ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: కేజీఎఫ్ సినిమా సీన్.. రియల్ లైఫ్‌లో రిపీట్.. ఓ కార్మికుడు తప్పించుకుని వెళ్లి పోలీసులకు చెప్పడంతో వెలుగులోకి విస్తుపోయే దారుణం..!

ABN, First Publish Date - 2023-06-21T19:43:01+05:30

వందల మంది ప్రజలను కొందరు బానిసలుగా మార్చి బంగారు గనుల్లో పనులు చేయిస్తుంటారు. ఎదురుతిరిగిన వారిని చంపడం లేదా వివిధ రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తుంటారు. విధిలేని పరిస్థితుల్లో వారంతా అక్కడే పని చేయాల్సి వస్తుంది. చివరకు హీరో ఎంటరై ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వందల మంది ప్రజలను కొందరు బానిసలుగా మార్చి బంగారు గనుల్లో పనులు చేయిస్తుంటారు. ఎదురుతిరిగిన వారిని చంపడం లేదా వివిధ రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తుంటారు. విధిలేని పరిస్థితుల్లో వారంతా అక్కడే పని చేయాల్సి వస్తుంది. చివరకు హీరో ఎంటరై వారినందరినీ అక్కడి నుంచి విముక్తుల్ని చేస్తాడు. ఇది స్థూలంగా కేజీఎఫ్ సినిమా (KGF movie) కథ. అయితే తాజాగా మహారాష్ట్రలో ఈ సినిమా సీన్ రిపీట్ అయింది. ఓ కార్మికుడు తప్పించుకుని వెళ్లి పోలీసులకు చెప్పడంతో వెలుగులోకి విస్తుపోయే దారుణం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని (Maharashtra) ఉస్మానాబాద్ జిల్లా ధోకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఖామస్‌వాడి, వాఖర్‌వాడి గ్రామాల్లో బావులు తవ్వే పనులు చేపట్టారు. ఇందుకోసం మూడు నెలల క్రితం కాంట్రాక్టర్లు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన 11మంది కూలీలను రప్పించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. పని ప్రారంభించగానే సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా కాంట్రాక్టర్లుగా (Contractors) ఉన్న వారు కాస్త.. రాక్షసుల్లా మారిపోయారు. కూలీలను ఉదయం ఏడు గంటలకు బావిలోకి దించి, ఏకదాటిగా 12గంటల పాటు పని చేయించేవారు. తర్వాత బావి నుంచి బయటకు తీసి, పారిపోకుండా గొలుసులతో బంధించేవారు. బావిలో పని చేస్తున్న (Well works) సమయంలో రోజుకు ఒక పూట మాత్రమే భోజనం పెట్టేవారు.

Viral Video: ఈ కుర్రాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం ఖాయం.. మామిడి కాయల్ని ఇతడు అమ్ముతున్న టెక్నిక్‌ను చూస్తే..!

మధ్యలో బావి నుంచి బయటకు రాకుండా లోపలే మరుగుదొడ్డి కూడా ఏర్పాటు చేశారు. దీంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూపాయి డబ్బులు కూడా ఇవ్వకుండా పని చేయించుకునేవారు. ఎదురుతిరిగిన వారిని చిత్రహింసలకు గురి చేసేవారు. ఇటీవల వారిలో ఓ కూలీ అక్కడి నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదుతో శనివారం రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు గ్రామాల పరిధిలో బావి పనులు చేస్తున్న మిగతా వారిని రక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కూలీలను ఇలాంటి కాంట్రాక్టర్లకు విక్రయిస్తున్న ఏజెంట్లను పట్టుకునే పనిలో పడ్డారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: ఇలాంటి డ్రెస్‌తో డాన్స్ ఎలా సాధ్యమంటూ వధువును అభినందించిన వరుడు.. విషయం తెలుసుకుని అవాక్కయిన అతిథులు..

Updated Date - 2023-06-21T20:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising