Ambulance: నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. అదుపుతప్పి నదిలో పడిపోయిన అంబులెన్స్.. చివరకు జరిగింది ఇదీ..!
ABN, First Publish Date - 2023-12-06T17:02:23+05:30
గర్భిణులకు ప్రసవ సమయంలో పలు రకాల ఇబ్బందులు ఎదురవడం చూస్తూనే ఉంటాం. మారుమూల గ్రామాల్లోని వారికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సమయానికి అంబులెన్సులు రాకపోవడం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి...
గర్భిణులకు ప్రసవ సమయంలో పలు రకాల ఇబ్బందులు ఎదురవడం చూస్తూనే ఉంటాం. మారుమూల గ్రామాల్లోని వారికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సమయానికి అంబులెన్సులు రాకపోవడం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఘటనలు నిత్యం ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. అయితే మార్గమధ్యలో ఊహించని విధంగా అంబులెన్స్ నదిలో పడిపోయింది. చివరకు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఖర్గోన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బేడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో రచన అనే గర్భిణి మహిళకు (pregnant woman) ఇటీవల ఓ రోజు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమె భర్త అనిల్.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. కాసేపటికి అంబులెన్స్ గ్రామానికి చేరుకుంది. గర్భిణిని ఎక్కించుకుని ఆస్పత్రికి బయలుదేరింది. అయితే మార్గమధ్యలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాహనం అదుపు తప్పి పిప్పీ ఖేడా సమీపంలోని (ambulance fell into canal) కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ నడుపుతున్న మహేంద్ర సింగ్(26) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న వారిని రక్షించారు.
ఈ ప్రమాదంలో గర్భిణితో పాటూ ఆమె భర్త, మరో ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. మృతి చెందిన మహేంద్ర అంబులెన్స్ డ్రైవర్ కాదని విచారణలో తెలిసింది. సమయానికి డ్రైవర్లు లేకపోవడంతో వైద్య సిబ్బంది అయిన మహేంద్ర.. వాహనాన్ని నడిపాడని పోలీసుల తెలిపారు. ఆ సమయంలో డ్రైవర్లు ఎందుకు అందుబాటులో లేరనే అంశంపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-12-06T17:02:24+05:30 IST