ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife-Husband: లిప్ స్టిక్ తెచ్చిన తంటా.. ఇలాంటి భర్త నాకొద్దంటూ.. పెళ్లయిన మూడు నెలలకే షాకిచ్చిన భార్య.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2023-10-17T21:00:17+05:30

చిన్న చిన్న సమస్యలపై గొడవపడుతూ.. గంటల వ్యవధిలో కలిసిపోయే దంపతులను చూశాం. అలాగే ఇంకొందరు దంపతులు చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని చివరకు పంచాయితీల వరకూ వెళ్తుంటారు. ఈ క్రమంలో గ్రామపెద్దలు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో సర్దుకుపోతుంటారు. ఇలాంటి...

ప్రతీకాత్మక చిత్రం

చిన్న చిన్న సమస్యలపై గొడవపడుతూ.. గంటల వ్యవధిలో కలిసిపోయే దంపతులను చూశాం. అలాగే ఇంకొందరు దంపతులు చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని చివరకు పంచాయితీల వరకూ వెళ్తుంటారు. ఈ క్రమంలో గ్రామపెద్దలు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో సర్దుకుపోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ విచిత్ర సమస్యకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దంపతుల మధ్య లిప్ స్టిక్ కారణంగా సమస్య వచ్చిపడింది. పెళ్లయిన మూడు నెలలకే భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఆగ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి మూడు నెలల క్రితం ఓ యువతితో వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే మూడు నెలల తర్వాత వీరి కుటుంబంలో ఊహించని సమస్య వచ్చి పడింది. ఓ రోజు రాత్రి సమయంలో భార్య లిప్ స్టిక్ వేసుకుని పడుకుంది. అయితే ఉదయం లేచి చూసేసరికి ఆమె లిప్ స్టిక్ (Lipstick) మొత్తం మాయమైంది. ఇది చూసిన భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘‘రాత్రి ఉన్న లిప్ స్టిక్.. ఉదయానికి ఎందుకు లేకుండా పోయింది’’.. అంటూ భార్యతో (Quarrels with wife) గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆమెను విపరీతంగా కొట్టి వేధించాడు. దీంతో సమస్య చివరకు పంచాయితీ వరకూ వెళ్లింది.

IT Jobs Alert: నిరుద్యోగులూ.. బీ అలెర్ట్.. భారీ రిక్రూట్‌మెంట్‌కు రెడీ అవుతున్న టీసీఎస్.. ఏకంగా 40 వేల జాబ్స్..!

పెద్దమనుషులు దంపతలుకు ఎంత నచ్చజెప్పాలని చూసినా.. కలిసుండేందుకు మాత్రం వారు అంగీకరించలేదు. చివరకు అక్టోబర్ 16న ఈ సమస్య ఫ్యామిలీ కౌన్సెలింగ్ (Family counselling) సెంటర్ వరకూ వెళ్లింది. ఒకరోజు విచారణ అనంతరం వారిని తిరిగి మరుసటి రోజు నమ్మని చెప్పారు. అయితే చివరకు భర్త దిగొచ్చాడు. కౌన్సెలింగ్‌లో అందరి ముందు తన భార్యను బాగా చూసుకుంటానని చెప్పాడు. ఇకపై గొడవలు పెట్టుకోనని, భార్య ఖర్చుల కోసం నెలకు రూ.2వేలు కూడా చెల్లిస్తానని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. అయితే చివరకు భార్య మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఇలాంటి భర్తతో కలిసేది లేదని భీష్మించుకుంది. అతడితో విడాకులు తీసుకునేందుకు సిద్ధపడడంతో.. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Train Video: అంకుల్ అని పిలిస్తే కాలదా ఏంటీ..? రైల్లో వెళ్తున్న ఓ కుర్రాడు అంకుల్ అని పిలవగానే ఆ వ్యక్తి రియాక్షన్ చూస్తే..!

Updated Date - 2023-10-17T21:00:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising