ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Husband: నా భార్యను చంపేశా.. వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండంటూ పోలీసులకే ఫోన్ చేశాడో భర్త.. అసలేం జరిగిందో తెలిసి..!

ABN, First Publish Date - 2023-07-15T18:10:05+05:30

ఆ దంపతులు ముగ్గురు పిల్లలతో కలిసి సంతోషంగా జీవించేవారు. ఎలాంటి సమస్యలూ లేవనుకుంటున్న సమయంలో అనుకోని సమస్య వచ్చి పడింది. భార్య నిర్వాకం నచ్చని భర్త.. నిత్యం ఆమెతో గొడవ పడేవాడు. ఇటీవల ఆ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ దంపతులు ముగ్గురు పిల్లలతో కలిసి సంతోషంగా జీవించేవారు. ఎలాంటి సమస్యలూ లేవనుకుంటున్న సమయంలో అనుకోని సమస్య వచ్చి పడింది. భార్య నిర్వాకం నచ్చని భర్త.. నిత్యం ఆమెతో గొడవ పడేవాడు. ఇటీవల ఆ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు ఎవరూ ఊహించని విధంగా భార్యను చంపేసిన భర్త.. ‘‘వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి’’.. అంటూ నేరుగా పోలీసులకే ఫోన్ చేశాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఢిల్లీలోని (Delhi) రోహిణి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తికి ఖుష్బుతో 12ఏళ్ల క్రితం (marriage) వివాహమైంది. వీరికి ప్రస్తుతం ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇమ్రాన్ స్థానికంగా ఈ-రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇమ్మాన్‌కు ఇదే ప్రాంతానికి చెందిన రంజిత్ (22) అనే వ్యక్తి స్నేహితుడు. దీంతో తరచూ ఇమ్మాన్ ఇంటికి వస్తూ, పోతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇమ్రాన్ భార్యతో రంజిత్‌కు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇది కాస్త కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి (extramarital affair) దారి తీసింది. అప్పటి నుంచి ఇమ్రాన్ లేని సమయంలో తరచూ ఇంటికి వెళ్తూ ఖష్బూతో కలుస్తూ ఉండేవాడు.

Unique Divorce: పెళ్లయిందన్న ఆనందంలో ఉన్న వధువుకు.. భారీ షాకిచ్చిన వరుడు.. రెండు గంటలకే విడాకులిచ్చేశాడు..!

ఇద్దరూ దూరంగా వెళ్లిపోయి కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి వివాహేతర సంబంధం ఇటీవల ఇమ్మాన్‌కు తెలిసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. అయినా ఆమె తన ప్రియుడిని తరచూ కలుస్తూ ఉండేది. దీంతో ఇమ్రాన్‌.. వారిపై మరింత ఆగ్రహం పెంచుకున్నాడు. ఇటీవల ఓ రోజు భార్యతో పాటూ ఆమె ప్రియుడిని కూడా హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: ఉన్నట్టుండి పొలంలోకి పెద్ద పులి వచ్చినా.. ఉలుకూ పలుకూ లేదు.. పైగా ఏమాత్రం భయం లేకుండా..

Updated Date - 2023-07-15T18:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising