woman crime: పని పనిషి వాట్సప్ డీపీ చూడగానే భార్యకు అనుమానం.. ఫొటోను మరింత జూమ్ చేయగా.. షాకింగ్ సీన్.. చివరకు ఏం తేలిందంటే..
ABN, First Publish Date - 2023-05-20T19:59:34+05:30
కొందరు విధి లేని పరిస్థితుల్లో నేరాలు చేస్తుంటే.. మరికొందరు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో చోరీలకు పాల్పడుతుంటారు. మరికొందరు అందరి ముందూ రిచ్‌గా కనిపించాలనే కోరికతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇందుకోసం..
కొందరు విధి లేని పరిస్థితుల్లో నేరాలు చేస్తుంటే.. మరికొందరు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో చోరీలకు పాల్పడుతుంటారు. ఇంకొందరు అందరి ముందూ రిచ్‌గా కనిపించాలనే కోరికతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇందుకోసం ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడరు. అయితే ఏదో రోజు.. ఏదో ఒక రకంగా వారి తప్పులు మొత్తం బయటపడుతుంటాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. పని మనిషి వాట్సప్ డీపీ చూడగానే భార్యకు అనుమానం కలిగింది. ఫొటోను మరింత జూమ్ చేసి చూసి షాక్ అయింది. చివరకు విచారించగా ఏం తెలిసిందంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్ పరిధి టీటీ నగర్‌కు చెందిన భూపేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి.. షాజహానాబాద్ ప్రాంతంలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తుంటాడు. ఇతడి భార్య ఇంటి పనులు, మిగతా కార్యకలాపాలు చూసుకుంటూ ఉంటుంది. భూపేంద్ర శ్రీవాస్తవ డాక్టర్ కావడంతో బాగా సంపాదించాడు. దీంతో వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవు. భార్యకు ఎలాంటి కష్టం కలగకుండా ఇంట్లో పని మనిషిని (maid) కూడా నియమించాడు. అయితే ఇటీవల వీరికి ఊహించని సమస్య వచ్చి పడింది. కొద్ది రోజులుగా వీరి ఇంట్లో నగలు, నగదు మాయమవుతూ వస్తున్నాయి. మొదట దంపతులకు (couple) ఎలాంటి అనుమానమూ కలగలేదు. అయితే రోజూ రోజుకూ డబ్బు, నగలు మాయమవుతూనే ఉండడంతో అనుమానం కలిగింది.
వారి ఇంట్లో పనిమనిషి తప్ప కొత్త వారు ఎవరూ లేరు. దీంతో ఎందుకైనా మంచిదని ముందుగా ఆమెను పని నుంచి తొలిగించారు. అయితే అప్పటికే లక్షల రూపాయల విలువ చేసే నగలు కనిపించకుండా పోయాయి. ఈ క్రమంలో ఇటీవల భూపేంద్ర భార్య.. తన మొబైల్లో వాట్సప్ మెసేజ్‌లు (WhatsApp messages) చూసుకుంటూ ఉండగా.. పని మనిషి డీపీ (Whatsapp dp) కనిపించింది. ఎప్పుడూ లేనిది పని మనిషి చాలా రిచ్‌గా కనిపించడంతో అనుమానం కలిగింది. ఫొటోను బాగా జూమ్ చేయగా షాకింగ్ సీన్ కనిపించింది. పని మనిషి చెవి పోగులు, తన చెవి పోగులు (earrings) ఒకేలా ఉండడంతో వెంటనే ఇంట్లోని బీరువాలో చెక్ చేసింది. అందులో చెవి పోగులు కూడా లేకపోవడంతో వెంటనే భర్తకు సమాచారం అందించింది.
దంపతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చివరకు పని మనిషిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. పోలీసుల విచారణలో.. తనకు నెలకు రూ.8జీతం మాత్రమే వస్తోందని, కాంట్రాక్టు కూలీగా చేస్తున్న తన భర్త ఆదాయం కూడా అంతంతమాత్రమే అని చెప్పింది. ఇంటి ఖర్చుల కోసం నెలకు రూ.20వేల వరకు అవసరం ఉందని, అందుకే విధిలేని పరిస్థితుల్లో చోరీ (Theft of jewelry and cash) చేసినట్లు తెలిపింది. ఆమె వద్ద నుంచి రూ.50లక్షల విలువైన బంగారు కంకణాలు, గాజులు, నెక్లెస్ తదితరాలతో పాటూ రూ.5.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పని మనిషి రెండస్తుల ఇల్లు, లోపల ఏసీ, ఖరీదైన వస్తువులు, సీసీ కెమెరాలు ఇలా అన్ని హంగులూ ఉండడం చూసి పోలీసులతో పాటూ స్థానికులూ షాక్ అయ్యారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-05-20T20:24:45+05:30 IST