయి. కొన్నిసార్లు..
దంపతుల మధ్య రోజూ ఏదో ఒక సమస్య మీద గొడవలు జరగడం.. కాసేపటికి సర్దుకుపోవడం.. కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా తక్కువ సందర్భాల్లో ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారుతుంటాయి. కొన్నిసార్లు చిన్న గొడవ కూడా... చాలా పెద్ద సమస్యలకు దారి తీస్తుంటుంది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఆ దంపతులకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇప్పటికీ వారికి సంతానం కలగలేదు. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు ఆ భర్త ఏం చేశాడంటే..
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) బిలాస్పూర్ పరిధి కర్వా గ్రామంలో రతన్‌లాల్ బైగా (35) అనే వ్యక్తి.. భార్య సుకవరియా భాయి (31) తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి సుమారు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహానంతరం ఎవరైనా పిల్లలు కావాలని కోరుకుంటారు. వీరికీ పిల్లలు కావాలని ఎంతో ఆశ ఉండేది. అయితే ఏళ్లు గడుస్తున్నా.. వీరికి సంతానం మాత్రం (childlessness) కలగలేదు. ఈ క్రమంలో దంపతులు (couple) ఇద్దరూ పలు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అయినా ఫలితం మాత్రం లేదు. దీంతో ఇటీవల రతన్‌లాల్ మానసికంగా తీవ్రంగా (Mental depression) కుంగిపోయాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస అయ్యాడు. దీంతో వీరి మధ్య గొడవలు మరింత పెద్దవయ్యాయి. భర్త రోజూ తాగొచ్చి.. భార్యతో గొడవ పడేవాడు. చుట్టుపక్కల వారు మొదట్లో ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసేవారు. అయితే రోజూ గొడవ పడుతుండడంతో అంతా తేలిగ్గా తీసుకునేవారు.
గురువారం రాత్రి కూడా దంపతులు ఇద్దరూ గొడవ పడ్డారు. రోజూ ఇదే తంతు కావడంతో రతన్‌లాల్ సోదరుడితో పాటూ చుట్టు పక్కల వారు కూడా మామూలే అని పట్టించుకోలేదు. అయితే భార్యతో గొడవ పడ్డ (quarrels) రతన్‌లాల్.. చివరకు ఆగ్రహంతో భార్యపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఇంటి వరండాలో తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం రతన్‌లాల్ మృతదేహం ఉరికి వేలాడుతుండడం చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఇంట్లో అతడి భార్య కూడా రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండడం చూసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Updated Date - 2023-02-18T18:19:57+05:30 IST