Crime news: ‘‘మీ భర్తకు చేతబడి జరిగింది’’.. అని స్నేహితులే చెప్పడంతో కంగారుగా వెళ్లిన భార్య.. చివరకు వారు చెప్పినట్లే పూజలో కూర్చోవడంతో..
ABN, First Publish Date - 2023-09-17T21:45:11+05:30
కొందరు ఎదుటివారి బలహీనతలే తమ పెట్టుబడిగా వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటారు. ఏదో జరిగిపోతోందని నమ్మించి, చివరకు దారుణంగా మోసం చేస్తుంటారు. మహిళల విషయంలో ఇలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. పూజల పేరుతో అనేక నేరాలకు పాల్పడడం తరచూ...
కొందరు ఎదుటివారి బలహీనతలే తమ పెట్టుబడిగా వివిధ రకాల నేరాలకు పాల్పడుతుంటారు. ఏదో జరిగిపోతోందని నమ్మించి, చివరకు దారుణంగా మోసం చేస్తుంటారు. మహిళల విషయంలో ఇలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. పూజల పేరుతో అనేక నేరాలకు పాల్పడడం తరచూ ఎక్కడోచోట చూస్తూనే ఉన్నాం. తాజాగా, మహారాష్ట్రలో ఓ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. ‘‘మీ భర్తకు చేతబడి జరిగింది’’.. అని అతడి స్నేహితులే చెప్పడంతో భార్య నమ్మింది. అలాగే వారు చెప్పిన విధంగా పూజలో కూర్చోవడంతో చివరకు దారుణం జరిగింది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర (Maharashtra) పాల్ఘర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. స్థానిక తలసరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇదిలావుండగా, భర్త స్నేహితులు కొంతమంది తరచూ వీరి ఇంటికి వస్తూ ఉండేవారు. తన భర్త స్నేహితులే కావడంతో భార్య కూడా వారితో సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో వారు 2019లో దారుణానికి పాల్పడ్డారు. ఓ రోజు భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లిన వారు.. ‘‘మీ భర్తకు ఎవరో చేతబడి (Black magic) చేశారు.. వెంటనే పూజలు చేయిస్తే మంచి జరుగుతుంది’’.. అని ఆమెతో చెప్పారు. తన భర్తకు తెలిసిన వారే ఈ మాట చెప్పడంతో నిజమేమో అని ఆమె నమ్మింది. ‘‘ఏం చేయాలో చెప్పండి.. ఎలాగైనా నా భర్తను కాపాడుకోవాలి’’.. అని ఆమె అనడంతో వెంటనే వారి ప్లాన్‌ను అమలు చేశారు. పూజలు చేయాలంటూ తమకు సంబంధించిన ఏకాంత ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లారు.
అక్కడ పూజల్లో ఆమెను కూర్చోబెట్టి కాసేపు నాటకమాడారు. మధ్యలో ఆమెతో మత్తు మందు కలిపిన తీర్థం తాగించారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెపై తర్వాత ఐదుగురు (Misbehavior with woman) నిందితులూ అత్యాచారానికి పాల్పడ్డారు. మెలకువలోకి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న ఆమె వారిని నిలదీసింది. ఎవరికైనా చెబితే మీ భర్తను చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. ఇలా తరచూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు. ఇటీవల ఆమె నుంచి నగలు, నగదు కూడా తీసుకున్నారు. రోజు రోజుకూ చిత్రహింసలు పెరిగిపోవడంతో ఇటీవల బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రవీంద్ర భాటే, దిలీప్ గైక్వాడ్, గౌరవ్ సాల్వి, మహేంద్ర కుమావత్, గణేష్ కదమ్‌లను అరెస్ట్ చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-09-17T21:45:11+05:30 IST